For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటచేసే సమయంలో చెయ్యి కాలిందా? ఇవిగో ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!!

స్కిన్ బర్న్ లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. వాటిలో మొదటిది కాలిన గాయలు, ఇవి చాలా చిన్నగాయాలు. దీనివల్ల చర్మం బాహ్య చర్మపు పొర వాపు కలిగి ఉంటుంది. స్కిన్ బర్న్ తర్వాత గాయం మానడానికి, నొప్పి, మంట నుండి

|

సాధారణంగా స్కిన్ బర్న్ అనేది కఠినమైన సూర్యకిరణాల వల్ల, వేడి మరియు మంటల వల్ల స్కిన్ బర్న్ అవుతుంది. ఈ స్కిన్ బర్న్ చాలా పెద్దివి కావావచ్చు మరియు చిన్నవి కావచ్చు. కాలిన చర్మం వాపు మరియు చర్మం ఎర్రగా మారడం, చర్మ కణజాలాలను నాశనం చేయడం జరుగుతుంది . స్కిన్ బర్న్ అయితే, అందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాధం ఉంది.

Burnt Your Hand While Cooking? These Home Remedies Give You Instant Relief

స్కిన్ బర్న్ లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. వాటిలో మొదటిది కాలిన గాయలు, ఇవి చాలా చిన్నగాయాలు. దీనివల్ల చర్మం బాహ్య చర్మపు పొర వాపు కలిగి ఉంటుంది. స్కిన్ బర్న్ తర్వాత గాయం మానడానికి, నొప్పి, మంట నుండి ఉపశమనం పొందడానికి కొన్ని హోం మేడ్ రెమడీస్ ఉపయోగపడుతాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా ఎఫెక్టివ్ గా గాయాలను మాన్పుతాయి. ఇక ఇతర రెండూ సెకండ్ డిగ్రీ బర్న్ మరియు థర్డ్ డిగ్రీ బర్స్ ఈ రెండూ కూడా తీవ్రమైన కణజాల నష్టం కలిగిస్తుంది. ఈ రెండు స్థాయిల్లో కాలిన గాయాలను మాన్పుకోవడానికి నిశ్నాతులైన వైద్యుడుతో చికిత్స చేయించుకోవడం మంచిది.

ఈ వ్యాసం లో మేము మొదటి డిగ్రీలో కాలిన గాయాలను మాన్పుకోవడానికి, మంట, వాపులను తగ్గించుకోవడానికి కొన్ని నివారణలు తెలపడం జరిగింది. వీటిని ఉపయోగించి స్కిన్ బర్న్ ను ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. మరి ఆ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

 అలోవెర:

అలోవెర:

కలబందలో ఉండే acemannen కంటెంట్ చర్మం మంట నయం చేసే శక్తి ని కలిగి ఉంటుంది. ఇది స్కిన్ బర్న్ ను చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. కాలిన గాయాల మీద అలొవెరా జెల్ ను డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మరియు కాలిన గాయాలాను చాలా త్వరగా మాన్పుతుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. బాగా కాలిన గాయాల మీద అలోవెరా జెల్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి స్కార్స్ ఏర్పడవు.

పొటాటో:

పొటాటో:

బంగాళాదుంపలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలిన మచ్చలను లైట్ గా మార్చేస్తాయి. బంగాళాదుంపను కొన్ని ముక్కలుగా కట్ చేసి.. కాలిన చర్మంపై రబ్ చేయాలి. క్లాక్ వైట్, యాంటీ క్లాక్ వైజ్ రుద్దాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి.

లావెండర్ ఆయిల్:

లావెండర్ ఆయిల్:

పలచగా ఉండే ల్యావెండర్ ఆయిల్ కూడా కాలిన గాయాలను నయం చేయడంతో పాటు నొప్పిని నివారిస్తుంది. అలోవెరా జెల్, విటమిన్ సి, లావెండ్ ఆయిల్ మరియు విటమిన్ ఇ యొక్క కాంబినేషన్ లో ఒక ఉత్తమ పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని కాలిన గాయాలకు రోజంతా అప్పుడప్పుడు రాస్తుండాలి. ఇది స్కిన్ బర్న్ మరియు వాపును, మరియు నొప్పిని తగ్గిస్తుంది మరియు చర్మం మంటను కూడా త్తగిస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరినూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటం వల్ల.. గాయమైన స్కిన్ టిష్యూస్ ని నయం చేస్తుంది. అలాగే కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని.. మసాజ్ చేయాలి. అందులోని పోషకాలను చర్మం గ్రహిస్తుంది. ఇలా రోజుకి రెండు, మూడు సార్లు చేస్తే.. బర్న్ మార్క్స్ తొలగిపోతాయి.

తేనె:

తేనె:

ఇది కాలిన గాయాలకు చాలా సాధారణంగా ఉపయోగించే ఒక సహజ రెమడీ, కాలిన గాయాల మీద తేనెను రాయడం వల్ల స్కార్స్ చాలా తక్కువగా ఏర్పడుతాయి. తాజాగా తీసిన తేనెల యాంటిసెప్టిక్ మరియు మంటను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నందున తాజా తేనెను ఉపయోగించండి.

 కోల్డ్ వాష్:

కోల్డ్ వాష్:

చర్మం మీద కాలిన గాయాల మీద వెంటనే చల్లని నీరు పోయడం లేదా ఐస్ క్యూబ్ లను పెట్టడం కానీ చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ బర్న్ అయిన చోట నొప్పి తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఈ చిట్కా తాత్కాలిక పరిష్కారం మాత్రమే. మరియు స్కిన్ బర్న్ అయిన వెంటనే మొదటి చేయాల్సిన చిట్కా ఇది.

టీ బ్యాగ్స్:

టీ బ్యాగ్స్:

టీ బ్యాగ్ చర్మాన్ని టైట్ గా మార్చి, డ్యామేజ్ అయిన చర్మకణాలను తొలగిస్తుంది. మచ్చలను తొలగిస్తుంది. బ్లాక్ టీ బ్యాగ్ తీసుకుని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత కాలిన చర్మంపై పెట్టాలి. చర్మం వెచ్చగా అయిన తర్వాత.. తీసేయాలి. ఇలా.. రోజుకి రెండు మూడు సార్లు చేయాలి.

వెనిగర్:

వెనిగర్:

కాలిన గాయలకు ద్రవంలా ఉండే ఈ పదార్థము ను అప్లై చేయడం వల్ల గాయాలకు మంచి ఉపశమనానికి మరియు చల్లని అనుభూతి ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుంది . వెగినగార్ ను ఉపయోగించే ముందు నీటిలో కొద్దిగా వేసి మిక్స్ చేసి అప్లై చేయాలి. మద్యమద్యలో లేదా తరచూ వెనిగార్ ను కాలిన గాయాల మీద అప్లై చేస్తుండటం వల్ల బర్నింగ్ నొప్పిని మరియు వాపును తగ్గిస్తుంది.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడాలో ఉండే సోడియం బైకార్బొనేట్ డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కావాల్సినన్ని నీటిలో కలపాలి. పేస్ట్ చేసుకుని.. చర్మంపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చేయాలి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ను కాలిన గాయాల మీద అప్లై చేయడం వల్ల నొప్పి, మంట నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ఆనియన్ జ్యూస్:

ఆనియన్ జ్యూస్:

ఉల్లిపాయలో సల్ఫర్ ఉండటం వల్ల.. కాలిన మచ్చలను తొలగిస్తుంది. ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసం తీయాలి. కాటన్ బాల్ ఉపయోగించి.. చర్మంపై రాసుకోవాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి.

అరటి తొక్క:

అరటి తొక్క:

ఇది కాలిన చర్మ గాయాలను నయం చేడంలో, మంట మరియు వాపు వంటివాటిని ఉపశమనం కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. ఇది చర్మానికి rejuvenates చేస్తుంది మరియు మంట నొప్పి తగ్గిస్తుంది . అరటి తొక్కను కాలిన గాయాలకు మీద పూర్తిగా అప్లై చేయవచ్చు. అరటి తొక్క మరియు పెరుగు రెండింటి కాంబినేషన్ లో అప్లై చేయడం వల్ల స్కిన్ బర్న్ కు మంచి ఉపయోగకరంగా ఉంటుంది.

English summary

Burnt Your Hand While Cooking? These Home Remedies Give You Instant Relief

Burnt Your Hand While Cooking? These Home Remedies Give You Instant Relief,Burnt your hand while you were cooking in the kitchen? The hot pan which was on the stove just touched your fingers, aah, and there you are left with a minor burn. I believe this is something which almost every one of us has experience
Story first published: Thursday, December 8, 2016, 18:33 [IST]
Desktop Bottom Promotion