For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ క్యాన్సర్ పేషంట్స్ బ్రిక్ వాక్ చేస్తే మెమరీ పవర్ మెరుగు..: స్టడీ రివీల్స్

By Super Admin
|

ఈ ఆధునిక ప్రపంచంలో క్యాన్సర్ తో పోరాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. వివిధ రకాల క్యాన్సర్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే వారు బ్రిస్క్ వాక్, లేదా జాగింగ్ వంటి శారీరక వ్యాయామాల వల్ల మెమరీ పవర్ ను మెరుగుపరుస్తుందని కొత్తిగా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేశారు.

రోజూ శరీరక వ్యాయామాలు చేయడంవల్ల మానసికంగా దెబ్బతిన్న మహిళల్లో ఒత్తిడిని తగ్గించి, జ్ఝాపకశక్తిని మెరుగుపరుస్తుందని. పరిశోధనలు నిర్ధారించాయి.

క్యాన్సర్ తో బాధపడే వారు ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం వల్ల ఎక్కువగా మెమరీ సమస్యలతో బాధపడుతున్నట్లో పరిశోధనల్లో వెల్లడైంది. ఇటువంటి సమస్యలను కీమోథెరఫీ లేదా రేడియోషన్ ట్రీట్మెంట్స్ సంబంధించినవి కాదని చెప్పవచ్చు.

Brisk Walk Boosts Memory In Breast Cancer Survivors

ఇటువంటి వ్యక్తిగత మానసిక సమస్యలు ఉద్వేగాలకు లోనైనప్పుడు, వచ్చేవని పరిశోధనల్లో నిపుణులు సూచిస్తున్నారు,. క్యాన్సర్ తో బాధపడే మహిళలు, ఎక్కువ ఒత్తిడికి , అలసట, ఆందోళన, భావోద్వేగాలకు గురవ్వడం మరియు నమ్మకం కోల్పోవడం, వంటివి మానసికంగా మరింత క్రుంగదీస్తాయి . దాంతో మెమరీ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని’’ నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటి ఫర్బిగెన్ స్కూల్ ఆఫ్ మెడిస్ లోని అసిస్టెంట్ ప్రొఫసర్ సోయ్బాన్ ఫిలిప్స్ సూచిస్తున్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే వారి మెమరీ మరియు వ్యాయామాల మీద జరిపిన రెండు పరిశోధనల్లో వ్యక్తిగతంగా 1477 మహిళలు, మరో యాక్సలెరోమీటర్ ధరించిన వారిలో 362 మంది ఉన్నారు.

ఈ రెండు గ్రూపుల వారిలో ఎక్కువగా ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీలో చురుకుగా ఉన్నారో , వారిలో మెమరీ పవర్ మెరుగుపడుతున్నట్లు గమనించారు.

ఈపరిశోధనల్లో , ఎవరైతే ఎక్కువగా శారీరక వ్యాయామాలు చేస్తుంటారో, అలాంటి వారిలో ఎక్కువగా స్థాయి నమ్మకం ఉన్నట్లు గుర్తించారు, ఇటువంటి వారిలో ఒత్తిడి చాలా తక్కువ , అలసటగా ఉండరు, దాంతో జ్ఝాపకశక్తి తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయ.

బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే వారు, ఎవరైతే ఆధునిక జీవనవిధానానికి అలవాటు పడిన వారిని రెండు గ్రూపులుగా చేసి, వారి మీద జరిపిన పరిశోధనల్లో ఒక గ్రూమ్ వారు బ్రిస్క్ వాక్, నడ, బైకింగ్, జాగింగ్, లేదా జిమ్ లకు వెళ్ళడం వంటి చేయవడం వల్ల మెమరీ సమస్యల చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

English summary

Brisk Walk Boosts Memory In Breast Cancer Survivors: Study Reveals

Moderate-to-vigorous physical activities such as brisk walking or jogging may help improve memory in breast cancer survivors, a new study suggests.
Story first published:Monday, July 18, 2016, 9:38 [IST]
Desktop Bottom Promotion