For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించడంతోపాటు.. డయేరియా, అనీమియా నివారించే అద్భుత ఔషధం..!!

By Swathi
|

సొరకాయ భారతీయులు ఎక్కువగా ఉపయోగించే వెజిటబుల్. స్మూత్ గా ఉండే.. లైట్ గ్రీన్ కలర్ లో ఉంటే.. ఈ సొరకాయ రుచికరంగా కూడా ఉంటుంది. దీన్ని చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సొరకాయను ఉపయోగిస్తారు. అయితే.. ఇండియన్స్ గ్రేవీ రూపంలో దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే.. ఏ వెజిటబుల్ అయినా.. జ్యూస్ రూపంలో తీసుకుంటే.. అందులోని అన్ని పోషకాలను, ఉపయోగాలను గ్రహించవచ్చు.

సొరకాయలో దాదాపు 96 శాతం నీళ్లు ఉంటాయి. కాబట్టి జ్యూస్ చేయడం తేలికవుతుంది. ఆరోగ్యానికి మంచిది. ఈ సొరకాయ ద్వారా విటమిన్ సి, విటమిన్ బి, సోడియం, ఐరన్, జింక్, పొటాషియం పొందవచ్చు. అలాగే తక్కువ ఫ్యాట్, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే.. ఈ సొరకాయ జ్యూస్ చాలా ఫేమస్ అయింది.

ఒక కప్పు సొరకాయ జ్యూస్ ద్వారా 26 ఎమ్ జీ విటమిన్ సి పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల.. కణాలు డ్యామేజ్ అవకుండా అడ్డుకుంటాయి. అలాగే హెల్తీ హార్ట్, హిమోగ్లోబిన్ యాక్టివ్ గా ఉండటానికి ఈ జ్యూస్ సహాయపడుతుంది. అంతేకాదు.. ఈ జ్యూస్ ని రెగ్యులర్ గా తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని చెబుతున్నాయి అధ్యయనాలు.

జ్యూస్ తయారు చేసే విధానం

జ్యూస్ తయారు చేసే విధానం

సొరకాయ ముక్కలను బ్లెండర్ లో వేసి మెత్తగా చేయాలి. తర్వాత సాల్ట్, జీరా పొడి, మిరియాలు, పుదినా ఆకులు వేయాలి. అన్నింటినీ.. బాగా మిక్సీ పట్టి.. తాగాలి.

చర్మానికి

చర్మానికి

సొరకాయ జ్యూస్ లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల.. ఇది.. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి.. గ్లోయింగ్ గా మారుస్తుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

సొరకాయలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. క్యాలరీలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే.. తేలికగా బరువు తగ్గవచ్చు.

కండరాలను బలంగా మార్చడానికి

కండరాలను బలంగా మార్చడానికి

సొరకాయలో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కండరాలు బలంగా ఉండటానికి సహాయపడతాయి.

డయేరియా నివారించడానికి

డయేరియా నివారించడానికి

సొరకాయలో 96 శాతం నీటిశాతం ఉంటుంది. మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే.. ఈ జ్యూస్ శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసి.. విరేచనాలు నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

హెల్తీ హార్ట్

హెల్తీ హార్ట్

సొరకాయలో జింక్ ఉంటుంది. ఇది.. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి.. గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

అనీమియా నివారించడానికి

అనీమియా నివారించడానికి

సొరకాయలో ఐరన్ ఉంటుంది. ఇది.. అనీమియా నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కంటిచూపు మెరుగవడానికి

కంటిచూపు మెరుగవడానికి

సొరకాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది.. కంటిచూపుని మెరుగుపరుస్తుంది.

యూరినరీ ప్రాబ్లమ్స్

యూరినరీ ప్రాబ్లమ్స్

సొరకాయలో డ్యురెటిక్ నేచర్ ఉంటుంది. ఇది.. మలినాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే.. అమ్మాయిల్లో యూరినరీ సమస్యలకు చెక్ పెడుతుంది.

కాన్ట్సిపేషన్ నివారించడానికి

కాన్ట్సిపేషన్ నివారించడానికి

సొరకాయలో.. సొల్యుబుల్, ఇన్ సొల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది.. కాన్ట్సిపేషన్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

Amazing Health Benefits of Bottle Gourd Juice

Amazing Health Benefits of Bottle Gourd Juice. The bottle gourd aka Lauki, is considered to be one of the most staple item as far as the Indian cuisine is concerned.
Story first published:Tuesday, August 9, 2016, 11:47 [IST]
Desktop Bottom Promotion