For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏరోబిక్ వ్యాయామం హార్ట్ ఫెయిల్యూర్ కాకుండా ప్రోటీన్ క్వాలిటిని పెంచుతుంది..

By Super Admin
|

మీకు ఏరోబిక్స్ అంటే తెలుసా? ఏరోబిక్స్ యొక్క పవర్ ఫుల్ ప్రయోజనాలేంటో మీకు తెలుసా? సాధారణంగా మెదడు చురుకుదనం, శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, ఆలోచనా శక్తి, ఏకాగ్రత, ఆటలు- ఇండోర్ గేమ్స్‌లో చురుగ్గా పాల్గొనగలుగుతున్నారా లేదా వంటి అంశాలు మానసికంగా ఫిట్‌నెస్‌తో ఉన్నారా లేదో అన్నేదాన్ని తెలియజేస్తాయి. వీటిని బట్టి ఒక వ్యక్తి ఫిట్‌నెస్ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు.

కానీ, శారీరకపరమైన ఇతర మార్పులేమీ జరుగకుండా ఉఛ్వాస నిశ్వాసలు వేగంగా జరగటం, హృదయస్పందన రేటు పెరగటం, కండరాల కదలికలు చురుకుగా ఉంచేందుకు దోహదపడే ఎక్సర్‌సైజెస్‌ను ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ అంటారు.

aerobic exercises

వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్టేషనరీ లేదా సాధారణ సైక్లింగ్, స్విమ్మింగ్, ఆట్లాడటం, డ్యాన్స్ చేయటం వంటివన్నీ ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ కిందకు వస్తాయి.

ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఊపిరితిత్తులు పర్యావరణం నుంచి ఆక్సిజన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటాయి. గుండె, రక్తనాళాలు ఆ ఆక్సిజన్‌ను, ఇతర పోషకాలను ప్రతి కణానికి చేరవేస్తాయి.

కండరాలు పనిచేయడానికి, కేలరీలను కరిగించడానికి ఇవి అవసరం. ఈ ఏరోబిక్ ఎక్సర్‌సైజులను చాలా రకాలుగా చేయవచ్చు. వాకింగ్, జాగింగ్, స్లో రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, తేలికపాటి ఆటలు, డ్యాన్స్ వంటివి మంచి ఫలితాలనిస్తాయి.

aerobic exercises

సమయం లేక వ్యాయామం చేయలేకపోతున్నామనే వానికి ఏరోబిక్‌ వ్యాయామాలు మంచి ప్రయోజనం. ఏరోబిక్‌ వ్యాయామాల వల్ల ఉన్న లాభాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే?

ప్రోటీన్ క్వాలిటిని పెంచుతుంది. వ్యాయామం వల్ల అమినో యాసిడ్ కారణం శరీరంలో రక్త ప్రసరణ, ప్రోటీన్ ప్రసరణ రెగ్యులేట్ చేస్తుంది.

ఈ క్రమంలో మన శరీరంలోని కణాల్లో ప్రోటీనుల క్వాలిటి పెరుగుతుంది. శరీరం మొత్తం కంట్రోల్లో ఉంటుంది. ప్రోటీన్స్ శరీరంలో జీవక్రియలను క్రమబద్దానికి సహాయపడుతాయి. హార్ట్ ఫెయిర్ సమస్యలుండవు.

కార్డియో ప్రోటీన్ క్వాలిటిని కార్డియో ఫార్మాలజీ థెరఫీ అవసరం లేకుండానే ప్రోటీన్ క్వాలిటి పెంచుతకోవచ్చు. అలాగే ఏరోబిక్స్ వ్యాయామం వల్ల కార్డియక్ ప్రోటీన్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ , వల్ల మిస్ ఫోల్డ్ ప్రోటీన్ చేరకుండా నివారిస్తుంది.

ఏరోబిక్ వ్యాయామాల వల్ల కార్డియిక్ ఫంక్షన్ మెరుగ్గా ఉంటుంది. ఇది హార్ట్ ఫెయిల్యూర్ కు దారి తియ్యకుండా నివారిస్తుంది.

English summary

Aerobic Exercises Restore Protein Quality In Heart Failure: Study

Aerobic exercises, such as brisk walking, running, jogging or swimming, are likely to restore the cardiac protein quality control system in heart failure, suggested a research conducted on rats.
Story first published:Monday, July 25, 2016, 8:08 [IST]
Desktop Bottom Promotion