For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేంజర్: బాడీలో అబ్ నార్మల్ బ్లడ్ క్లాట్స్ తో బీకేర్ ఫుల్...!

|

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే , మన శరీరంలోని అన్ని భాగాలకు, అవయవాలకు రక్తప్రసరణతో పాటు, ఆక్సిజన్ మరియు న్యూట్రీషియన్ సప్లై పుష్కలంగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి క్వాలిటీ, క్వాంటిటీ లేదా బ్లడ్ ఫ్లో తగ్గినా...ఆరోగ్యం కష్టంగా మారుతుంది. పెద్ద ప్రమాదంలో పడుతుంది.

వీటిలో ఏఒక్కటి లోపించినా రెగ్యులర్ జీవక్రియలకు అంతరాయం కలగడంతో ాపటు, బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి. ఏలాంటి సురక్షితమైన కారణాలు లేకుండా బ్లడ్ క్లాట్స్ ఏర్పడటం వల్ల లైఫ్ రిస్క్ లో పడుతుంది? ఇటువంటి బ్లడ్ కాట్స్ వల్ల డీప్ వీన్ థ్రోబోయోసిన్ కండీషన్స్ కు దారితీస్తుంది. ఇది ప్రాణానికి ప్రమాదకరంగా మారుతుంది.

ఇలాంటి బ్లడ్ క్లాట్స్ కు కారణాలు అనేక విధాలుగా ఉన్నాయి. వాటిలో ఓబేసిటి, స్మోకింగ్, ప్రెగ్నెన్సీ, క్యాన్సర్, లంగ్ డిసీజ్, హార్ట్ సమ్యలు, ఆర్ధరైటిస్ లేదా కీమోథెరఫీ వంటివి అనేకం ఉన్నాయి.

ప్రాణాంతక DVT(డివిటి)తో తస్మాత్ జాగ్రత్త...

కొన్ని సందర్భాల్లో జెన్యు సంబంధమైనవి కూడా కారణంగా ఇలాంటి వ్యాధి బారిన పడుతుంటారు . కొన్ని సందర్భాల్లో మరింత తీవ్రంగా ఉంటుంది . ఇటువంటి పరిస్థితి ప్రాణహానిక కలిగిస్తుంది . ముఖ్యంగా ఈ బ్లడ్ క్లాట్స్, లంగ్స్ కు చేరితే మరింత డేంజరస్ మారుతుంది. ఇటువంటి వ్యాధి యొక్క లక్షణాలు మనం త్వరగా కూడా గుర్తించలేము. అయితే ముందు జాగ్రత్త కోసం బ్లడ్ క్లాట్స్ లేదా డీప్ వీన్ థ్రోబోసిస్ లక్షణాలు గుర్గించడానికి కొన్ని చిహ్నాలు ఈ క్రింది విధంగా....

నొప్పి:

నొప్పి:

చాలా వరకూ డివిటి సమస్య ఉన్నవారు, బ్లడ్ క్లాట్స్ ఏర్పడి కాలులో నొప్పి చాలా తక్కువగా లేదా మరీ ఎక్కువగా ఉంటుంది . నడిచేటప్పుడు నొప్పి మరింత ఎక్కువ అవ్వొచ్చు.

. స్కిన్ కలర్:

. స్కిన్ కలర్:

బ్లడ్ క్లాట్ అయిన ప్రదేశంలో చర్మం పేల్ బ్లూ లేదా అసాధారణ రంగు కలిగి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఆ ప్రదేశంలో గోకడం, స్క్రబ్ చేయడం లేదా ఇతర గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి.

 జ్వరం:

జ్వరం:

డివిటీతో బాధపడే వారిలో తరచూ జ్వరంతో బాధపడుతుంటారు. ముఖ్యంగా రాత్రుల్లో చెమటలు ఎక్కువగా పట్టడం , జ్వరంగా తరచూ రావడం జరుగుతుంది. ఈ పరిస్థితి అడ్వాస్డ్ స్టేజ్ గా గుర్తించి వెంటనే డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం.

కాలు వాపు:

కాలు వాపు:

కాలు వాపు , క్రమంగా పెరుగుతున్నట్లైతే డివివిటీకి ఒక లక్షణంగా గుర్తించాలి . అంతే కాదు, వాపుతో పాటు, కాలిలో నీరు చేరడం వల్ల కాలు బరువుగా అనిపిస్తుంది . ఇటువంటి పరిస్థితిలో డాక్టర్ ను కలవడం వల్ల కాలు వాపు ఇతర లక్షణాలకు డివిటీ కారణమా లేదా వేరే ఇతర కారణమా అని గుర్తించవచ్చు.

శ్వాసలో ఇబ్బందులు:

శ్వాసలో ఇబ్బందులు:

సాధారణంగా కంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లైతే లంగ్స్ లో క్లాట్ ఉన్నట్లు గుర్తించాలి . లంగ్స్ లో క్లాట్ చేరినట్లైతే వెంటనే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందివ్వాల్సి ఉంటుంది.

దగ్గు:

దగ్గు:

ఎక్కువగా దగ్గడం లేదా దగ్గుతున్నప్పుడు రక్తం పడటం కూడా డివిటీకి సీరియస్ లక్షణంగా తీసుకోవాలి . ఇలాంటి పరిస్థితి గుర్తించినప్పుడు, రోగిలో బ్లడ్ క్లాట్స్ ఊపిరితిత్తులకు చేరినట్లు సీరియస్ కండీషన్ గా గుర్తించాలి.

 బలహీనత:

బలహీనత:

డివిటీ సమస్య ఉన్న వక్తి చాలా బలహీనంగా మారుతారు, నిరంతరం అలసటగా కనిపిస్తారు . కాళ్ళు కదపడానికి కూడా కష్టంగా భావిస్తారు.

చెస్ట్ పెయిన్:

చెస్ట్ పెయిన్:

ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్స్ చేరినప్పుడు చెస్ట్ లో కూడా నొప్పి భరిస్తారు . బ్రీతింగ్ చాలా కష్టంగా మారుతుంది.

 వెచ్చగా ఉంటుంది:

వెచ్చగా ఉంటుంది:

డివీటి ఉన్నవారు , శరీరంలో మిగిలిన బాగంలో కంటే, బ్లడ్ క్లాట్ ఉన్న ప్రదేశం వెచ్చగా అనిపిస్తుంది . ముఖ్యంగా నడిచినప్పుడు నొప్పిగా అనిపిస్తుంది .

English summary

Beware Of Abnormal Blood Clots!

If your body has to stay healthy, your blood needs to reach all parts of the body and supply oxygen and nutrients. When anything goes wrong with the quality, quantity or flow of blood in your body, your health goes for a toss.
Story first published: Monday, April 4, 2016, 16:01 [IST]
Desktop Bottom Promotion