For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఉప్మా : అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

స్పెషల్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ ఉప్మాను వివిధ రకాలుగా తయారు చేస్తారు. వెజిటేబుల్‌ ఉప్మా, ప్లెయిన్‌ ఉప్మా, రవ్వ పులిహోర ఇలా.. ఉప్మాను రవ్వ లేదా సూజి రవ్వతో తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ బ్రేక్‌ ఫాస్ట్‌ రెసిపి సౌత్‌ ఇండియాలో చాలా ఫేమస్‌. సాధారణ ఉప్మా తిని బోర్‌ అనిపిస్తే కొంచెం వెరైటీగా కొంచెం కారంగా కొన్ని ఇండియన్‌ మసాలా దినుసులు వేసి చేసుకోవచ్చు. మసాలా ఉప్మా బెస్ట్‌ బ్రేక్‌ ఫ్యాస్ట్‌. ఎందుకంటే చాలా సులభంగా తయారవుతుంది. మరియు టేస్టీగాను ఉంటుంది. కొద్దిగా వెజిటేబుల్స్‌ మిక్స్‌ చేసుకొంటే మరింత టేస్ట్‌ గా ఉంటుంది.

రెగ్యులర్ గా చపాతి తినడం వల్ల పొందే లాభాలు

ఉప్మా టేస్ట్ మాత్రమే కాదు, ఇందులో రవ్వ, వివిధ రకాల వెజిటేబుల్స్ జోడించడం వల్ల ఆరోగ్యానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . ఉప్మాలో ఉపయోగించే రవ్వ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి ది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అప్షన్ అయింది. వీట్ రవ్వలో వివిధ రకాల రవ్వ మన ఇండియా మొత్తం అందుబాటులో ఉంది. రవ్వ అంటే గోధుమలను గ్రైండ్ చేయడం వల్ల సన్నగా మారేదే రవ్వ. గోధుమల్లో మీకు తెలియని కొన్నిఉత్తమ ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. రవ్వలో కొన్నింటిరి రఫ్ గా కొద్దిగా పెద్దసైజ్ గా ఉంటే మరికొన్ని సన్నగా ఉంటుంది. ఇలాంటి రవ్వను సూజి అనికూడా పిలుస్తారు. ఈ రవ్వతో రోటీలను కూడా చేస్తారు. అదే విధంగా ఉప్మా కూడా వెరైటీగా తయారుచేసుకుంటారు.

ఇది గడ్డి కాదు..సర్వరోగ నివారణకు దివ్వ ఔషదం..!

ప్రతి 100గ్రాములు గోధుమ రవ్వలో దాదాపు 71గ్రాముల కార్బోహైడ్రేట్స్,, 3గ్రాముల ఫైబర్, 1 గ్రాము ఫ్యాట్, 12గ్రాముల ప్రోటీన్స్ మరియు కొన్ని మినిరల్స్ క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియమ్, ఫాస్పరస్, పొటాసియం, సోడియం మరియు జింక్ కలిగి ఉన్నాయి. అలాగే కొన్ని విటమిన్స్ (బి-కాంప్లెక్స్ గ్రూప్) కలిగి ఉన్నాయి. మరి ఇన్ని పోషక విలువలున్న రవ్వ, రవ్వతో తయారుచేసే ఉప్మాలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం....

 నిధానంగా జీర్ణం అవుతుంది:

నిధానంగా జీర్ణం అవుతుంది:

ఉప్మా చాలా నిధానంగా జీర్ణం అవుతుంది . అంతే కాదు, ఇలా నిధానంగా జీర్ణం అవ్వడం వల్ల పొట్టలో నిండుగా ఉన్న ఫీలింగ్ ఎక్కువ సమయం ఉంటుంది. దాంతో వేరే ఆహారాలు, స్నాక్స్ తినాలన్న ఆలోచన మీలో ఉండదు.

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

వీట్ రవ్వలోని విటమిన్స్ వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా రవ్వలో ఉండే విటమిన్ బి మరియు ఇ వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది:

రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది:

గోధుమ రవ్వతో తయారుచేసిన ఉప్మాను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల రోజంత ఎనర్జిటిక్ గా ఉండవచ్చు . మరియు ఇందులో టేస్ట్ కోసం జోడించే వివిధ రకాల వెజిటేబుల్స్ వల్ల శరీరానికి అవసరం అయ్యే ఫైబర్ కంటెంట్ అందుతుంది. దాంతో జీర్ణక్రియ సులభం అవుతుంది.

కిడ్నీ ఆరోగ్యానికి మంచిది:

కిడ్నీ ఆరోగ్యానికి మంచిది:

గోధుమ రవ్వలో ఉండే పొటాషియం కంటెంట్ కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . నిజానికి ఇది కిడ్నీ ఫంక్షన్స్ ను వేగవంతంగా చేస్తుంది.

హార్ట్ హెల్త్ కు మంచిది:

హార్ట్ హెల్త్ కు మంచిది:

గోధుమ రవ్వలో ఉండే న్యూట్రీషియన్స్ హార్ట్ హెల్త్ కు చాలా మంచిది. మరియు రవ్వలో ఉండే సెలీనియం వ్యాధినిరోధకతను పెంచడానికి కూడా సహాయపడుతుంది.

వెజిటేబుల్స్:

వెజిటేబుల్స్:

రవ్వ ఉప్మాకు సహజంగా జోడించే ఉల్లిపాయలు, టమోటోలు మరియు బంగాళదుంపలు, గ్రీన్ పీస్ మరియు మరికొన్ని వెజిటేబుల్స్ జోడించడం వల్ల శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ అత్యధికంగా శరీరానికి అందుతాయి. ఇది ఉప్మా న్యూట్రీషియన్ గా తయారవుతుంది.

ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

గోధుమ రవ్వలో ఉండే మినిరల్స్ మరియు మెగ్నీషియం, ఫాస్పరస్, మరియు జింక్ నరాల బలహీనతలను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఐరన్ అధికంగా ఉంటుంది :

ఐరన్ అధికంగా ఉంటుంది :

గోధుమ రవ్వలో ఉండే ఐరన్ అనీమియా(రక్తహీనతను) నివారిస్తుంది. మరియు శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది.

నట్స్ :

నట్స్ :

గోధుమ రవ్వ ఉప్మాలో వేసి వివిధ రకాల నట్స్ వల్ల వేరుశెనగ, జీడిపప్పు వల్ల ఉప్పా టేస్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అంధిస్తుంది.

English summary

Amazing Health Benefits Of Upma

Amazing Health Benefits Of Upma,Rava is nutritious. So, the upma made of wheat rava is surely a healthy breakfast option. There are several varieties of wheat rava available in India.Rava is nothing but the substance obtained by grinding wheat.
Desktop Bottom Promotion