For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజంతా అలసిపోతున్న ఫీలింగ్ వెంటాడటానికి కారణాలు..!!

By Swathi
|

పని చేసినా.. ఏ పని చేయకపోయినా నీరసంగా మారిపోతున్నారా ? ఊరికినే అలసటగా అనిపిస్తోందా ? రోజంతా ఇలాంటి ఫీలింగ్ వెంటాడుతోందా ? అయితే.. మిమ్మల్ని అలసటకు గురిచేస్తున్న కారణాలేంటో ఒక్కసారి పరిశీలించాల్సిందే. లేదంటే.. మీరు మరింత నిరుత్సాహానికి లోనవుతారు.

మీరు ఎన్ని గంటలు నిద్రపోతే.. అంత ఫ్రెష్ గా మీ ముఖం కనిపిస్తుంది. అలాగే మీ నిద్ర మీ ముఖ వర్చస్సుని పెంచుతుంది. రోజంత ముఖం ఫ్రెష్ గా ఉండాలంటే కంటినిండా నిద్రపోవాలి. ఇదొక్కటే కాదు.. మీరు రోజంత అలసిపోవడం వెనక చాలా కారణాలే ఉంటాయి.

నిరంతరం మీరు ఎందుకు అలసిపోయినట్టు ఫీలవుతున్నారో తెలుసుకోవాలంటే.. ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. మీ అలవాట్లే మీ ఎనర్జీని కరిగించేస్తాయి. కాబట్టి.. మీకున్న అలవాట్లు సరైనవేనా..? మీరు చేస్తున్న పనుల్లో పొరపాట్లేంటి ? మీరు ఎప్పుడు అలసిపోయినట్టు ఫీలవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

సరిగ్గా నీళ్లు తాగకపోవడం

సరిగ్గా నీళ్లు తాగకపోవడం

మనుషులకు చాలా ముఖ్యమైన వాటిలో నీళ్లు ఒకటి. ఎప్పుడైతే మీరు డీహ్రైడ్రేటెడ్ కి లోనవుతారో.. అప్పుడు అలసిపోయినట్టు ఫీలవుతారు. శరీరం డీహ్రైడేట్ అయినప్పుడు బ్లడ్ వాల్యూమ్ తగ్గుతుంది, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ శరీరానికి సరైన మోతాదులో అందవు. దీనివల్ల అలసిపోతారు.

ఐరన్ తీసుకోకపోవడం

ఐరన్ తీసుకోకపోవడం

ఐరన్ లోపం వల్ల కేవలం నీరసం, అలసట మాత్రమే కాదు.. చిరాకుకి కారణమవుతుంది. శరీరంలో ఐరన్ తగ్గితే.. ఆక్సిజన్ కండరాలు, కణాలకు తక్కువగా అందుతుంది. అలాగే అనీమియాకి దారితీస్తుంది. కాబట్టి కిడ్నీ బీన్స్, ఎగ్స్, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్ తీసుకోవడం మంచిది.

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం

మనందరికీ తెలుసు బ్రేక్ ఫాస్ట్ ఎంత అవసరమో. మెటబాలిజంను పెంచడానికి బ్రేక్ ఫాస్ట్ సహాయపడుతుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. చాలా అలసటగా అనిపిస్తుంది. మంచి ఫ్యాట్, ప్రొటీన్స్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. 2 స్లైస్ ల వోల్ వీట్ బ్రెడ్, ఒక గ్లాసు స్కిమ్డ్ మిల్క్ తీసుకుంటే మంచిది.

వ్యాయామం

వ్యాయామం

ఉదయం నిద్రలేవగానే జిమ్, వాకింగ్ ఏదో ఒకటి చేయడం వల్ల.. చాలా ఫ్రెష్ గా ఫీలవుతారు. వర్కవుట్ చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయి.. రోజంతా ఎనర్జిటిక్ గా ఫీలవుతారు.

ఎక్కువగా కష్టపడటం

ఎక్కువగా కష్టపడటం

వర్క్ గురించి ఎక్కువగా చింతించడం, ఒత్తిడికి లోనవడం, ఎక్కువ సమయం పనిచేయడానికి టైం స్పెండ్ చేయడం వల్ల.. మీరు అలసిపోతారు. ఒత్తిడి.. సైలెంట్ కిల్లర్ అని మరిచిపోకండి.

నిద్రకు ముందు మందు

నిద్రకు ముందు మందు

నిద్రకు ముందు ఒక గ్లాస్ వైన్ లేదా మీకు ఇష్టమైన డ్రింక్ తాగడం వల్ల ఆ రోజు హ్యాపీగా ముగుస్తుంది. హ్యాపీగా నిద్రపోతారు. కానీ.. ఇలాంటి అలవాటు వల్ల శరీరంలో జరిగే మార్పులు ఉదయం దుష్ప్పభావం చూపుతాయి.

ఫోన్, ఈమెయిల్స్

ఫోన్, ఈమెయిల్స్

మీరు ఎల్లప్పుడూ మీ ఫోన్, ఈమెయిట్స్ చెక్ చేసుకుంటూ ఉంటారా ? ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల.. మీ నిద్రపై దుష్ర్పభావం చూపుతుంది. దీనివల్ల మీరు ఎక్కువగా అలసిపోతున్నట్టు ఫీలవుతారు.

కాఫీ లేకుండా ఉండకపోవడం

కాఫీ లేకుండా ఉండకపోవడం

కాఫీ మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. కానీ.. ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. ఇది శరీరానికి మంచిది కాదు. కాఫీ ఎక్కువగా తీసుకుంటే.. నిద్రకు భంగం తీసుకొస్తుంది. అలాగే.. ఉదయం నిద్రలేవలేకపోతారు.

English summary

8 reasons you feel tired all day

8 reasons you feel tired all day. Here are some reasons why you may be constantly feeling worn out, without knowing about them. Mind you, these habits are actually draining your energy.
Story first published:Wednesday, April 27, 2016, 17:02 [IST]
Desktop Bottom Promotion