For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్తమాతో బాధపడే వాళ్లు ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడని ఆహారాలు !

By Swathi
|

ఆస్తమా ఉన్న వాళ్లలో బ్రీతింగ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. శ్వాసనాళాలు చిన్నవిగా ఉండటం వల్ల బ్రీతింగ్ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల ఆస్తమా సమస్య వస్తుంది. ఆస్తమాతో బాధపడేవాళ్లు రెగ్యులర్ గా మందులు వాడాలి. అలాగే ఇన్హీలర్ ఎప్పుడూ పక్కనే ఉండేలా జాగ్రత్త పడాలి.

ఆస్తమా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాలకే ముప్పు తీసుకొస్తుంది. అలాగే కొన్ని రకాల ఆహారాలు కూడా ఆస్తమా పేషంట్స్ డైట్ నుంచి తొలగించడం మంచిది. ఎందుకంటే.. కొన్ని ఆహార పదార్థాలు.. ఆస్తమా మరింత ఎక్కువ అవడానికి కారణమవుతాయి. ఇప్పుడు ఆస్తమా పేషంట్స్ తీసుకోకూడని ఆహారాలేంటో చూద్దాం..

కొన్ని ప్రొడక్ట్స్

కొన్ని ప్రొడక్ట్స్

ఆస్తమా పేషంట్స్ అనిమల్ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండటం మంచిది. మాంసం, పాలు, ఎగ్స్, పాల ఉత్పత్తులు, ఫిష్, పోర్క్, బీఫ్ వంటివి తీసుకోకూడదు. ఇవి శ్వాసలో మరింత సమస్య తీసుకొస్తాయి.

పచ్చళ్లు

పచ్చళ్లు

కొన్ని రకాల పచ్చళ్లలో సల్ఫైట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రీతింగ్ కి మరింత ప్రాబ్లమ్ తీసుకొస్తాయి. కాబట్టి ఆస్తమాతో బాధపడేవాళ్లు పచ్చళ్లు తీసుకోకూడదు.

సోడియం

సోడియం

సోడియంకి దూరంగా ఉండటం చాలా అవసరం. అలాగే మోనోసోడియం గ్లూటమైట్ అనేది శ్వాస తీసుకోవడంతో ఇబ్బందికి కారణమవుతుంది. కాబట్టి ఆస్తమాతో బాధపడేవాళ్లు దీనికి దూరంగా ఉండటం మంచిది.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ లో ఉండే కొన్ని పదార్థాలు శ్వాసలో ఇబ్బందులకు కారణమవుతాయి. ఆప్రికాట్స్, క్రాన్ బెర్రీస్, పైనాపిల్స్ కూడా తీసుకోకూడదు.

సాఫ్ట్ డ్రింక్స్

సాఫ్ట్ డ్రింక్స్

సాఫ్ట్ డ్రింక్స్ లో ఉండే కొన్ని రకాల పదార్థాలు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. కాబట్టి ఆస్తమా పేషంట్స్ ఎట్టిపరిస్థితుల్లో ఈ డ్రింక్స్ తీసుకోకూడదు.

ఆయిల్స్

ఆయిల్స్

వెజిటబుల్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్ వంటివి వంటకు ఉపయోగించడం వల్ల.. ఇన్ల్ఫమేషన్ కి కారణమవుతాయి. కాబట్టి ఆస్తమాతో బాధపడేవాళ్లకు ఇది మరింత సమస్యగా మారుతుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్ చేసిన ఆలూ చిప్స్ లో సల్ఫైట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. వీటిని ఆస్తమా పేషంట్స్ తీసుకోకూడదు.

ఆల్కహాల్

ఆల్కహాల్

ఆస్తమాతో బాధపడేవాళ్లు.. ఆల్కహాల్ తీసుకుంటే.. సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి.. ఎలాంటి ఆల్కహాల్ అయినా దూరంగా ఉండటం మంచిది.

English summary

Avoid These Foods If You Have Asthma

Avoid These Foods If You Have Asthma. Avoiding such foods and maintaining a good lifestyle could reduce the asthma attacks to a certain level. Here is a list of some of those foods.
Story first published: Tuesday, May 3, 2016, 11:22 [IST]
Desktop Bottom Promotion