For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ స్టోన్స్ నివారించే ఆయుర్వేదిక్ రెమెడీస్

|

మూత్రపిండాలు రక్తం శుద్ధి అనే కీలక విధులను నిర్వహించడానికి,శరీరంలో విషాన్ని మరియు ఇతర వ్యర్ధాలు తొలగించుకోవటానికి సహాయం చేస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడుట వలన వాటి విధులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. యూరిక్ ఆమ్లం, పాస్పరస్, కాల్షియం మరియు అక్సాలిక్ ఆమ్లం వంటి రసాయనాలు పేరుకుపోవడం వలన రాళ్ళు ఏర్పడటానికి అత్యంత సాధారణ కారణంగా చెప్పవచ్చు.

ఎక్కువగా విటమిన్ D, ఖనిజ అసమతుల్యత, అతిసారం, గౌట్, అసమాన ఆహారం తీసుకొవటం వంటివి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కొన్ని ఇతర కారణాలుగా చెప్పవచ్చు. మూత్రపిండాలలో రాళ్ళు ఉండడం వలన చాలా బాధాకరంగాను మరియు అనేక విధాలుగా రోగి యొక్క జీవితంను అడ్డుకుంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉంటె ప్రధాన లక్షణాలు తరచూ మూత్ర విసర్జన, వికారం, వాంతులు మరియు అసాధారణ చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటాయి.

Ayurvedic Remedies For Kidney Stones

కిడ్నీ స్టోన్స్ ను నివారించుకోవాలంటే మీరు తీసుకొనే ఆహారం మరియు డ్రింక్స్ మీద ప్రత్యేక శ్రద్ద కలిగి ఉండాలి. కొన్నిఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి. అంతే కాదు కొన్ని రకాల కెమికల్స్ వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి. బ్లాడర్ లో చేరితే అత్యంత బాధకరమైన పరిస్థితి ఉంటుంది. కెమికల్స్ చాలా వరకూ క్యాల్షియం, ఆక్సాలేట్ లేదా ఫాస్పరస్ తో కలిసినప్పుడు యూరిక్ యాసిడ్ విచ్ఛిన్నం అయ్యి కిడ్నీ స్టోన్ కు దారితీస్తుంది. మరి కిడ్నీస్టోన్ నివారించడానికి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Ayurvedic Remedies For Kidney Stones

తులసి ఆకులు: తులసి వల్ల మూత్రపిండాలకు ఒక పటిష్టమైన ప్రభావం కలిగి ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్నట్లైతే ఒక టీస్పూన్ తులసి రసం మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. ఈ మూలిక వైద్యం వల్ల రెగ్యులర్ గా ఆరునెలలపాటు క్రమం తప్పకుండా చేసుకోవడం వల్ల కిడ్నీలోని రాళ్ళునివారించిబడుతాయి. మరియు కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోయేందుకు సహాయపడుతుంది.

Ayurvedic Remedies For Kidney Stones

కిడ్నీ బీన్స్: కిడ్నీ స్టోన్ నివారించడానికి ఇది కిడ్నీ బీన్స్ వందశాతం హెర్బల్ ట్రీట్మెంట్ కాకపోవచ్చు. కానీ కిడ్నీ స్టోన్ కరిగించడంలో ఒక బెస్ట్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు. కిడ్నీ స్టోన్ కు ఒక ప్రభావవంతమైన యూరినరీ హోం రెమడీగా తీసుకోవచ్చు. వీటిని ట్రెడిషనల్ గా మెడిసినల్ టానిక్స్ లో ఉపయోగిస్తుంటారు.

Ayurvedic Remedies For Kidney Stones

కోకనట్ వాట్: కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి కోకనట్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది. కోకనట్ వాటర్ ను ప్రతి రోజూ తాగడం వల్ల కిడ్నీస్టోన్స్ మరియు ఇతర వ్యర్థాలను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. రోజులో రెండు మూడు సార్లు కోకనట్ వాటర్ ను కాలీ పొట్టతో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ తొలగింపబడుతుంది. భోజనానికి అరగంట ముందు తీసుకోవడం మంచిది.

Ayurvedic Remedies For Kidney Stones

అలోవెర: కిడ్నీ స్టోన్స్ ను క్లియర్ చేయడానికి కలబంద రసం చాలా అద్భుతంగా సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ ను త్రాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా సహాయపడుతుంది.

Ayurvedic Remedies For Kidney Stones

తగినన్ని నీళ్ళు త్రాగడం: నీటిని తాగడం శరీరం మరియు మూత్రపిండాలు ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచడానికి రోజువారీ తగినంత నీరు అవసరం. మూత్రపిండాల్లో రాళ్లు దృష్టిలో తీసుకుంటే చికిత్సకు తక్కువ కాదు. ఇతర ఆరోగ్యకరమైన ద్రవాలు లేదా పానియాలతో పాటు 8-10 గ్లాస్ ల నీటిని త్రాగాలి. మూత్రంలో పాలిపోవడం తొలగింపులో సహాయపడుతుంది. మినరల్ వాటర్ అత్యంత సిఫార్సు చేయబడింది. తక్కువ ఆమ్ల లక్షణాలు, కాల్షియం తయారి తగ్గించటం మరియు మూత్రంలో యూరిక్ ఆమ్లం గాఢత తగ్గించడంలో సహాయపడుతుంది. మినరల్ వాటర్ మూత్రపిండాలలో పరిమాణంలో పెరుగుదల ఉన్న రాళ్లను నిరోధిస్తుంది.కాబట్టి మీ దినచర్యలో భాగంగా ఎక్కువ నీళ్ళు త్రాగి కిడ్నీ స్టోన్స్ ను నేచురల్ గా నివారించుకోవచ్చు.

Ayurvedic Remedies For Kidney Stones

సెలరీ: కిడ్నీ స్టోన్ నివారించడానికి ఇది ఒక బెస్ట్ హెర్బ్. ఖాళీ కడుపుతో ప్రతి రోజూ ఉదయం సెలరీను తీసుకోవడం మంచిది. ఈ సెలరీను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

Ayurvedic Remedies For Kidney Stones

డాండెలైన్: మూత్రపిండాల్లో రాళ్ళు మరియు మూత్రపిండ సమస్యలను నివారించడానికి డాండెలైన్ మూలిక అద్భుతంగా సహాయపడుతుంది. డాండెలైన్ రూట్ లో మూత్రవిసర్జన ప్రేరక లక్షణాలు కలిగి ఉన్నాయి మరియు ఎక్కువ పొటాషియం కూడా కలిగి ఉంది. అందువల్ల ఇది మూత్రం ఉత్పత్తిని ప్రోత్సహించడానికి తగినంత సామర్థ్యం కలిగి ఉంటుంది.

Ayurvedic Remedies For Kidney Stones

దానిమ్మ: మూత్రపిండాళ్లో రాళ్లును నివారణకు ఒక ఉత్తమ హెర్బల్ ట్రీట్మెంట్ కొరకు దానిమ్మ గింజలు సహాయపడుతాయి. దానిమ్మ ఆకులు, లేదా దానిమ్మ గింజల జ్యూస్ త్రాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ జ్యూస్ ను వారంలో ఒక రోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం చాలా మంచిది.

Ayurvedic Remedies For Kidney Stones

ఉలవలు: ఆయుర్వేదం ప్రకారం కుతిల్ దాల్ కిడ్నీ స్టోన్స్ కు కారణమయ్యే రీనల్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. కుతిల్ దాల్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను బ్రేక్ చేస్తుంది. ఉలవలు మెత్తగా ఉడికించి 25ఎంఎల్ వాటర్ తో కలిపి తీసుకోవాలి. దీన్ని ప్రతి రోజూ రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కిడ్నీల నుండి స్టోన్స్ ను తొలగిస్తుంది

English summary

Ayurvedic Remedies For Kidney Stones

Kidney stones are one of the most painful diseases that can hamper our day-to-day activities to a great extent. Stones are a mineral deposit that are filtered by the kidney and dissolved in urine, which prevents these mineral salt deposits from becoming solid.
Story first published: Thursday, June 16, 2016, 16:50 [IST]
Desktop Bottom Promotion