For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి దుర్వాసనకు అసలు కారణమేంటో తెలుసా ?

By Swathi
|

నోటి దుర్వాసన అనేది చాలామందిని వేధించే సమస్య. నోటి దుర్వాసన సమస్య ఉందంటే నలుగురిలో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు.. బెస్ట్ ఫ్రెండ్ దగ్గర కూడా ప్రీగా మాట్లాడలేరు. ఇక కొన్ని సందర్భాల్లో ఎదుటివాళ్లు నోటి దుర్వాసన గురించి చెబితే.. మరింత ఇబ్బందికరంగా ఉంటుంది.

నోటి నుంచి దుర్వాసన ముఖ్యంగా మాట్లాడేటప్పుడు వస్తుంది. అలాగే.. చాలాసేపటి తర్వాత నోరు తెరిచినప్పుడు కొంతమందికి నోటి దుర్వాసన వస్తుంటుంది. నోరు పరిశుభ్రంగా లేదని తెలపడానికి కూడా ఇది ఒక సంకేతంగా చెప్పవచ్చు. ఇలాంటి లక్షణం గుర్తించిన వెంటనే.. అలర్ట్ అవడం మంచిది.

మీకు తెలుసా ? నోటి దుర్వాసన అనారోగ్యానికి కూడా సంకేతం. కారణమేదైనా.. బ్యాడ్ బ్రీత్ కి వస్తోందంటే.. వెంటనే అలర్ట్ అవ్వాలి. వెంటనే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సరైన నోటి పరిశుభ్రత పాటించకపోతే.. ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

రోజుకి రెండు సార్లు బ్రష్ చేయకపోవడం, క్యావిటీస్ ట్రీట్ చేయకపోవడం, మంచి మౌత్ వాష్ ఉపయోగించకపోవడం.. ఇలాంటి అలవాట్లన్నీ.. బ్యాడ్ బ్రీత్ కి కారణమవుతాయి. కాబట్టి.. ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే.. మరికొన్ని కారణాలు కూడా.. నోటి దుర్వాసనకు కారణమవుతాయి.

Did You Know These Surprising Causes For Bad Breath

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం
బ్రేక్ ఫాస్ట్ తినకపోతే.. నోట్లోని సాలివా గ్లాండ్స్ యాక్టివ్ గా ఉండవని.. అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల నోరు డ్రైగా మారుతుంది. ఎప్పుడైతే నోరు పొడిగా మారుతుందో అప్పుడు.. చెడు వాసన వస్తుంది. క్రిములు నోట్లో ఉండిపోతాయి. కాబట్టి.. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ని ఉదయం తీసుకోవడం మరచిపోకండి.

Did You Know These Surprising Causes For Bad Breath

పంటి శుభ్రత
చాలా సార్లు మనం బ్రష్ చేస్తాం. మౌత వాష్ ఉపయోగిస్తాం. కానీ.. పళ్లలో ఇరుక్కున్న పాచి తొలగించడం మాత్రం మరచిపోతూ ఉంటాం. అనేక ఆహార పదార్థాలు, పాచి పళ్ల మధ్య పేరుకుని, బ్యాక్టీరియా ఏర్పడటానికి కారణమవుతుంది. దీనివల్ల నోటి దుర్వాసన ఎక్కువ అవుతుంది. బ్రష్ చేయడం వల్ల.. పళ్ల మధ్య ఉండే సన్నటి రంధ్రంలో ఇరుక్కున్న బ్యాక్టీరియా తొలగించలేం. కాబట్టి.. రెగ్యులర్ గా ఫ్లాసింగ్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసనను నివారించవచ్చు.

Did You Know These Surprising Causes For Bad Breath

ఎక్కువ ప్రొటీన్ ఫుడ్ తినడం
ఎక్కువగా రిచ్ ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం, ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కండరాలకు మంచిది. అలాగే.. మోతాదుకి మించితే.. నోటి దుర్వాసనకు కూడా కారణమవుతుంది. కాబట్టి.. ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ ని తగిన మోతాదులో తీసుకోవాలి. బ్యాడ్ బ్రీత్ ఉన్నవాళ్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

English summary

Did You Know These Surprising Causes For Bad Breath?

Did You Know These Surprising Causes For Bad Breath? Here are some little known causes for bad breath that you might want to know, have a look!
Story first published:Tuesday, June 21, 2016, 16:57 [IST]
Desktop Bottom Promotion