For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Obesity 2023: అధిక బరువు జ్ఞాపకశక్తి కోల్పోవడానికి ఎలా కారణమవుతుంది ?

World Obesity 2023: అధిక బరువు జ్ఞాపకశక్తి కోల్పోవడానికి ఎలా కారణమవుతుంది ?

By Swathi
|

జపాన్ లో అధిక బరువు ఇల్లీగల్ అని మీకు తెలుసా ? జపాన్ గవర్నమెంట్ మెటబో లా పెట్టింది. దీని ప్రకారం బరువు, నడుము చుట్టుకొలత లిమిట్ గా ఉండాలి. ఈ నియమానికి జపనీయులందరూ కట్టుబడి ఉంటారు. ఒకవేళ ఈ నియమాన్ని పాటించడంలో విఫలమైతే.. పెద్ద మొత్తంలో ఫైన్ లేదా జైలు శిక్ష విధిస్తారట.

పురుషుల్లో ఊబకాయంను తగ్గించే లైఫ్ స్టైల్ టిప్స్ పురుషుల్లో ఊబకాయంను తగ్గించే లైఫ్ స్టైల్ టిప్స్

ఒకవేళ ఈ రూల్ ఇండియాలో ఫాలో అయితే.. ఇండియన్ జనాభాలో సగం మంది.. ఒబేసిటీ, ఓవర్ వెయిట్ కలిగినవాళ్లే ఉంటారు. అయితే ప్రపంచంలోనే మరే ఇతర దేశాల్లో ఇలాంటి రూల్స్ లేవు. ప్రపంచ వ్యాప్తంగా 300 మిలియన్ జనాభా ఒబేసిటీతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నారట. అలాగే 1 బిలియన్ కంటే ఎక్కువ మంది.. 25 నుంచి 30 బీఎమ్ఐ కలిగిన వాళ్లు ఉన్నారట.

స్థూలకాయం(ఒబేసిటీ) తగ్గించే హోం రెమిడీస్

బరువు ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలు పక్కనపెడితే.. ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లకు మానసిక సమస్యల రిస్క్ ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి వాళ్లలో మెమరీ లాస్ రిస్క్ ఎక్కువగా ఉంటుందట. ఎక్కువ బరువు కలిగి ఉండటం మెమరీ లాస్ కి ఎలా కారణమవుతుందో ఇప్పుడు చూద్దాం..

క్యాలరీలు

క్యాలరీలు

రోజుకి 2100 నుంచి 6000 క్యాలరీలు తీసుకునే వాళ్లలో మెమరీ లాస్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి. అయితే ఇది ఎక్కువగా 70 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లలో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

బ్రెయిన్ డెవలప్ మెంట్

బ్రెయిన్ డెవలప్ మెంట్

ఒబేసిటీ, అధిక బరువు కలిగినవాళ్లలో 4 నుంచి 8 శాతం తక్కువ బ్రెయిన్ టిష్యూ ఉంటుందని రీసెర్చ్ చెబుతోంది. సాధారణంగా మనుషుల్లో 100 బిలియన్ నరాలు ఉంటాయి. ఒబేసిటీ, అధిక బరువు ఉన్నవాళ్లు 8 బిలియన్ నరాలు కోల్పోతారట.

గ్లూకోజ్

గ్లూకోజ్

న్యూరాన్స్ పర్సెంటేజ్ బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలపై పడుతుంది. దీనివల్ల కణాలకు గ్లూకోజ్ సప్లై తగ్గిపోతుంది. దీనికారణంగా కణాలకు కావాల్సిన శక్తి కోల్పోయి.. మెమరీ, స్టోరేజ్ పై ప్రభావం చూపుతుంది.

BDNF

BDNF

బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ లేదా BDNF నరాల డెవలప్ మెంట్ ని కంట్రోల్ చేస్తుంది. అధిక బరువు ఉండటం, సరైన క్రమంలో ఆహారం తీసుకోకపోవడం వంటి అలవాట్లు బీడీఎన్ఎఫ్ పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.

అనేక అనారోగ్య సమస్యలు

అనేక అనారోగ్య సమస్యలు

అధిక బరువు ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్, టైప్ టు డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే లైంగిక సామర్థ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

బరువు తగ్గాలనే పట్టుదల

బరువు తగ్గాలనే పట్టుదల

మీరు బరువు తగ్గి, మీకు నచ్చిన షేప్ లో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సరైన డైట్, వ్యాయామంతో.. ఒబేసిటీ నుంచి బయటపడవచ్చు.

English summary

World Obesity 2023: Being Overweight Can Lead You To Memory Loss

Being Overweight Can Lead You To Memory Loss. people who fall under the category of 'obese' and 'overweight' are the main contenders of putting their mental health at risk. Yes, these people are the most prone to the risk of memory loss.
Desktop Bottom Promotion