For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకున్న అలవాట్లే మీ పంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయా ?

తెల్లగా మెరిసిపోవాల్సిన పళ్లు గారపట్టి, పుచ్చు పట్టి.. అసహ్యంగా కనిపిస్తున్నాయంటే.. అందుకు మీ అలవాట్లు, మీరు చేసే పొరపాట్లే కారణం.

By Swathi
|

వైట్ షర్ట్ పై కాఫీ లేదా టీ పడితే.. ఏమవుతుంది ? అసహ్యంగా కనిపిస్తుంది. అలాగే.. మీ పళ్లు కూడా. తెల్లగా మెరిసిపోవాల్సిన పళ్లు గారపట్టి, పుచ్చు పట్టి.. అసహ్యంగా కనిపిస్తున్నాయంటే.. అందుకు మీ అలవాట్లు, మీరు చేసే పొరపాట్లే కారణం.

8 shocking ways you are harming your teeth

మనకున్న కొన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్, ఆహారం తిన్న తర్వాత పళ్లను శుభ్రం చేసుకోకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల పళ్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. అయితే కొంతమంది రోజుకి రెండుసార్లు బ్రష్ చేస్తున్నా.. కూడా పళ్లు పచ్చగా మారిపోతుంటాయి.

ఇలా ఎంత జాగ్రత్త తీసుకున్నా పళ్లు పచ్చగా మారుతున్నాయని ఫీలయ్యేవాళ్ల సంఖ్య ఎక్కువ. ఇలా పళ్లు పచ్చగా మారడానికి కారణాలేంటని ఎప్పుడూ ఊహించలేదా ? అందుకు.. మీరు చేసే పొరపాట్లు, ఆహారపు అలవాట్లే కారణమంటున్నారు నిపుణులు. మరి.. పళ్లపై హాని చేసే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకుందాం..

తరచుగా గ్రీన్ టీ

తరచుగా గ్రీన్ టీ

గ్రీన్ టీ శరీరానికి చాలా అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది. కానీ.. చాలా తరచుగా తాగితే.. పళ్లకు హాని చేస్తుంది. కాబట్టి గ్రీన్ టీ తాగిన 30 నిమిషాల తర్వాత బ్రష్ చేసుకోవడం మంచిది.

లెమనాయిడ్

లెమనాయిడ్

ఒక గ్లాసు లెమనాయిడ్ తాగడం మంచిదే. కానీ నిమ్మలో ఎక్కువగా ఉండే ఎసిడిక్ కంటెంట్ పళ్లపై ఎనామిల్ ని తొలగిస్తుంది. ఈ ఎనామిల్ పళ్లను తెల్లగా మెరిసేలా చేస్తుంది.

స్పోర్ట్స్ డ్రింక్స్

స్పోర్ట్స్ డ్రింక్స్

స్పోర్ట్స్ డ్రింక్స్ శరీరానికి మంచిది అనడం అపోహ. ఎందుకంటే.. ఇందులో పంచదార ఎక్కువగా ఉంటుంది. ఇది నోట్లో బ్యాక్టీరియా చేరుకోవడానికి కారణమవుతుంది. ఇలా.. ఈ డ్రింక్స్ పళ్లకు హానిచేస్తాయి.

వైట్ వైన్

వైట్ వైన్

రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిది. కానీ ఎల్లో కలర్ లో ఉండే వైట్ వైన్ పళ్లను డ్యామేజ్ చేస్తుంది. అలాగే టమోటా పాస్తా, వైట్ వైన్ కలిపి తీసుకుంటే.. మరింత ఎక్కువ హాని కలుగుతుంది.

గ్రీన్ జ్యూస్

గ్రీన్ జ్యూస్

ఇటీవల అందరూ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రీన్ జ్యూస్ ని చాలామంది డైట్ లో చేర్చుకుంటున్నారు. వీటిల్లో ఆకుకూరల కంటే.. ఫ్రూట్సే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో..ఈ డ్రింక్స్ లో ఎసిడిక్ కంటెంట్ పెరిగి.. పంటి ఎనామిల్ కి హాని చేస్తున్నాయి. కాబట్టి ఈ జ్యూస్ లలో ఫ్రూట్స్ ని తక్కువగా ఉపయోగించాలి.

బెర్రీస్

బెర్రీస్

బ్రెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ.. ఇవి పళ్లను పచ్చగా మారుస్తాయి. కాబట్టి.. వీటిని మితంగా తినాలి.

స్విమ్మింగ్

స్విమ్మింగ్

వారానికి 6 గంటలకంటే ఎక్కువ సమయం స్విమ్మింగ్ చేస్తే.. మీ పళ్లు కెమికల్ వాటర్ లో డ్యామేజ్ అవుతాయి. కాబట్టి.. మరీ ఎక్కువ సమయం నీటిలో గడపకుండా జాగ్రత్త పడాలి.

మౌత్ వాష్

మౌత్ వాష్

మీరు ఉపయోగించే మౌత్ వాష్ కూడా.. మీ పంటి ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఇందులో ఉండే క్లోరాక్సైడ్ గ్లూకోనేట్ పళ్లపై ఎల్లో కలర్ ఏర్పడటానికి కారణమవుతుంది. కాబట్టి.. బీ కేర్ ఫుల్.

English summary

8 shocking ways you are harming your teeth

8 shocking ways you are harming your teeth. But even after brushing your teeth twice a day and taking care of your pearly whites like babies, you end up with dull and yellow teeth.
Story first published:Wednesday, November 30, 2016, 13:02 [IST]
Desktop Bottom Promotion