For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టొమక్ అప్ సెట్, అజీర్తి నివారించే 9 మిరాకిల్ జ్యూసెస్.!

|

మనిషి సంతోషంగా జీవించాలంటే అందుకు మంచి ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యంగా..సంతోషంగా కనబడాలంటే శరీరంలో జీవక్రియలన్నీ వేగంగా...చురుకుగా పనిచేయాలి. బాడీలో వివిధ రకాల జీవక్రియల్లో జీర్ణవ్యవస్థ ఒకటి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా ఉంటే మిగిలిన శరీర ఆరోగ్యంగా చురుకుగా..ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థలో లోపాలు ఏర్పడితే పొట్టలో అసౌకర్యంగా, గ్యాస్, కడుపుబ్బరం, వికారం మరియు వాంతులు వంటి లక్షణాలు కనబడుతాయి.

అజీర్థి మరియు జీర్ణవ్యవస్థను నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ హోం రెమెడీస్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా. ఇంట్లో తయారుచేసుకునే ఇన్ స్టాంట్ జ్యూస్ లు గ్రేట్ గా సహాయపడుతాయి . మన దినచర్యలో సరైన జీర్ణశక్తి ఉండటం చాలా అవసరం. . మొత్తం ఆరోగ్యానికి మనం తీసుకునే ఆహారాలను జీర్ణింపచేసి, శరీరానికి కావల్సిన పోషకాలు, విటమిన్స్, మినిరల్స్ ను అందించేది పొట్టే కాబట్టి, పొట్ట ఆరోగ్యం ఎల్లవేళలా సురక్షితంగా ఉండాలి. అలాంటి పొట్టఆరోగ్యానికి మనం ఎలాంటి ఆహారాలను తీసుకుంటున్నామో వాటి మీద ప్రత్యేక శ్రద్ద కలిగి ఉండాలి.

మన తీసుకును ఫ్రెష్ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ వల్ల పొట్టలోని ప్రేగులతో సహాయ శుభ్రం చేసి, పొట్టలో మరియు జీర్ణాశయంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది . ముఖ్యంగా మనం తీసుకుని స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ భోజనం చేయడం, మన పొట్టకు సూట్ అవ్వని ఆహారాలను తీసుకోవడం వల్ల , ఆయిల్ ఫుడ్స్ మరియు ప్రొసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన పొట్టలో ఏర్పడే టాక్సిన్స్ తొలగించడానికి, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వంటి కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి.

ఫ్రెష్ ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ తో తయారుచేసే కొన్ని రకాల జ్యూసులు మరియు స్మూతీలతో అన్ని రకాల జీర్ణ సమస్యలను నివారించుకుని, జీర్ణవక్తిని మెరుగుపరుచుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ తో జ్యూస్ లు మరియు స్మూతీస్ ను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు..

ఈ జ్యూస్ లను తయారుచేసుకోవడానికి , ఫ్రూట్, వెజిటేబుల్స్ తో పాటు కొద్దిగా నీరు అవసరం అవుతుంది. స్మూతీస్ చిక్కగా ఉండాలి కాబట్టి, నీరు చేర్చాల్సినవసరం లేదు . ఈ జ్యూసులు రోజూ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. జీర్ణ క్రియను మెరుగుపరిచే అటువంటి నేచురల్ జ్యూసులు మరియు స్మూతీస్ మీకోసం ఈ క్రింది విధంగా...

ఆపిల్, కుకుంబర్ మరియు లెట్యూస్ జ్యూస్:

ఆపిల్, కుకుంబర్ మరియు లెట్యూస్ జ్యూస్:

ఈ మూడింటి కాంబినేషన్ జ్యూస్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. మలబద్దకం నివారిస్తాయి. పొట్టకు ఉపశమనం కలిగిస్తాయి. ప్రొబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా )ఏర్పడటానికి సహాయపడుతాయి.డైజెస్టివ్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. ఇది డైజెస్టివ్ ట్రాక్ లోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతాయి. హార్ట్ బర్న్, హైపర్ ఎసిడిటి, మరియు గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తాయి.

ఆరెంజ్, అలోవెర మరియు స్పినాచ్ జ్యూస్:

ఆరెంజ్, అలోవెర మరియు స్పినాచ్ జ్యూస్:

ఈ కాంభినేషన్ జ్యూస్ లో విటిమిన్ సి, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది.ఇవి పొట్టలో అసిడిక్ ను మితంగా పెంచుతుంది, దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మలబద్దకం నివారిస్తుంది. జీర్ణాశయంను క్లీన్ చేస్తుంది. స్టొమక్ అల్సర్ మరియు ఇంటెన్షనల్ బ్లీడింగ్ వంటి సమస్యలను నివారిస్తుంది. అలోవెర జెల్ ఆస్ట్రిజెంట్ లా పనిచేస్తుంది మెటబాలిజం రేటు పెంచుతుంది.

 బ్రొకోలి, బొప్పాయి మరియు మింట్ జ్యూస్:

బ్రొకోలి, బొప్పాయి మరియు మింట్ జ్యూస్:

ఈ కాంబినేషన్ జ్యూస్ లో ఎంజైమ్స్ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ మరియు స్టొమక్ బ్లోటింగ్ నివారిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పుదీనాలోని ఔషధ గుణాలు పొట్ట కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది జీర్ణ రసాలను పెంచుతుంది. ఆలస్యంగా ఉండే జీర్ణవ్యవస్థను ఫాస్ట్ చేస్తుంది.

రెడ్ గ్రేప్, క్యాబేజ్ మరియు సెరలీ జ్యూస్:

రెడ్ గ్రేప్, క్యాబేజ్ మరియు సెరలీ జ్యూస్:

ఇది డైజెస్టివ్ ట్రాక్ ను క్లీన్ చేసి, బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది. డయోరియా చాలా మంచిది. ఇది పొట్టలో మరియు ప్రేగుల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఈ కాంబినేషన్ డ్రింక్ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెస్టివ్ ట్రాక్ లోని టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. దాంతో జీర్ణక్రియ చురుగ్గా పెరుగుతుంది.

స్వీట్ పొటాటో, క్యారెట్ మరియు బెల్ పెప్పర్ జ్యూస్:

స్వీట్ పొటాటో, క్యారెట్ మరియు బెల్ పెప్పర్ జ్యూస్:

క్యారెట్ లో ఉండే పోషక విలువలు, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను స్మూత్ గా మార్చుతుంది. మలబద్దకం నివారిస్తుంది. పొట్టలో ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పి తగ్గిస్తుంది. ఇది స్టొమక్ అల్సర్ నివారిస్తుంది. స్టొమక్ ఇన్నర్ లైనింగ్ కు ఉపశమనం కలిగిస్తుంది.

బేరిపండ్లు, సెలరీ మరియు అల్లం జ్యూస్:

బేరిపండ్లు, సెలరీ మరియు అల్లం జ్యూస్:

ఈ కాంబినేషన్ జ్యూస్ జీర్ణశక్తిని పెంచడంలో బూస్ట్ లా పనిచేస్తుంది. పొట్టకు ఉపశమనం కలిగిస్తుంది. పొట్టలో మరియు డైజెస్టివ్ ట్రాక్ లో టాక్సిన్స్ నివారిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ పొట్టను శుభ్రం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల అల్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

క్యాబేజ్, మింట్, పైనాపిల్:

క్యాబేజ్, మింట్, పైనాపిల్:

ఈ మూడింటి కాంబినేషన్ డ్రింక్ జీర్ణసమస్యలను నివారించడంలో బెస్ట్ నేచురల్ రెమెడీ. ఇది జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్స్, మినిరల్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫోలిక్ యాసిడ్ కూడా ఉండి, జీర్ణక్రియను మెరుగ్గా మార్చుతాయి . ఇది రక్తహీనతతో బాధపడే వారికి కూడా మేలు చేస్తుంది.

 జ్యూచిని, లెట్యూస్, ఆరెంజ్:

జ్యూచిని, లెట్యూస్, ఆరెంజ్:

ఇది శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది . టాక్సిన్స్ ను తొలగిస్తుంది, ప్రేగులను శుభ్రపరుస్తుంది. ఇది మలబద్దకంను నివారిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కోలన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. క్యాన్సర్ కు సంబంధించిన మలినాలను ప్రేగుల నుండి తొలగిస్తుంది.

స్తిస్ చార్డ్, పైనాపిల్ , కుకుంబర్ జ్యూస్

స్తిస్ చార్డ్, పైనాపిల్ , కుకుంబర్ జ్యూస్

ఈ కాంబినేషన్ డ్రింక్ అన్ని రకాల జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్, కెరోటినాయిడ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి . ఇది గ్యాస్ట్రిక్ ను మరియు స్టొమక్ పెయిన్ నివారిస్తుంది.

English summary

9 Best Juices For Stomach Upset And Indigestion

It is very important to boost digestion for good health. Improper digestion leads to various symptoms of discomfort such as heaviness, gases, bloating, nausea and vomiting.
Desktop Bottom Promotion