For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరించే పచ్చిమామిడిలో దాగున్న పసందైన హెల్త్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

అబ్బా.. సమ్మర్ వచ్చిందంటే.. ఎండ సంగతి ఎలా ఉన్నా.. అందరికీ మామిడిపై మోజు పెరుగుతుంది. పచ్చిమామిడి చూడగానే.. వావ్ అంటూ నోరూరించేస్తారు. ఉప్పు, కారం నంజుకుంటూ.. లొట్టలేస్తూ లాంగిస్తేరు. అటు అమ్మలు, అమ్మమ్మలు పచ్చిమామిడి పచ్చళ్లు పెట్టడంలో బిజీగా ఉండిపోతారు.

నోరూరించే మామిడిపళ్లలో దాగున్న 12 బ్యూటీ సీక్రెట్స్

పసందైన పులుపుతో నోరూరించే పచ్చిమామిడి రుచికరంగానే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని స్టడీస్ చెబుతున్నాయి. ఇందులో చాలా పోషకవిలువలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. దీన్నే గ్రీన్ మ్యాంగో, రా మ్యాంగో అని పిలుస్తారు. పచ్చిమామిడి కాయ తినడం వల్ల అనేక చర్మ సమస్యలతో పాటు, రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

సమ్మర్ లో మామిడితో మజా చేయండి..సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి...!

చాలామంది పండుమామిడిపై ఆసక్తి చూపుతారు. అయితే.. ఈ పుల్లపుల్లని పచ్చిమామిడి తీసుకోవడం కూడా చాలా అవసరమని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. పచ్చిమామిడి ఆరోగ్యానికి మంచిది అనడానికి అనేక కారణాలున్నాయి. ఇంకా చెప్పాలంటే.. పండిన మామిడి కంటే.. పచ్చి మామిడి తినడమే ఆరోగ్యకరం అంటున్నారు. మరి పచ్చిమామిడిలోని పసందైన ఆరోగ్య రహస్యలు తెలుసుకుందామా..

వడదెబ్బ

వడదెబ్బ

పచ్చిమామిడి పవర్ ఫుల్ కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. అలాగే ఫ్లూయిడ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఒకవేళ మీలో వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే.. పచ్చిమామిడి తీసుకోండి. లేదా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన ఆమ్ పన్నా తాగండి.

డయాబెటిస్

డయాబెటిస్

డయాబెటిక్ పేషంట్స్ కి పచ్చిమామిడి మంచి ఫ్రూట్. దీన్ని పెరుగు, రైస్ తో తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

పచ్చిమామిడిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే పచ్చిమామిడికాయలు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తాయి. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

పచ్చిమామిడి తినడం వల్ల క్యాలరీలు కరగడానికి సహాయపడుతుంది. పండిన మామిడి కంటే.. పచ్చి మామిడి బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

పచ్చిమామిడి కాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కూరల్లో, స్నాక్స్ లో పచ్చిమామిడిని యాడ్ చేసుకుంటే.. పొట్ట సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

ఎసిడిటీ

ఎసిడిటీ

మీరు ఎసిడిటీతో బాధపడుతుంటే.. పచ్చి మామిడి చక్కటి పరిష్కారం. ఒక ముక్క పచ్చిమామిడిని నములుతూ ఉండటం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది.

వ్యాధినిరోధక వ్యవస్థ

వ్యాధినిరోధక వ్యవస్థ

వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కాబట్టి.. మీ డైట్ లో పచ్చిమామిడి చేర్చుకోవడం వల్ల.. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అంది వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల రిస్క్ తగ్గిస్తుంది. కాబట్టి మ్యాంగో చట్నీ, మ్యాంగో రైస్ తీసుకోవడం మంచిది.

లివర్ హెల్త్

లివర్ హెల్త్

కాలేయ సంబంధిత సమస్యలు నివారించడంలో పచ్చిమామిడి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఒక ముక్క పచ్చిమామిడిని నమలడం వల్ల పేగులను శుభ్రపరిచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది.

పంటి ఆరోగ్యానికి

పంటి ఆరోగ్యానికి

పంటి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. కాబట్టి పచ్చి మామిడి తినడం వల్ల చిగుళ్లు బలంగా మారతాయి. అలాగే చిగుళ్ల నుంచి రక్తస్రావాన్ని నివారించి, దుర్వాసనను నివారిస్తుంది.

చర్మానికి

చర్మానికి

పచ్చిమామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడతాయి. అలాగే ఏజింగ్ లక్షణాలను నివారిస్తాయి. కాబట్టి పచ్చిమామిడి తింటూ ఉండండి.. మీ చర్మాన్ని కాపాడుకోండి.

యాక్నే

యాక్నే

మామిడిలో ఉండే యాట్రిజెంట్ ప్రాపర్టీస్.. చర్మంపై జిడ్డు, దుమ్ముని తొలగిస్తాయి. కాబట్టి.. ఒక ముక్క పచ్చిమామిడిని నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీటిని ఫేస్ కి రాత్రి పడుకునే ముందు అప్లై చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బ్లడ్

బ్లడ్

బ్లడ్ డిజార్డర్స్ నివారించడంలో పచ్చిమామిడి చక్కగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల.. బ్లడ్ వెజెల్స్ ఎలాస్టిసిటీ పెంచుతుంది. కొత్త బ్లడ్ సెల్స్ ఏర్పడటానికి సహాయపడుతుంది.

మార్నింగ్ సిక్ నెస్

మార్నింగ్ సిక్ నెస్

ప్రెగ్నెంట్ మహిళలను వేధించే మార్నింగ్ సిక్ నెస్ నివారించడానికి పచ్చిమామిడి తీసుకోవడం మంచిది.

అధిక చెమట

అధిక చెమట

పచ్చిమామిడి జ్యూస్ తాగడం వల్ల.. అధిక చెమటను నివారించవచ్చు.

English summary

Amazing 14 health benefits of green/ raw mango

Amazing 14 health benefits of green/ raw mango. Just like pulpy mangoes, raw mangoes are not only tasty but also a storehouse of nutrients. This green and tangy fruit helps you deal with acne, indigestion, heatstroke and many other health conditions.
Story first published:Friday, April 22, 2016, 12:32 [IST]
Desktop Bottom Promotion