For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెస్ట్ పెయిన్ నివారించడానికి ఆయుర్వేదిక్ రెమెడీస్ ...

|

మనం ఒక్కొక్కసారి ఛాతీలో నొప్పిని, ఆయాసాన్ని అనుభవిస్తుంటాం. ఇవి గుండె, ఆహారనాళాలకు సంబంధించిన వ్యాధుల వలన మాత్రమే కాక, ఛాతీ భాగంలో ఉండే ఊపిరితిత్తుల వల్ల కూడా కలుగవచ్చు. స్థూలకాయులలోనూ, 40 సంవత్సరాలు పైబడిన వారిలోనూ, హై బిపి, మధుమేహం వ్యాధి ఉన్నవారిలో, ధూమపానం చేసే వారిలో (వీరిని హైరిస్క్‌ గ్రూప్‌ అంటారు) ఛాతీలోని నొప్పి, ఆయాసం వస్తే, గుండెకు సంబంధించిన వ్యాధులేమైనా ఉన్నాయేమో అనుమానించాలి.

ఛాతీ ప్రదేశంలో ముందు భాగంలో గుండె, వెనుక భాగంలో ఆహార నాళం కొద్దిగా ఎడమవైపు ఉంటాయి. అందుకనే మనం ఒక్కొక్కసారి ఆహారనాళంలో (ఈసోఫేగస్‌) మంటను గుండె నొప్పిగా భ్రమపడుతుంటాము. అలా ఛాతీ నొప్పిగా ఉన్నపుడు ఆహార నాళాన్ని పరీక్ష చేయించుకోవాలి. ఛాతీ భాగంలోని ఛాతీకుహరంలో ఊపిరితిత్తులు ఉంటాయి. ఛాతీలోని చర్మం, కండరాలు, ఎముకలు, ఊపిరి తిత్తుల వ్యాధులున్నా ఛాతీలో నొప్పి అనుభవమవుతుంది.

Ayurvedic Remedies To Treat Chest Pain

కాబట్టి, దేనివల్ల ఛాతీలోనొప్పి కలిగినా వెంటనే డాక్టర్ ను సంప్రధించి సమస్యను తెలుసుకోవడం చాలా ముఖ్యం. చెస్ట్ పెయిన్ కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తుంటే, లేదా చిన్న కారణాల వల్ల మాత్రమే చెస్ట్ పెయిన్ వస్తున్నా కొన్ని హోం రెమెడీస్ ద్వారా తగ్గించుకోవచ్చు. అయిదే తీవ్రస్థాయిలో నొప్పి, తరచూ ఇబ్బంది కలిగిస్తుంటే మాత్రం ప్రొఫిషనల్ డాక్టర్స్ ను తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. ఇలాంటి తీవ్రత నొప్పిని హోం రెమెడీస్ తో నివారించలేము. అదే గ్యాస్, స్ట్రెస్, కోల్డ్, ఆందోళన మరియు స్మోకింగ్ వంటి అలవాట్లు వల్ల చెస్ట్ లో పెయిన్ ఉన్నట్లైతే, కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ ను ఉపయోగించి చెస్ట్ పెయిన్ నివారించుకోవచ్చు. ఇలాంటి కారణాల వల్ల మీలో కూడా ఛాతీ బాధిస్తుంటే, ఈ ఆయుర్వేదిక్ రెమెడీలను ఉపయోగించండి.

Ayurvedic Remedies To Treat Chest Pain

వెల్లుల్లి: వెల్లుల్లి హార్ట్ కు చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, నియాసిన్, రిభోఫ్లోవిన్, థైయమిన్, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మరియు ఇతర అనేక న్యూట్రీషియన్స్ కలిగి ఉంటాయి. దగ్గు మరియు ఆస్తామా వంటి జబ్బులను తగ్గించడమే కాకుండా, చెస్ట్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేచిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి ముందుగా వెల్లుల్లి రెబ్బను నమలండి.

ప్రతి రోజూ ఉదయం కాలీపొట్టతో వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు తినాలి. ఇవి తినడం వల్ల వ్యాధులను దూరం చేస్తుంది. ముఖ్యంగా చెస్ట్ పెయిన్ రిలేటెడ్ మరియు ఎసిడి వంటివి నివారి్తారు, ప్రతి రోజూ భోజనం చేసిన తర్వాత కూడా 3, 4తినవచ్చు.

Ayurvedic Remedies To Treat Chest Pain

పసుపు:పసుపులో యాంటీసెప్టిక్, యాంటిబ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల అనేక వ్యాధులకు ఒక గొప్ప ఔషధంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. అదే విధంగా చెస్ట్ పెయిన్ నివారించడంలో కూడా పసుపు గ్రేట్ గా సమాయపడుతుంది . అందువల్ల ప్రతి రోజు మీరు వండే ఆహారాల్లో దీన్ని జోడించండం చాలా మంచిది.

Ayurvedic Remedies To Treat Chest Pain

ములేతి: ములేతి ఆమేజింగ్ హెర్బ్, ఆయుర్వేదంలో దీని వాడకం ఎక్కువ, వివిధ రకాల వ్యాధులకు నివారణకోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. హార్ట్ రిలేటెడ్ సమస్యలను , చెస్ట్ పెయిన్ , స్టొమక్ ప్రాబ్లెమ్స్, మరియు ఫీవర్ నివారిస్తుంది. ములేతి రూట్ లో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్ ను శరీరంలో తగ్గిస్తుంది . దమనుల్లో రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది.

Ayurvedic Remedies To Treat Chest Pain

మెంతులు: మెంతులు తినడం వల్ల చాతీలో బరువు తగ్గుతుంది . మెంతుల్లో ఉండే యాంటీయాక్సిడెంట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ ను మంచి ఆకారంలో ఉంచుతుంది. ఒక టేబుల్ స్పూన్ మెంతులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. దీన్ని మరుసటి రోజు ఉదయం కాలీపొట్టతో తీసుకోవాలి.

Ayurvedic Remedies To Treat Chest Pain

తులసి: తులసిలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చెస్ట్ పెయిన్ నివారించడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది. చెస్ట్ పెయిన్ తక్కువగా ఉన్నప్పుడు కొన్ని తులసి ఆకులను నోట్లో వేసుకొని నమలాలి. చెస్ట్ పెయిన్ నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

English summary

Ayurvedic Remedies To Treat Chest Pain

The excruciating, heavy feeling and the stiffness in the chest refers to a chest pain. Chest pain could be mild or severe; in some cases, it could even be fatal. Chest pain can be caused by an array of problems. It could be indicative of high cholesterol levels due to a sedentary lifestyle and an unhealthy diet.
Story first published:Saturday, June 18, 2016, 11:51 [IST]
Desktop Bottom Promotion