For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : హెడ్ ఫోన్స్ ఎక్కువ సమయం పెట్టుకుంటే కలిగే దుష్ప్రభావాలు.!

By Super Admin
|

టెక్నాలజీ మన జీవితాలను సులభతరం మరియు సౌకర్యవంతంగా తయారుచేసింది. అంతేకాక అది మనల్ని బానిసను కూడా చేసింది. అలాగే అది ఒక ఉచ్చు వంటిది.

మానవుల యొక్క స్వభావం కంఫర్ట్ ని ప్రేమించే విధంగా ఉంటుంది. అలాగే ఆనందాన్ని పంచటం మరియు విశ్వసనీయ స్నేహితుడుగా ఉంటుంది. సాంకేతికత ఎంత సాయం చేస్తుందో అంతే హాని కూడా చేస్తుంది. సాంకేతికత అంటే కత్తికి రెండు వైపుల పదును ఉందని చెప్పవచ్చు.

సాంకేతికత పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాటిలో ముఖ్యంగా హెడ్ ఫోన్స్ గురించి చెప్పుకోవాలి. ఈ రోజుల్లో సంగీతంను హెచ్చు స్థాయిలో పెట్టుకొని వినటం అలవాటుగా మారింది. టెక్నాలజీ పురోగతికి ధన్యవాదాలు. అయితే సాంకేతికత కారణంగా మన ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశాలు కూడా పెరిగాయి.

సుదీర్ఘ కాలం పాటు హెచ్చు స్థాయిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని సంగీతాన్ని వింటే మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.

ఇక్కడ ఎక్కువ సేపు హెడ్ ఫోన్స్ పెట్టుకోవటం వలన కలిగే హానికరమైన ప్రభావాలు ఉన్నాయి. ఆ ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం.

Don’t Wear The Headphones

వినికిడి నష్టం
మీరు మంచి బీట్స్ ఆస్వాదించడానికి హెడ్ ఫోన్స్ ఉపయోగించినప్పుడు ప్రత్యక్షంగా ఆడియో మీ చెవుల మీద ప్రభావం చూపుతుంది. 90 డెసిబెల్ల వాల్యూమ్ ఉంటే కనుక తీవ్రమైన వినికిడి సమస్యలు మరియు నష్టం ఉంటాయి. కాబట్టి హెడ్ ఫోన్స్ ఉపయోగించేటప్పుడు విరామాలు ఇస్తూ ఒక మోస్తరు పరిమాణంతో సంగీతాన్ని వినాలి. అప్పుడు వినికిడి సమస్య రాకుండా ఉంటుంది.

Don’t Wear The Headphones

గాలి మార్గం బ్లాకింగ్
హై-నాణ్యత సంగీతంను విని ఆనందించటానికి హెడ్ ఫోన్స్ ని చెవి లోపలకు పెట్టవలసి ఉంటుంది. ఇది మీకు ఒక రాకింగ్ అనుభవంగా ఉండవచ్చు. కానీ దీని కారణంగా గాలి మార్గం బ్లాకింగ్ అయ్యి చెవికి ఇన్ ఫెక్షన్ వచ్చి హాని కలుగుతుంది. హెడ్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించటం వలన గులిమి ఎక్కువగా ఏర్పడి చెవి హోరుకు కారణం కావచ్చు.

Don’t Wear The Headphones

చెవిలో ఇన్ఫెక్షన్
హెడ్ ఫోన్స్ ఉపయోగించటంలో గోప్యత పాటించాలి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండుట వలన హెడ్ ఫోన్స్ ఒకరు వాడినవి మరొకరు వాడకూడదు. హెడ్ ఫోన్స్ ఒకరు వాడినవి మీరు ఉపయోగించాల్సి వస్తే వాటిని శుభ్రపరచాలి.

Don’t Wear The Headphones

చెవులలో తిమ్మిరి
అధిక సౌండ్ తో మ్యూజిక్ వింటే చెవులకు తిమ్మిరి వస్తుంది. వినికిడి సామర్థ్యాలు తాత్కాలికంగా తగ్గిపోతాయి. అదే సుదీర్ఘ కాలం పాటు కొనసాగినట్లయితే శాశ్వత వినికిడి సమస్యలకు దారితీస్తుంది.

Don’t Wear The Headphones

చెవి నొప్పి
హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎక్కువ సౌండ్ తో సంగీతాన్ని వింటే చెవి నొప్పి వస్తుంది.

Don’t Wear The Headphones

మెదడుకు అపాయం
హెడ్ ఫోన్లు ఉత్పత్తి చేసే విద్యుదయస్కాంత తరంగాలు దీర్ఘకాలంలో మెదడు సమస్యలకు కారణం కావచ్చు. ఎందుకంటే లోపలి చెవి మెదడుతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ భాగంలో నష్టం లేదా ఇన్ఫెక్షన్ కలిగి మెదడు మీద ప్రభావం చూపవచ్చు.

Don’t Wear The Headphones

బాహ్య ముప్పు
హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన రియాలిటీ సంబంధం మరియు ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు వాకింగ్ లేదా బయట జాగింగ్ చేసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే బయట సౌండ్స్ వినబడవు. దాంతో అది ప్రమాదాలకు కారణం అవుతుంది.

Don’t Wear The Headphones

హెడ్ ఫోన్స్ ను మెరుగైన పద్దతిలో ఎలా ఉపయోగించాలి

ఈ కింది ఉన్న చిట్కాలు మీ ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపకుండా హెడ్ ఫోన్స్ ఉపయోగించటానికి సహాయపడతాయి.

60:60 నియమాన్ని పాటించండి. గరిష్ట వాల్యూమ్ 60 శాతం ఉండేలా చూసుకోవటం మరియు 60 నిమిషాల కన్నా ఎక్కువ సేపు హెడ్ ఫోన్స్ పెట్టుకోకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేస్తే మీ చెవులకు ఎటువంటి నష్టం జరగదు.

మీ చెవి లోపల ప్రత్యక్ష టచ్ లో ఉండే హెడ్ ఫోన్లు వాడకూడదు. మీ చెవులకు బయట ఉండే విధంగా పెద్ద వాటిని ఉపయోగించాలి.

మీ హెడ్ ఫోన్స్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. మీ చెవుల చర్మం మీద చెమట మరియు బ్యాక్టీరియా చేరడం వలన ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మీరు హెడ్ ఫోన్స్ మార్పిడి చేయకుండా ఉంటేనే మంచిది.

మీరు హెడ్ ఫోన్స్ ని రెగ్యులర్ గా ఉపయోగిస్తూ ఉంటే కనుక ప్రతి నెల దాని రబ్బరు కవర్ ని మార్చాలి.

బయటకు వెళ్ళినప్పుడు హెడ్ ఫోన్స్ వాడితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు బయట సౌండ్స్ వినబడవు. కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.

English summary

Don’t Wear The Headphones For Too Long, They Will Hurt Your Ears: Can You Hear Me?

As human beings are by nature comfort-loving, any product which enhances our level of enjoyment becomes a trusted friend for us in no time. But, just as technology is a sword which cuts both ways, over-reliance on it can do us more harm than help.
Desktop Bottom Promotion