For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పులిపిర్లను శాశ్వతంగా నివారించే ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమిడీస్..!!

By Swathi
|

కొంతమందికి పులిపిర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. చేతులు, భుజాలపైనే కాకుండా.. ముఖంపై కూడా ఇబ్బందిపెడుతుంటాయి. కొంతమంది పాదాలపై కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ పులిపిర్లు రావడానికి హెచ్ పీ వీ అనేది ప్రధాన కారణం. వీటికి చికిత్స తీసుకోకపోతే.. శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంటుంది.

ఇవి చాలా రఫ్ గా కనిపిస్తాయి. ఇవి హార్డ్ ప్రొటీన్స్ తో ఏర్పడటం వల్ల.. చూడ్డానికి చాలా గట్టిగా ఉంటాయి. టవల్స్, షూస్, క్లాత్స్ షేర్ చేసుకోవడం వల్ల ఇవి ఒకరి నుంచి మరొకరికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా.. వీటికి ట్రీట్మెంట్ అవసరం ఉండదు.

ఇవి ఏర్పడిన తర్వాత కొన్ని నెలలకు పోతాయి. కానీ.. అలా పోలేదు అంటే.. వీటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం. అయితే.. ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు హెర్బల్ రెమిడీస్ ఫాలో అవడం సురక్షితం. మరి పులిపిర్లలో రకాలేంటి, వాటికి ఆయుర్వేదిక్ రెమిడీస్ ఏంటో చూద్దాం..

సాధారణ పులిపిర్లు

సాధారణ పులిపిర్లు

ఇవి చేతివేళ్లు, కాలి వేళ్లు, మోచేతులు, మోకాళ్లపై ఏర్పడతాయి. ఇవి చూడ్డానికి గ్రీనిష్, బ్రౌనిష్ కలర్ లో ఉంటాయి.

ఫ్లాట్ వార్ట్స్

ఫ్లాట్ వార్ట్స్

ఇవి సాధారణంగా.. గ్రూప్స్ గా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా భుజాలు, ముఖంపై ఏర్పడతాయి.

ప్లాంటార్ వార్ట్స్

ప్లాంటార్ వార్ట్స్

ఇలాంటి పులిపిర్లు.. చర్మం లోపల ఏర్పడతాయి. సాధారణంగా చర్మం బయటవైపు ఏర్పడేవి. ఇవి.. అరికాళ్లలో ఎక్కువగా ఏర్పడతాయి. ఇవి చాలా పెయిన్ ఫుల్ గా ఉంటాయి. కొన్నిసందర్భాల్లో వీటివల్ల నడవడానికి కూడా రాదు.

పెరింగ్యువల్ వార్ట్స్

పెరింగ్యువల్ వార్ట్స్

పెరింగ్యువల్ వార్ట్స్ అనేవి.. గోళ్ల పైన, కింద ఏర్పడతాయి. ఇవి చేతిగోళ్లు, కాలి గోళ్లకు రెండింటికీ ఏర్పడవచ్చు. అన్ని రకాల పులిపిర్లను నివారించడానికి ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమిడీస్ ఉన్నాయి.

బంగాళదుంప

బంగాళదుంప

బంగాళదుంపలు కేవలం రుచికరంగానే కాదు.. ఇందులో ఎన్నో ఔషధగుణాలు దాగుంటాయి. పచ్చి బంగాళదుంపలు.. పులిపిర్లను నివారిస్తాయి. బంగాళదుంపను తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి. దాన్ని పులిపిర్లపై పెట్టుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత తీసేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే.. పులిపిర్లు తగ్గిపోతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి

ఆహారాల్లో స్పైసీనెస్ తో పాటు, రుచిని అందించే వెల్లుల్లి.. అనేక రకాల అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం. కొలెస్ట్రాల్ తో పాటు, పులిపిర్లు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ పంగల్ గునాలు ఉంటాయి.

ఉపయోగించే విధానం

ఉపయోగించే విధానం

కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని.. క్రష్ చేసి.. పులిపిర్లకు అప్లై చేయాలి. బ్యాండేజ్ తో కవర్ చేయాలి. అలాగే కొన్ని గంటలు పెట్టుకోవాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని వారాలపాటు చేస్తే.. పులిపిర్లు తగ్గడం మీరే గమనిస్తారు.

అలోవెరా

అలోవెరా

అలోవెరాలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. చర్మ సమస్యలు, చుండ్రు, ఎగ్జిమా, పులిపిర్ల నివారణకు ఆయుర్వేదంలో అలోవెరాను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.

ఉపయోగించే విధానం

ఉపయోగించే విధానం

కొన్ని అలోవెరా ఆకులు కట్ చేసుకోవాలి. జెల్ తీసి.. పులిపిర్లపై రాసుకోవాలి. బ్యాండెజ్ తో కవర్ చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు రెగ్యులర్ గా చేస్తే.. పులిపిర్లు తగ్గిపోతాయి.

పచ్చి బొప్పాయి

పచ్చి బొప్పాయి

పచ్చి బొప్పాయి పులిపిర్లు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రొటియోలిటిక్ ఎంజైమ్స్ కలిగి ఉంటుంది. డెడ్ టిష్యూస్ తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఉపయోగించే విధానం

ఉపయోగించే విధానం

పచ్చి బొప్పాయిని కట్ చేసుకోవాలి. తెల్లగా విత్తనాల్లా ఉండే వాటిని తీసుకుని వాటిని నీటిలో కలిపి.. పులిపిర్లకు రాసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే.. పులిపిర్ల సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు.

English summary

Ayurvedic Remedies To Treat Warts

Ayurvedic Remedies To Treat Warts. Wart is a non-malignant growth that appears on the skin. Warts are generally harmless and occur on the feet, face, hands and other parts of the body.
Story first published:Saturday, July 16, 2016, 15:52 [IST]
Desktop Bottom Promotion