For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉన్నట్టుండి ఇబ్బంది పెట్టే హార్ట్ బర్న్ నివారించే ఎఫెక్టివ్ రెమిడీస్..!

By Swathi
|

ప్రస్తుత రోజుల్లో ఎసిడిక్ రిఫ్లక్స్ చాలా కామన్ అయింది. చాలా కామన్ గా వినిపిస్తున్న సమస్య ఇది. అన్ హెల్తీ హ్యాబిట్స్, అన్ బ్యాలెన్స్డ్ డైట్, స్పైసీ ఫుడ్, ఒత్తిడి, ఒబేసిటీ వంటి వన్నీ.. హార్ట్ బర్న్ ని కారణమవుతాయి. చెస్ట్ చెప్పలేని ఇబ్బంది కలగడాన్ని హార్ట్ బర్న్ అని పిలుస్తారు.

ఆల్కహాల్, కెపీన్, ఎసిడిక్ ఫుడ్స్ అయిన టమోటాలు, ఆరంజ్ వంటివి కూడా డైజెషన్ ప్రాబ్లమ్ కి కారణమవుతాయి. ఈ సమస్య ఎక్కువగా చెస్ట్ లో కనిపిస్తుంది. పొట్టలో యాసిడ్ ఎక్కువగా ఏర్పడటం వల్ల ఈ సమస్య వస్తుంది.

ఇలాంటప్పుడు మెడిసిన్స్ మంచి రిలీఫ్ ని ఇస్తాయి. కానీ ఎక్కువగా వాటిపై ఆధారపడితే.. శరీరానికి హాని కలుగుతుంది. కాబట్టి హోం రెమిడీస్ ట్రై చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. హార్ట్ బర్న్ సమస్యను సొంతంగా మీరే నివారించుకోవడానికి సింపుల్ హోం రెమిడీస్ అందుబాటుులో ఉన్నాయి.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ కి 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఆహారం తీసుకున్న వెంటనే తీసుకోవాలి. జీర్ణక్రియ సజావుగా, తేలికగా జరగడానికి ఈ డ్రింక్ సహాయపడి.. హార్ట్ బర్న్ ని నివారిస్తుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాని నీళ్లలో కలుపుకుని తీసుకోవడం వల్ల హార్ట్ బర్న్ సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. జీర్ణవ్యవస్థను డెటాక్సిఫై చేసే గుణం బేకింగ్ సోడాలో ఉంటుంది.

బంగాళదుంప జ్యూస్

బంగాళదుంప జ్యూస్

కొన్ని తాజా బంగాళదుంపల రసం తీసి.. చల్లటినీటితో కలిపి భోజనం తర్వాత తీసుకోవాలి. ఈ జ్యూస్ హార్ట్ బర్న్ నుంచి, లక్షణాల నుంచి ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగిస్తుంది.

సోపు

సోపు

సోపు టీతయారు చేసుకోవడం చాలా తేలిక. ఒక టీస్పూన్ సోపు గింజలను ఒక కప్పు వేడినీటిలో కలపాలి. కొన్ని నిమిషాల తర్వాత వడకట్టి.. తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే అసౌకర్యాన్ని నివారించవచ్చు.

తేనె

తేనె

ఒక టీస్పూన్ తేనె, 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఒక గ్లాసు నీటిలో కలిపాలి. భోజనం తర్వాత ఈ డ్రింక్ తాగితే.. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

దాల్చిన చెక్క టీ

దాల్చిన చెక్క టీ

దాల్చిన చెక్క ఘాటుగా ఉన్నప్పటికీ జీర్ణక్రియ తేలికగా సాగడానికి సహాయపడుతుంది. తాజాగా తయారు చేసిన దాల్చిన చెక్క టీ తాగడం వల్ల..హార్ట్ బర్న్ నివారించడమే కాకుండా.. జీర్ణం తేలికగా అవుతుంది.

English summary

Best DIY Home Remedies For Heartburn

Best DIY Home Remedies For Heartburn. Nowadays, heartburn, aka acid reflux, is an exceedingly common problem that is found among the masses.
Story first published:Friday, June 3, 2016, 17:12 [IST]
Desktop Bottom Promotion