For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫస్ట్ నైట్ ఇచ్చే పాలల్లో ఈ పదార్థాలు చేర్చడం వెనక సీక్రెట్స్..!!

By Swathi
|

హిందూ వివాహాల్లో పాటించే ప్రతి పద్ధతి, సంప్రదాయంలో.. అద్భుతమైన ప్రయోజనాలు దాగుంటాయి. కొన్ని సంప్రదాయ పద్ధతుల ద్వారా అమ్మాయి, అబ్బాయి మధ్య మూడుముళ్ల బంధం ఏర్పడుతుంది. పెళ్లి తర్వాత.. వీల్లిద్దరూ.. కలకాలం కలిసి ఉండాలనేది హిందూమతం చెబుతుంది.

పెళ్లితో.. ఈ సంప్రదాయం అయితే.. పెళ్లి తర్వాత.. ఫస్ట్ నైట్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఫంక్షన్ నిర్వహించడానికి సమయం, రోజు అన్ని చూసి.. మంచి రోజు నిర్ణయిస్తారు. మొదటిరాత్రికి అమ్మాయి, తన భర్తకు ఒక గ్లాసు స్పైస్ మిల్క్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే కొన్ని ప్రాంతాల్లో ప్లెయిన్ మిల్క్ ఇస్తారు. కానీ.. పాలల్లో కొన్ని దినుసులు కలపడం వల్ల.. లిబిడో పెరుగుతుంది, వాళ్ల శారీరక సంబంధం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా స్పైసీ మిల్క్ అంటే.. కుంకుమపువ్వు, పసుపు, పంచదార, మిరియాలు, బాదాం, సోంపును వెచ్చటి పాలలో మిక్స్ చేస్తారు. మరి ఈ స్పైసెస్ నే.. ఫస్ట్ నైట్ మిల్క్ లో చేర్చడం వెనక సీక్రెట్ ఏంటి..??

మిరియాలు

మిరియాలు

మిరియాలు, బాదాంను పాలలో కలిపి ఉడికించినప్పుడు.. కొన్ని కెమికల్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. అవి.. లిబిడో స్థాయిని బాగా పెంచుతాయి. అలాగే.. ఎక్కువ సమయం..స్కలనం అవకుండా..సహాయపడతాయి.

పాలు

పాలు

వేడిగా ఉండే పాలల్లో ఆఫ్రోడిసియాక్స్ ఉంటాయి. ఇవి లిబిడోని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.

రిలాక్స్ అవడానికి, హ్యాపీగా ఉండటానికి

రిలాక్స్ అవడానికి, హ్యాపీగా ఉండటానికి

ఒకప్పుడు.. పెళ్లికి ముందు, మొదటిరాత్రికి ముందు.. ఒకరినొకరు ఎప్పుడూ కలిసేవాళ్లు కాదు. దీనివల్ల ఫస్ట్ టైం మొదటిరాత్రి రోజు కలిసినప్పుడు భయం, ఆందోళన ఉంటాయని.. పాలు తాగడం వల్ల.. కాస్త సౌకర్యంగా ఉంటుందని మొదటిరాత్రికి పాలు ఇచ్చే సంప్రదాయం వచ్చింది.

కుంకుమ పువ్వు, సోంఫు

కుంకుమ పువ్వు, సోంఫు

కుంకుమ పువ్వు, సోంఫును పాలల్లో ఉడికించడం ద్వారా.. రిలాక్సేషన్ ని ఇస్తుంది. అంతేకాకుండా.. కుంకుమ పువ్వు, సోంఫు నుంచి వచ్చే సువాసన.. ఎండోర్ఫిన్స్ లేదా హ్యాపీ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. దీనివల్ల ఇవి.. హ్యాపీగా ఫీలవడానికి సహాయపడతాయి.

పంచదార

పంచదార

అన్ని పోషకాలతో పాటు పంచదారను కలపడం వల్ల.. త్వరగా ఎనర్జీ వస్తుంది. అంటే.. పెళ్లి వేడుకలు, సంప్రదాయాలలో అలసిపోయిన జంట ఈ పాలను తీసుకోవడం వల్ల వెంటనే.. ఎనర్జీ అంది.. ఫస్ట్ నైట్ లో ఎనర్జిటిక్ గా, ఫన్నీగా ఉంటారు. ఎంజాయ్ చేస్తారు.

పసుపు

పసుపు

పసుపు, మిరియాలు, సోంపు.. వీటన్నింటిలో.. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇమ్యునిటీని పెంచుతాయి. మొదటిసారి సెక్స్ చేయబోతున్న వ్యక్తి ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా.. ఇవి ఇమ్యునిటీని పెంచుతాయి.

సామీప్యత పెంచడానికి

సామీప్యత పెంచడానికి

అమ్మాయి ఒక గ్లాసు పాలు ఇవ్వడం ద్వారా అందులోని పోషకాలు.. ఆమె చేతి స్పర్శ అతనిలో సామీప్యతను పెంచడానికి సహాయపడతాయి. ఒక గ్లాసు పాలను ఇద్దరూ పంచుకోవడం వల్ల.. చాలా సౌకర్యవంతంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా.. ఇద్దరు దగ్గరవడానికి సహాయపడుతుంది.

English summary

Does the ‘glass of spice milk’ on the first night help increase libido?

Does the ‘glass of spice milk’ on the first night help increase libido? Here are 5 reasons the tradition came into existence and why you should probably give it a shot.
Desktop Bottom Promotion