For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి, బీపీ నియంత్రణకి.. వార్మ్ వాటర్ బాత్

By Nutheti
|

స్నానం అంటేనే ఉపశమనం. అయితే కొంతమంది చల్లని నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. మరికొందరు వేడి నీటి స్నానం ఇష్టపడతారు. అయితే.. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గోరువెచ్చని నీటితో స్నానం వల్ల రకరకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శారీరక ఉత్సాహంతోపాటు.. మానసిక ఒత్తిడిని కూడా జయించవచ్చు. రాత్రి పడుకునే ముందు, వ్యాయామానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేసి చూడండి.. ఫలితాలు మీకే కనిపిస్తాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల పొందే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

కండరాలు, కీళ్లకు రిలాక్షేషన్

కండరాలు, కీళ్లకు రిలాక్షేషన్

గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. కండరాలు,కీళ్లకు మంచిది. అలాగే కండరాలు, కీళ్ల నొప్పులను కూడా గోరువెచ్చని నీళ్లు తగ్గిస్తాయి. అలాగే రక్తప్రసరణ సజావుగా సాగడానికీ గోరువెచ్చని నీళ్లు సహాయపడతాయి. అయితే పూర్తీగా కాకపోయినా.. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల నొప్పి, వాపుతోపాటు అలసట కూడా తగ్గుతుంది.

నిద్రపట్టడానికి

నిద్రపట్టడానికి

హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల శరీరానికి చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.. అలాగే త్వరగా నిద్రపోవడానికి సహయపడుతుంది. వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల.. శరీర ఉష్ణోగ్రత తగ్గతుంది.. కండరాలు రిలాక్స్ అవుతాయి. శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా.. చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.

బ్రెయిన్ పవర్

బ్రెయిన్ పవర్

తలకు ఎసెన్షియల్ ఆయిల్ పెట్టి.. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల.. చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది.

చర్మానికి

చర్మానికి

చర్మంపై మలినాలు పేరుకోవడానికి రంధ్రాలు కారణమవుతాయి. గోరువెచ్చని నీళ్లు ఈ రంధ్రాలు తెరుచుకునేలా చేసి.. శుభ్రం చేస్తాయి. దీనివల్ల శరీరంపై మురికి క్లీన్ అయి.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

బాడీ షేప్

బాడీ షేప్

చిన్న చిన్న గాయాలు, నొప్పులు, జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి గోరువెచ్చని స్నానం సహాయపడుతుంది. ఏదైనా ఫిజికల్ యాక్టివిటి పూర్తి చేశాక.. వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా ఉంటుంది.

వ్యాయామానికి ముందు

వ్యాయామానికి ముందు

ఉదయం వ్యాయామానికి ముందు స్నానం చేయడం వల్ల.. చాలా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఉదయం నిద్రలేవగానే.. కండరాలన్నీ పట్టేసినట్టు ఉంటాయి.. కాబట్టి వేడినీటి స్నానం చేయడం వల్ల.. కండరాలకు రిలాక్స్ గా ఉంటుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది.

ఒత్తిడి

ఒత్తిడి

వెచ్చని నీటి స్నానం.. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకాస్త ఉపశమనం పొందాలి అనుకుంటే.. నీటిలో యుకలిప్టస్ ఆయిల్ లేదా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గి.. చాలా రిలాక్సేషన్ కలిగిస్తుంది.

బీపీ తగ్గడానికి

బీపీ తగ్గడానికి

హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల.. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు.. ఇది చక్కటి పరిష్కారం.

 మెడ, గొంతు

మెడ, గొంతు

హాట్ వాటర్ బాత్ వల్ల మెడ, భుజం వంటి నొప్పుల నుంచి దూరంగా ఉండవచ్చు. కాసేపు మెడ, భుజం కండరాలను వెచ్చటి నీటితో నొక్కడం వల్ల చాలా రిలాక్సేషన్ గా ఉంటుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

మధుమేహంతో బాధపడేవాళ్లు హాట్ టబ్ బాత్ చేయడం వల్ల రక్తంలో షుగర్, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. 20 నుంచి 30 నిమిషాల పాటు వారానికి 6సార్లు హాట్ టబ్ బాత్ చేయడం వల్ల దాదాపు రెండున్నర కేజీల బరువు తగ్గవచ్చని అధ్యయనాలు నిరూపించాయి.

దగ్గు

దగ్గు

వేడి నీటి ఆవిరి పట్టడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. దగ్గుకి గొంతులో ఇన్ఫెక్షన్లే ప్రధాన కారణం. కాబట్టి.. యూకలిప్టస్ ఆయిల్ యాడ్ చేసి.. ఆవిరి పట్టడం వల్ల.. శ్వాస సులభంగా ఉంటుంది.

తలనొప్పి

తలనొప్పి

చాలా రకాల తలనొప్పులు తలలో రక్త ప్రసరణ సజావుగా లేకపోవడం వల్లే వస్తాయి. హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా ఉండటమే కాదు.. తలనొప్పి కూడా తగ్గిపోతుంది.

English summary

Benefits of bathing with warm water

Bathing with warm water will give relaxation of the joints, tendons, and muscle tissue. At the same time, Warm water can treat pain in muscles and joints caused by arthritis, muscle tear, and fatigue.
Story first published: Friday, January 1, 2016, 13:49 [IST]
Desktop Bottom Promotion