For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారనడానికి ఖచ్చితమైన లక్షణాలు...!!

|

యూరినరీ సమస్యలు వివిధ రకాలుగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూరినరీ ఇన్ కాంటినెన్స్ (మూత్రంను నియంత్రించుకోలేకుండా వెళ్ళడం లేదా బలవంతపు మూత్రవిసర్జన), తరచూ మూత్రవిసర్జన, మరియు మూత్రవిసర్జనప్పుడు నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు. యూరినరీ సమస్యలకు కారణం అనేకం అందులో కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా సమస్యలొస్తే, మరికొన్ని హార్మోన్ల వల్ల మరియు ఇకొన్ని వయస్సు సంబంధించిన సమస్యలు ఇలా కారణాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే, ఈ యూరినరీ సమస్యలను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హెర్బల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి.

ఎలాంటి యూరినరీ సమస్యకైనా కారణం ఏదైనా కావచ్చు, అది మీ సహనానికి సవాలుగా మారినప్పుడు తప్పనిసరిగా వైద్యపరమైన చికిత్స చాలా అవసరం. సరైన సమయంలో సరైజ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇది ఆందోళన మరియు వ్యాకులత కు కారణం కావచ్చు. శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి లవణాల గాఢత పెరిగి కిడ్నిల్లో రాళ్లు మరియు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌ (యు.టి.ఐ) ఏర్పడే అవకాశం ఉండటమే. యూరినరీ ఇన్ఫెక్షన్ కు యురేత్ర, బ్లాడర్ మిరయు కిడ్నీలకు సంబంధించినది. ఈ మూడు శరీరంలో వ్యర్థాలను మరియు ఎక్సె వాటర్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి,

మైక్రోబ్స్ మరియు బ్యాక్టీరియా వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది. మైక్రోబ్స్(సూక్ష్మక్రిముల)తో , బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని ఎప్పుడైతే కోల్పోతాయో అప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. యూటిఐ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్ర విసర్జన సమయంలో మంట. పొత్తి కడుపులో నొప్పి రావడం, మూత్రం ఎక్కువ సార్లు చేయడం. మూత్రం రంగు మారడం, వేడిగా, ఎరుపుగా రావటం. పిల్లల్లో ఈ సమస్యను ఎదుర్కునే వారు మూత్రం పోయాలంటేనే భయపడిపోయి, ఏడుస్తుంటారు. నీరసం, జ్వరం లాంటి లక్షణాలుంటాయి.

యూరినరీ సమస్యలకు వైద్యపరమైన చికిత్స ఉన్నప్పుటికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవల్సి వస్తుంది. అందులోనూ అంత త్వరగా నయం కాకపోవచ్చు, మందులను తీసుకోవడం వల్ల కేవలం లక్షణాలను మాత్రం అరికట్టవచ్చు. అయితే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు సరైన యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల బ్లాడర్ లో బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా నివారిస్తుంది. లేదంటే అవి కిడ్నీలను టార్గెట్ చేస్తాయి. కాబట్టి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకముందే లక్షణాలు ముందుగా గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫ్రీక్వెంట్ గా మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుంది:

ఫ్రీక్వెంట్ గా మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుంది:

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు, బ్యాక్టీరియా యురేత్ర నుండి బ్లాడర్ లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి, పురుషుల కంటే మహిళల్లో ఆప్రదేశంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ కు గురి అవుతారు . మూత్రం కూడా చాలా తక్కువగా వస్తుంది. తరచూ వెళ్ళాలనిపిస్తుంది.

మూత్ర విసర్జనలో మంట:

మూత్ర విసర్జనలో మంట:

మూత్ర విసర్జన చేసేటప్పుడు యూరిన్ ట్రాక్ ఇన్ఫ్లమేషన్ కు గురి అవుతుంది. దాంతో మంటగా అనిపిస్తుంది.

యూరిన్ లో బ్లడ్:

యూరిన్ లో బ్లడ్:

యుటిఐ ఇన్ఫెక్షన్ ఉన్న వారు , మూత్ర విసర్జనలో లైట్ గా బ్లడ్ డ్రాప్స్ పడటం, లేదా యూరిన్ లైట్ గా రెడ్ కలర్ రావడం జరగుతుంది. బ్లాడర్ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు యూరిన్ బ్లడ్ కలర్ లో వస్తుంది.

 క్లౌడీ యూరిన్ :

క్లౌడీ యూరిన్ :

సహజంగా మూత్ర సమస్యలేనప్పుడు యూరిన్ క్లియర్ గా ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, యూరిన్ కలర్ లో మార్పులుంటాయి. ముదురు రంగులో యూరిన్ ఉండటం యూటిఐ ఇన్ఫెక్షన్ కు ముఖ్య కారణమే.

యూరిన్ లో వాసన:

యూరిన్ లో వాసన:

యూటిఐ కు కారణమయ్యే బ్యాక్టిరియా యూరిన్ లో కలవడం వల్ల ఫ్యూయల్(నీచు వాసన) స్మెల్ వస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ను కలవండి.

వాంతులు , వికారం:

వాంతులు , వికారం:

యూటిఐకి మరో ముఖ్య లక్షణం, వాంతులు, వికారం. కిడ్నీలో బ్యాక్టిరియా చేరినప్పుడు, వాంతులు వికారంను కలిగిస్తాయి.

కండరాల నొప్పులు:

కండరాల నొప్పులు:

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు మరో కారణం కండరాల నొప్పులు. ఈ కారణం వల్ల బ్యాక్టీరియాతో పోరాడగలిగే ఇమ్యూనిటి లేకపోవడం వల్ల జాయింట్ మరియు కండరాల నొప్పులకు గురిచేస్తుంది.

పొత్తికడుపులో నొప్పి:

పొత్తికడుపులో నొప్పి:

బ్లాడర్ లో సూక్ష్మ క్రిములున్నప్పుడు, పొత్తికడుపులో విపరీతమైన నొప్పి కలిగిస్తుంది. దీన్ని సాధారణ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది యూటిఐ లక్షణాలను మరింత తీవ్రం చేస్తుంది,. . కాబట్టి పొత్తికడుపులో నొప్పిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడుదు.

English summary

8 Signs You Have Urinary Tract Infection (UTI)

8 Signs You Have Urinary Tract Infection (UTI),Are you having that burning sensation while urinating or having a persistent urge to urinate? Then you need to get it checked immediately; this might be a sign that you are suffering from Urinary Tract Infection (UTI).
Story first published: Wednesday, September 14, 2016, 18:22 [IST]
Desktop Bottom Promotion