For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మింట్ ఆయిల్ లో దాగి ఉన్న అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ...

|

సాధారణంగా ప్రజలు వ్యాధుల భారీన పడటం అనేది సహజం, ఈ వ్యాధులను నివారించుకోవడం కోసం ఎన్నో ఔషధాలను ఉపయోగిస్తున్నారు. ఎన్ని ఔషధాలు ఉపయోగించినా, కొన్ని వ్యాధులను నివారించుకోలేని స్థితిలో ఉన్నారు. ప్రపంచంలో మొత్తంలో మోడ్రన్ మెడిసిన్స్ రాకముందు, నేచురల్ రెమెడీస్ కు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల నుండి నేచురల్ మరియు ఆయుర్వేధిక్, హెర్బల్ రెమెడీస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారు.

అది శ్వాస సమస్యలు కానీవ్వండి, చర్మ సమస్యలు కానీవ్వండి ఎలాంటి సమస్యలైన ఈ నేచురల్ రెమెడీస్ తోనే వ్యాధులను ఎఫెక్టివ్ గా తగ్గించుకొనే వారు. వ్యాధులను తగ్గించుకోవడం మాత్రమే కాదు, వాటిని పూర్తిగా నిర్మూలించే వారు . అటువంటి రిమార్కబుల్ నేచురల్ రెమెడీస్ లో ఒక ఎఫెక్టివ్ హెల్తీ బెనిఫిషియల్ హోం రెమెడీ పిప్పర్ మింట్ ఆయిల్. ఈ నూనెను పుదీనా నుండి తయారుచేస్తారు. పెప్పర్ మింట్ నూనె అన్ని ముఖ్యమైన నూనెలన్నింటిలో ఎంతో వైవిధ్యమున్న, అత్యంత ఉపయోగకరమైన నూనె. దీనిలో విటమిన్ ఏ, సి; మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, పొటాషియం, రాగి వంటి ఖనిజాలు ఉన్నాయి. దీనిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి.

ముఖ్యంగా దీన్ని కులినరీ కోసం ఉపయోగిస్తుంటారు, స్కిన్ మరియు హెయిర్ కు ఉపయోగించే ప్రొడక్ట్స్ లో పిప్పర్ మింట్ ఆయిల్ ను ఉపయోగిస్తున్నారు. ఇంకా కొన్ని డైటరీ సప్లిమెంట్స్ లో కూడా పిప్పర్ మింట్ ఆయిల్ ను గ్రేట్ గా ఉపయోగిస్తున్నారు .

అయితే ఈ హెర్బల్ రెమెడీలో దాగున్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు చాలా మందికి తెలియదు . అందుకే దీని వాడకం కూడా చాలా తక్కువ . ఇది ఒక నేచురల్ కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది . నొప్పులను తగ్గింస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వివిధ రకాల జబ్బులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఇన్ని సుగుణాలున్నా పెప్పర్ మెంట్ ఆయిల్ మనకు తరచు వచ్చే ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది. ఒక్కో ఆరోగ్య సమస్య మీద ఒక్కో విధంగా పనిచేసి వివిధ రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. మరికొన్ని మోస్ట్ అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ను ఈ క్రింది స్లైడ్ లో...

1. నొప్పి నివారినిగా పనిచేస్తుంది:

1. నొప్పి నివారినిగా పనిచేస్తుంది:

పెప్పర్ మింట్ ఆయిల్ నేచురల్ పెయిన్ రిలీవర్, పెప్పర్ మింట్ ఆయిల్ నేచురల్ రిఫ్రిజరెంట్. ఇది ఒక కూలింగ్ ఐస్ ప్యాక్ లా పనిచేస్తుంది, నొప్పుల నుండి త్వరగా ఉపశమనం కలిగస్తుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయడం వల్ల గాయాలను, మజిల్ స్పార్మ్ , ఆర్థరైటిస్ నొప్పులను నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

2. వికారం మరియు తలనొప్పిని తగ్గిస్తుంది:

2. వికారం మరియు తలనొప్పిని తగ్గిస్తుంది:

తలనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది: పెప్పర్ మింట్ నూనెను తలనొప్పుల నుండి ఉపశమనం పొందటానికి కూడా ఉపయోగిస్తారు. ఒక చేతిరుమాలు పై చల్లిన లేదా మీ మణికట్టు పై పూసిన కొన్ని చుక్కల పెప్పర్ మింట్ నూనెను పీల్చడం వలన బాధాకరమైన తలనొప్పి తగ్గుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

3. శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది:

3. శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది:

పెప్పర్ మింట్ నూనెలో ఉన్న మెంథాల్ శ్వాస మార్గాన్ని అడ్డు లేకుండా చేయడ౦లో సాయపడుతుంది. ఒక కఫహరిణిగా పనిచేస్తుంది. కఫంతో కూడిన జలుబుకు, మరింత తీవ్రమైన సైనసైటిస్, అస్తమా, బ్రాంకైటిస్ ల నుండి ఉపశమనం కల్గిస్తుంది. పెప్పర్ మింట్ నూనెను ఛాతీ పై నెమ్మదిగా మర్దన చేయడానికి వాడండి లేదా ఒక వెపోరైసర్ ద్వారా లోపలికి పీల్చండి. మీ నాసికలో సమస్య తగ్గడాన్ని మీరు గమనిస్తారు.

4. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

4. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

వ్యాధినిరోధకశక్తి తగ్గినప్పుడు, త్వరగా జబ్బులకు గురౌతుంటారు. అంతే కాదు, తరచూ జబ్బు పడుతూనే ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. . ఈ మింట్ ఆయిల్ ను డైలీ డైట్ లో చేర్చుకోవాలి . ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల ఇది ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది.

5. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది:

5. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది:

మరో గ్రేట్ హెల్త్ బెనిఫిట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే , హెల్తీ లైప్ స్టైల్ ను పొందవచ్చు. వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

6. బ్యూటిఫుల్ స్కిన్ అండ్ హెయిర్ కోసం:

6. బ్యూటిఫుల్ స్కిన్ అండ్ హెయిర్ కోసం:

ఈ పిప్పర్ మింట్ ఆయిల్ కూలింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది స్కిన్ మరియు హెయిర్ రిలేటెడ్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . మొటిమలను ,మచ్చలను నివారిస్తుంది మరియు చుండ్రును ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. బ్యూటిఫుల్ స్కిన్ అండ్ హెయిర్ పొందడానికి ఇది ఒక గ్రేట్ ఆయిల్ .

7. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది:

7. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది:

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్: యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యు టి ఐ) ను తగ్గించడానికి పెప్పర్ మింట్ నూనెను ఉపయోగించవచ్చు. అయితే, ఈ విషయాన్నీ నిర్ధారించడానికి పూర్తిస్థాయి శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహి౦చవలసి ఉంది.

8. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

8. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

పెప్పర్ మింట్ నూనె అజీర్తిని తగ్గిస్తుందని తెలుపుతారు. పెప్పర్ మింట్ నూనెను ఆహారంలో సువాసన కోసం వాడవచ్చు లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల కలిపి భోజనం తర్వాత తీసుకోండి. సహజంగా కడుపుబ్బరం తగ్గించే గుణం ఉన్నందున గ్యాసును తగ్గిస్తుంది. కడుపు, పేగులలో ఆకస్మిక బాధను తగ్గించి, అస్తవ్యస్థ కడుపుకు ఉత్తమ విరుగుడుగా పనిచేస్తుంది.

English summary

8 Amazing Health Benefits Of Peppermint Oil

One such remarkable natural remedy that is highly beneficial for your health is peppermint oil. It is an essential oil derived from the plant of peppermint. It is often used for culinary purposes, in skin and hair care products and even in a few dietary supplements.
Story first published:Monday, May 23, 2016, 17:15 [IST]
Desktop Bottom Promotion