For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎసిడిటీ సమస్యకు కారణాలేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి ?

పొట్టలో చాలా మంటగా లేదా నొప్పిగా అనిపిస్తోందా ? అయితే మీరు ఖచ్చితంగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నట్టే. అలాంటి ఎసిడిటీని నివారించాలంటే.. మీరందరూ.. దానికి అసలు కారణాల గురించి తెలుసుకోవాలి.

By Swathi
|

పొట్టలో చాలా మంటగా లేదా నొప్పిగా అనిపిస్తోందా ? అయితే మీరు ఖచ్చితంగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నట్టే. అలాంటి ఎసిడిటీని నివారించాలంటే.. మీరందరూ.. దానికి అసలు కారణాల గురించి తెలుసుకోవాలి.

acidity

సాధారణంగా శరీరంలో ఉండే యాసిడ్స్.. మనం తీసుకున్న ఆహారాన్ని ముక్కలుగా చేసి.. జీర్ణక్రియ మెరుగ్గా సాగడానికి సహాయపడతాయి. కానీ ఎప్పుడైతే శరీరం అదనంగా ఎసిడిటీని ఉత్పత్తి చేస్తుందో.. అప్పుడు ఎసిడిటీ సమస్య వస్తుంది. దీనివల్ల త్రేన్పులు ఇబ్బందిపెడతాయి. అలాగే పొట్టలో నొప్పి ఉంటుంది. ఇది రానురాను ఛాతీలో మంటకు దారితీస్తుంది.

చాలా మంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు. కానీ సరైన సమయంలో దీనిపై శ్రద్ద తీసుకోకపోతే.. స్టమక్ అల్సర్ లేదా క్యాన్సర్ కి కారణమవుతుంది. కాబట్టి.. ఎసిడిటీ లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలి.

ఎసిడిటీకి మనం తీసుకునే ఆహారాలు, మనకున్న అలవాట్లు డైరెక్ట్ కారణమవుతాయి. ఎసిడిటీకి కారణమయ్యేవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆల్కహాల్

ఆల్కహాల్

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల.. స్టమక్ లైనింగ్ డ్యామేజ్ కి కారణమవుతుంది. దీనివల్ల ఆసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది తర్వాత డీహైడ్రేసన్ కి కారణమవుతుంది మరియు గ్యాస్ట్రోంటెస్టినల్ ట్రాక్ ని డ్యామేజ్ చేస్తుంది.

జంక్ ఫుడ్స్

జంక్ ఫుడ్స్

జంక్ ఫుడ్స్ లో స్పైసీ, ఆయిల్ ఎక్కువ ఉంటాయి. ఇవి స్టమక్ లైనింగ్ పై దుష్ర్పభావం చూపుతాయి. అలా ఎసిడిటీ సమస్య వస్తుంది. దీనివల్ల త్రేన్పులు వచ్చి.. పొట్టలో నొప్పికి కారణమవుతుంది.

అతిగా తినడం

అతిగా తినడం

ఎప్పుడైతే పొట్ట ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని ఒకేసారి తీసుకుంటుందో.. అప్పుడు యాసిడ్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీనివల్ల ఎసిడిటీ, జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి.. తక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల.. సరైన విధంగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది.

ఒత్తిడి

ఒత్తిడి

ఒక వ్యక్తి చాలా ఒత్తిడికి గురైనప్పుడు.. ఎక్కువగా తింటారు. దీనివల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. అలాగే చాలా ఎక్కువ ఒత్తిడికి గురైతే.. స్ట్రెస్ హార్మోన్స్ విడుదలై.. జీర్ణక్రియ సమస్యను తీసుకొస్తాయి.

స్మోకింగ్

స్మోకింగ్

స్మోకింగ్ చేసేవాళ్లలో ఎసిడిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. సిగరెట్ లో ఉండే నికోటిన్ కంటెంట్ పొట్టలో దుష్ర్పభావం చూపుతుంది. అలాగే అదనపు యాసిడ్ ఉత్పత్తికి కారణమవుతుంది.

తక్కువగా నీళ్లు తాగడం

తక్కువగా నీళ్లు తాగడం

శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగకపోతే.. శరీరం డీహైడ్రేట్ అయి.. ఎసిడిటీకి కారణమవుతుంది. కాబట్టి.. రోజుకి కనీసం 8గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల అదనపు యాసిడ్ ఉత్పత్తికి కారణమవుతుంది.

కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్స్

కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్స్

కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది పొట్టలో దుష్ర్పభావం చూపుతుంది. అలాగే యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి ఎక్కువగా కాఫీలు, సాఫ్ట్ డ్రింక్స్ తాగకుండా దూరంగా ఉంటే.. ఎసిడిటీని నివారించవచ్చు.

మెడిసిన్స్

మెడిసిన్స్

ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్.. పొట్టలో ఎక్కువ యాసిడ్ ఉత్పత్తికి కారణమవుతాయి. దీనివల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. అలాగే జీర్ణక్రియపై కూడా దుష్ర్పభావం చూపుతాయి.

English summary

Common Causes Of Acidity You Need To Know!

Common Causes Of Acidity You Need To Know! Acidity is one of the worst conditions that one can suffer from. There are several factors that lead to acidity.
Story first published: Thursday, November 3, 2016, 15:37 [IST]
Desktop Bottom Promotion