For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయుర్వేదం ప్రకారం కుకుంమపువ్వు అందించే అమేజింగ్ బెన్ఫిట్స్..!

By Super
|

కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్‌ ఫ్రాన్‌ అంటారు. ఇది జాఫరాన్‌ అనే అరబిక్‌ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్‌ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి. అందుకే ఇది ఎక్కువ ధర. కుంకుమ పువ్వు కాస్త చేదుగా, తియ్యగా, మంచి సువాసన కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని అనేక వంటకాల్లో ఉపయోగిస్తుంటారు.

కుంకుమ పువ్వు అనగానే మనకు గుర్తొచ్చేది గర్భణీ స్ర్తీలు, అందంలో దాని వినియోగం. కానీ కుంకుమ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే మందుల్లో మన పూర్వీకులు ఉపయోగించేవారట. శాస్త్రీయంగా కూడా కుంకుమ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని స్టడీస్ చెబుతున్నాయి. కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి.

కుంకుమ పువ్వును ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లోఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో కుంకుమ పువ్వును చరక సంహిత, సుస్రుత సంహిత వంటి ఆయుర్వేద చికిత్సలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంతే కాదు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. మరి ఆయుర్వేదం ప్రకారం కుంకుమ పువ్వు ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

ఆకలి పెంచుతుంది:

ఆకలి పెంచుతుంది:

కుంకుమ పువ్వులోని ఫ్లేవర్ వల్ల వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. దీని ధర కూడా ఎక్కువే. వంటల్లో వేయడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది .

పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది:

పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది:

కొన్ని కుంకుమ పువ్వు రేకులను అందంకోసం ఉపయోగిస్తే పిగ్మెంటేషన్ సమస్య నివారించుకోవచ్చు. ముఖ్యంగా స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యలను, కళ్లక్రింద డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది. తేనెలోనానబెట్టిన కుంకుమ పువ్వు రేకులతో కళ్లక్రింద మసాజ్ చేయాలి.

నెలసరి సమస్యలు:

నెలసరి సమస్యలు:

మహిళల్లో నెలసరి సమస్యలను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది. హార్మోన్ లెవల్స్ ను, మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థను క్రమబద్దం చేస్తుంది. నెల సరి సమస్యలను, నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

గ్లోయింగ్ స్కిన్:

గ్లోయింగ్ స్కిన్:

కుంకుమ పువ్వు ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందాన్ని కూడా పెంచడంలో గొప్పది. అందుకే దీన్ని ఎక్కువగా ఫేస్ ప్యాక్స్ లో ఉపయోగిస్తుంటారు. ముఖంలో రక్తప్రసరణ పెరిగి, గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే తేనె, కుంకుమ పువ్వు కాంబినేషన్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం మంచిది .

మొటిమలు నివారిస్తుంది:

మొటిమలు నివారిస్తుంది:

కుంకుమ పువ్వులో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది . తులసి, కుంకుమపువ్వు కాంబినేషన్ లో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి . 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

కుంకుమ పువ్వు ఉపయోగించి హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు. ఒక చిటికెడు కుంకుపువ్వు వేసి అందులో లికోరైస్ పౌడర్ పాలు వేసి మిక్స్ చేయాలి. కురులు రాలిపోయిన చోట ఈ పేస్ట్ అప్లై చేసి కొద్దిసేపటికి తలస్నానం చేయాలి.

మూత్రపిండాల్లో రాళ్లు తొలగిస్తుంది:

మూత్రపిండాల్లో రాళ్లు తొలగిస్తుంది:

కుంకుమ పువ్వును పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది రక్తప్రసరణను పెంచుతుంది. ఈ చైనీస్ హెర్బ్ కడుపు నొప్పి, ఇతర మూత్రపిండాల్లో రాళ్లను తొలగిస్తుంది.

సన్ టాన్ తొలగిస్తుంది:

సన్ టాన్ తొలగిస్తుంది:

ఎండలో ఎక్కువగా తిరడగం వల్ల చర్మం నల్లగా కమిలిపోతుంది. అలాంటి కమిలిన చర్మాన్ని నార్మల్ స్థితికి తీసుకురావడానికి కుంకుమపువ్వు గ్రేట్ గా సమాయపడుతుంది. కొన్ని నేచురల్ ప్యాక్స్ వల్ల సన్ టాన్ నివారించుకోవచ్చు. మిల్క్ లో రాత్రంతా నానబెట్టి, ఉదయం ప్యాక్ వేసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం చాలా తక్కువ రోజుల్లోనే ఎఫెక్టివ్ ఫలితాలను అందిస్తుంది.

పెప్టిక్ అల్సర్ ను నయం చేస్తుంది:

పెప్టిక్ అల్సర్ ను నయం చేస్తుంది:

స్టొమక్ అల్సర్, లేదా పెప్టిక్ అల్సర్ ను నివారించడంలో కుంకుమ పువ్వు గొప్పగా సహాయపడుతుంది. కుంకుమ పువ్వును వేడి పాలలో వేసి బాగా కలబెట్టి, గోరువెచ్చగా త్రాగాలి.

గుండెలో మంట చల్లారుస్తుంది :

గుండెలో మంట చల్లారుస్తుంది :

గుండెలో మంటి లేదా అసిడిక్ రిఫ్లెక్షన్ తో బాధపడే వారికి త్వరగా ఉపశమనం కలిగించడంలో కుంకుమపువ్వు గొప్పది.

మెమరీ లాస్ తగ్గిస్తుంది:

మెమరీ లాస్ తగ్గిస్తుంది:

కుంకుమ పువ్వులో జ్ఝాపకశక్తిని పెంచే లక్షణాలు మెండుగా ఉన్నాయి . ఇది కోల్పోయిన జ్జాపకశక్తిని తిరిగి తీసుకొస్తుంది .

చర్మరంగును మార్చుతుంది:

చర్మరంగును మార్చుతుంది:

జిడ్డు చర్మానికి లేదా ఇన్ఫెక్షన్ అయిన చర్మానికి కుంకుమ పువ్వుతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇది నేచురల్ టోనర్ గా పనిచేస్తుంది. అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల మురికి తొలగించి చర్మ రంగు మార్చుతుంది.

శ్వాస సమస్యలు నయం చేస్తుంది:

శ్వాస సమస్యలు నయం చేస్తుంది:

ఈ విషయంలో మ్యాజిక్ అనే అనవచ్చు. శ్వాససమస్యలు, దగ్గు, ఇతర తీవ్ర శ్వాస సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కుంకుమపువ్వు పాలు గొప్పగా సహాయపడతాయి. వేడి పాలలో వేసి కుంకుమపువ్వు తాగడం వల్ల ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది.

దాంపత్యజీవితం బాగుంటుంది:

దాంపత్యజీవితం బాగుంటుంది:

కుంకుమపువ్వు ఆఫ్రోడియాసిక్, ఇది శీఘ్రస్కలన సమస్యను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. కామేచ్చను పెంచడానికి ఆయుర్వేదం ప్రకారం కుంకుమ పువ్వు గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యాన్సర్ ను కంట్రోల్ చేస్తుంది:

క్యాన్సర్ ను కంట్రోల్ చేస్తుంది:

ఈ ముదురు పసుపు వర్ణం గల నేచురల్ మూలిక పసిపిల్లల్లో దంతాల నొప్పిని తగ్గిస్తుంది . ఆయుర్వేదం ప్రకారం థెరఫియాటిక్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల క్యాన్సర్ ప్రమాదంను తగ్గిస్తుంది.

English summary

Amazing Uses Of Saffron According To Ayurveda

Amazing Uses Of Saffron According To Ayurveda. Saffron thread is generally used for treating moderate depression. Saffron is one of the most important ingredients used in Ayurvedic medicines.
Story first published: Monday, May 2, 2016, 12:02 [IST]
Desktop Bottom Promotion