For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికున్ గున్యా లక్షణాలేంటి ? ఖచ్చితంగా తీసుకోవాల్సిన డైట్ ఏంటి ?

చికున్ గున్యా లక్షణాలు, నివారించే ఆహరాలు..!!

By Swathi
|

చికున్ గున్యా..!! ప్రస్తుతం అందరినీ హడలెత్తిస్తున్న జ్వరం. ఇది వచ్చిందంటే.. కాళ్లు, చేతులు, ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు వేధిస్తాయి. అందుకే చికున్ గున్యా రాకముందే జాగ్రత్త వహించాలి. ప్రస్తుతం దేశ రాజధానిలో చికున్ గున్యా బారిన పడి.. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా ప్రభలకుండా.. జాగ్రత్తపడటం చాలా అవసరం.

చికున్ గున్యా.. దోమ కాటు ద్వారా వస్తుంది. అయితే దోమకుట్టిన 3 నుంచి 7 రోజుల మధ్య.. చికున్ గున్యా లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం వల్ల జ్వరం మరింత ఎక్కువ కాకుండా అరికట్టవచ్చు. అలాగే ప్రాణాలను కాపాడుకోవచ్చు.

కీళ్లు, కండరాల నొప్పులు

కీళ్లు, కండరాల నొప్పులు

డెంగ్యూతో బాధపడేటప్పుడు కూడా.. కండరాల నొప్పి ఉంటుంది. అయితే చికున్ గున్యా వచ్చినప్పుడు కీళ్ల నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా కాళ్లు, చేతుల కీళ్లు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కీళ్లలో వాపు కూడా వస్తుంది. ఈ కీళ్ల నొప్పు కొన్ని వారాల నుంచి ఏడాది వరకు ఉంటాయి.

తలనొప్పి

తలనొప్పి

చికున్ గున్యా లక్షణాల్లో చాలా తీవ్రమైన తలనొప్పి కూడా ఉంటుంది. వైరస్ సోకిన మొదటి రోజుల్లో తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాగే హై ఫీవర్, జాయింట్ పెయిన్స్ రెండ్రోజుల కంటే ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

లింఫ్ నోడ్స్

లింఫ్ నోడ్స్

లింఫ్ నోడ్స్ అంటే శోషరస గ్రంథులు. ఇవి వాపుకి గురి అవడం చికున్ గున్యా లక్షణం. ఈ లింఫ్ నోడ్స్ మెడ పక్కన లేదా చెవులకు పక్కన లేదా దవడ కింద ఉంటాయి. ఇక్కడ వాపు కనిపించిందంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

తీవ్ర అలసట

తీవ్ర అలసట

చాలా తీవ్రమైన అలసటకు గురవుతున్నారంటే.. అతి ఖచ్చితంగా చికున్ గున్యా లక్షణం అయి ఉండవచ్చు. హై ఫీవర్, జాయింట్ పెయిన్స్ తోపాటు అలసటకు గురవుతున్నారంటే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించి చికున్ గున్యా టెస్ట్ చేయించుకోవాలి.

స్కిన్ ర్యాషెస్

స్కిన్ ర్యాషెస్

కొన్ని సందర్భాల్లో స్కిన్ ర్యాషెస్ మొదలవుతాయి. హై ఫీవర్ వచ్చినప్పుడు ఈ ర్యాషెస్ కనిపిస్తుంటాయి. ఎర్రగా, చిన్న చిన్న గాయాలు మాదిరిగా చర్మంపై కనిపించడం, అరచేతిలో, ముఖంపై ర్యాషెస్ కనిపించాయంటే.. డాక్టర్ ని సంప్రదించాలి.

వాంతులు, వికారం

వాంతులు, వికారం

వాంతులు, వికారం, విపరీతమైన వీక్ నెస్, ఆకలి తగ్గిపోవడం కూడా.. చికున్ గున్యాకి సంకేతం కావచ్చు. ఒకవేళ హై ఫీవర్, జాయింట్ పెయిన్ తో పాటు.. వాంతులు ఉంటే.. వెంటనే చికున్ గున్యా టెస్ట్ చేయించుకోవాలి.

తీవ్ర జ్వరం

తీవ్ర జ్వరం

చికున్ గున్యా కారణంగా.. శరీర ఉష్ణోగ్రత 102 నుంచి 104 డిగ్రీలకు చేరుతుంది. ఒక వేళ హై ఫీవర్ ఉంటే.. మూడురోజుల్లోపే డాక్టర్ ని సంప్రదించి.. చికున్ గున్యా టెస్ట్ చేయించుకోవాలి.

ఫ్లూయిడ్స్

ఫ్లూయిడ్స్

చికున్ గున్యాతో బాధపడుతున్నప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు తాగలేకపోతే.. సూప్స్, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటివి తీసుకోవాలి. భోజనానికి కూడా లిక్విడ్స్ తీసుకోవడం మంచిది.

చల్లటివి వద్దు

చల్లటివి వద్దు

జ్వరం కారణంగా.. పుల్లటి పదార్థాలు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి అనిపించదు. ఒకవేళ కీళ్ల నొప్పులు మరీ ఎక్కువగా ఉంటే.. పుల్లటివి తీసుకోకపోవడమే మంచిది. చల్లటివి కూడా తీసుకోకూడదు. కేవలం వెచ్చని ఆహారాలే తీసుకోవాలి.

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎముకల బలాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తాయి. కాబట్టి.. చికున్ గున్యాతో బాధపడేవాళ్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలి.

లీఫీ వెజిటబుల్స్

లీఫీ వెజిటబుల్స్

పాలకూర, మెంతి వంటి ఆకుకూరలను డైట్ లో చేర్చుకోవడం వల్ల చికున్ గున్యాని వేగంగా నయం చేయవచ్చు. వెజిటబుల్స్ లో రకరకాల విటమిన్స్, మినరల్స్ మాత్రమే కాకుండా.. ఫైబర్ కూడా ఉంటుంది.

విటమిన్ సి ఫుడ్స్

విటమిన్ సి ఫుడ్స్

యాపిల్స్, అరటిపండ్లు తేలికగా డైజెస్ట్ అవడమే కాకుండా.. ఆకలిని పెంచుతాయి. అలాగే విటమిన్ సి ఉండే ఆహారాలైన జామ, కివి, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఇమ్యునిటీ పెంచుతాయి. చికున్ గున్యాతో పోరాడతాయి.

English summary

Common signs and symptoms of chikungunya and diet tips

common signs and symptoms of chikungunya and diet tips. Chikungunya is a mosquito-borne infection which is caused by the same species of mosquito which transmits the virus of Zika and dengue.
Desktop Bottom Promotion