For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెదడు ఆరోగ్యానికి బాదాం ఎలా సహాయపడుతుంది ?

By Swathi
|

మనలో చాలామంది.. ప్లాంట్స్ ద్వారా ఆహారం పొందడానికి ప్రయత్నిస్తాం. మొక్కలు, చెట్ల ద్వారా వచ్చే ఆహారం ద్వారా రకరకాల పోషకాలు పొందవచ్చు. అనేక మొక్కల ఉత్పత్తులు, ఆకులు, పండ్లు, కూరగాయల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి.

బాదాంలో కూడా చాలా గొప్ప పోషక విలువలు ఉంటాయి. ఆల్మండ్స్ గ్రేట్ బెన్ఫిట్స్ ఉంటాయని సైన్స్ నిరూపించింది. బ్రెయిన్ గ్రోత్ కి ఇవి చాలా సహాయపడతాయని.. అధ్యయనాలు నిరూపించాయి. కాబట్టి బాదాం గింజలు తినడం వల్ల.. మెదడు గ్రోత్ కి, ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.

చిన్నపిల్లల డైట్ లో కంపల్సరీ బాదాం చేర్చడం వల్ల వాళ్లలో ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అలాగే.. బాదాం తినడం వల్ల బ్రెయిన్ కి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

Almonds For The Brain

లీన్ ప్రొటీన్స్
బాదాంలో లీన్ ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడుకి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఎనర్జీ అందించడంతో పాటు, బ్రెయిన్ సెల్స్ ని రిపేర్ చేస్తాయి. అలాగే ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెమరీని పెంచుతాయి.

Almonds For The Brain

జింక్
జింక్ మినరల్ తో పొందే ప్రయోజనాలు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ముఖ్యంగా బ్రెయిన్ కి చాలా అవసరం. ఇమ్యున్ సిస్టమ్ ని బలంగా మార్చడమే కాకుండా.. బలమైన యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేసి.. బ్లడ్ లోని ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది.

ఫ్రీరాడికల్స్ ని తగ్గించడం వల్ల.. బ్రెయిన్ హెల్త్ మెరుగుపడుతుంది. బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవడానికి ఇదొక ముఖ్యకారణం. కాబట్టి రెగ్యులర్ డైట్ లో బాదాం చేర్చుకుంటే.. వీటిని అరికట్టవచ్చు.

Almonds For The Brain

విటమిన్స్
బాదాంలో ఎక్కువ మొత్తంలో విటమిన్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ ఆరోగ్యకరంగా పనిచేయడానికి ముఖ్యమైన పదార్థాలు. విటమిన్ బి6 బాదాంలో లభిస్తుంది. ఇది.. మనుషుల డైట్ లో చాలా ముఖ్యమైనది. ఇది బ్రెయిన్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది.

Almonds For The Brain

బాదాం తినడం వల్ల విటమిన్ ఈ కూడా అందుతుంది. మెదడు ఏజింగ్ ప్రాసెస్ ని తగ్గిస్తుంది. దీనివల్ల మనుషి ఏజ్ తోపాటు.. బ్రెయిన్ ఏజ్ పెరగకుండా ఉంటుంది. మెమరీ కెపాసిటీ పెంచుతుంది.

Almonds For The Brain

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తెలివితేటలను పెంచుతాయి. హెల్త్ డ్రింక్స్ లో ఒక మోతాదులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బాదాం ద్వారా న్యాచురల్ గా పోషకాలు పొందవచ్చు.

ఇలాంటి బలమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా.. బాదాం.. మెదడుకు పోషణ అందిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు తినడంతో పాటు, పిల్లలకు ఖచ్చితంగా రెగ్యులర్ గా బాదాం ఇవ్వాలి.

English summary

Benefits Of Eating Almonds For The Brain

Benefits Of Eating Almonds For The Brain. It has been found that the nutritive value of almonds help in the growth of the brain. The benefits of eating almonds for brain are not a secret anymore.
Story first published:Wednesday, August 3, 2016, 17:26 [IST]
Desktop Bottom Promotion