For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొరకాయ చూస్తే నోరూరకపోవచ్చు...కానీ ప్రయోజనాలు మాత్రం అద్భుతం..!

సొరకాయ ఆకుపచ్చరంగులో ఉంటుంది. లోపల తెల్లటి గట్టి పదార్థం, అందులో స్పాంజ్‌లాంటి పదార్థంలో తెల్లటి గింజలు ఉంటాయి. ఇదీ... ఈ కూరగాయ స్వరూపం. సంప్రదాయ బద్ధమైన వైద్య చికిత్సలో సొరకాయను ఎక్కువగా వాడతారు. సొర

|

సొరకాయను , లౌకి అని కూడా పిలుస్తారు. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో తినదగిన, అత్యంత పాపులర్ అయినటువంటి వెజిటేబుల్ . ఈ పొడవాటి గ్రీన్ వెజిటేబుల్లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అయితే ఇది తినడానికి అంత టేస్ట్ గా ఉండదు కాబట్టి, దీన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

సొరకాయ అంటే కొంతమందికి నచ్చదనుకుంటా. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయ జ్యూసు ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తుంటారు. సొరకాయ పేరు వినగానే చాలా మందికి నోరూరకపోవచ్చు... ఆ పేరు పెద్దలకు ఎంత ప్రీతిపాత్రమో పిల్లలకు అంత బాధాకరం కావచ్చు... పిల్లలు, యువత పెద్దగా ఇష్టపడకపోవచ్చు... టిఫిన్‌ బాక్సులో ఆ కూర పెడితే పిల్లలు శిక్షగా భావించవచ్చు... కానీ... సొరకాయ చేసే మేలు ఇంతింతకాదు. ఆ కూరగాయ వల్ల ఆరోగ్యానికి వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. చక్కటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి సొరకాయ చాలా బాగా సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సొరకాయ ఆకుపచ్చరంగులో ఉంటుంది. లోపల తెల్లటి గట్టి పదార్థం, అందులో స్పాంజ్‌లాంటి పదార్థంలో తెల్లటి గింజలు ఉంటాయి. ఇదీ... ఈ కూరగాయ స్వరూపం. సంప్రదాయ బద్ధమైన వైద్య చికిత్సలో సొరకాయను ఎక్కువగా వాడతారు. సొరకాయను ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతున్నారు. సొరకాయను ఏ వ్యాధులకు ఏ రూపంలో వాడతారో, సొరకాయ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి దోహదం చేస్తుందో, సొరకాయలో ఉండే ఉత్తమ గుణాలు ఏమిటో చూద్దాం.

బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది. బాటిల్ గార్డ్ లో ఉండే పొటాసియం కంటెంట్ హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి గ్రేట్ గా సహాయపడుతుంది. అయితే గుండె సంబంధిత సమస్యలున్నవారు డాక్టర్ ను సంప్రదించి తీసుకోవల్సి ఉంటుంది.

జీర్ణశక్తిని పెంచుతుంది:

జీర్ణశక్తిని పెంచుతుంది:

ఆయుర్వేదం ప్రకారం, సొరకాయలో పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. పొట్టకు కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. శరీరంలో యాంటి బిలియస్ ను లక్షణాలను అందిస్తుంది. సొరకాయలో ఉండే విటమిన్ బి బాడీ మెటబాలిక్ రేటు పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది,. . లివ్ హెల్త్ కు చాలా మంచిది. అందుకు కావల్సిన ఫైబర్, మినిరల్స్ ఎక్కువగా సహాయపడుతాయి.

కామెర్లను నివారిస్తుంది:

కామెర్లను నివారిస్తుంది:

సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల జాండిస్ (కామెర్ల )ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

బాటిల్ గార్డ్ జ్యూస్ లో అల్లం, బ్లాక్ పెప్పర్ చేర్చి తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. అయితే ఉదయం పరగడపున తీసుకుంటే మరింత మంచిది.

కిడ్నీలకు మంచిది:

కిడ్నీలకు మంచిది:

సొరకాయ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దాంతో యూరినరీ సిస్టమ్ మరింత చురుకుగా పనిచేస్తుంది. ఇందులో ఆల్కలైన్, మరియు డ్యూరియాటిక్ లక్షణాలు అంధికంగా ఉండటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. సొరకాయ మహిళల రీప్రొడక్టివ్ సిస్టమ్ కు సహాయపడుతుంది.

నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

సొరకాయ జ్యూస్ లో కొద్దిగా నువ్వుల నూనె మిక్స్ చేసి తాగడం వల్ల నిద్రలేమి సమస్యలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

 యాంటీఏజింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది:

యాంటీఏజింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది:

సొరకాయలో ఉండే విటమిన్ సి, జింక్ కంటెంట్స్ ఏజింగ్ ప్రొసెస్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. దాంతో చర్మంలో ముడతలను తగ్గించుకోవచ్చు.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

సొరకాయ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల బరువు తగ్గుతారు , ముఖ్యంగా దీన్ని ఉదయం పరగడపును తీసుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

 చర్మ సంరక్షణకు :

చర్మ సంరక్షణకు :

సొరకాయ జ్యూస్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల మొటిమలను, డార్క్ సర్కిల్స్ ను, మచ్చలను నివారిస్తుంది.

మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

సొరకాయలో ఉండే డైటరీ ఫైబర్ మలబద్దకం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పైల్స్ ను నివారిస్తుంది.

బాడీ కూల్ గా మార్చుతుంది:

బాడీ కూల్ గా మార్చుతుంది:

సొరకాయలో బాడీని కూల్ చేసే లక్షణాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా సమ్మర్లో దీని అవసరం చాలా ఉంది. సొరకాయలో ఉండే విటమిన్ బి మరియు సి కంటెంట్ యాంటీఆక్సిడెంట్ బాడీ సిస్టమ్ ను కూల్ గా ఉంచతుంది.

సోడియం కోల్పోకుండా నివారిస్తుంది:

సోడియం కోల్పోకుండా నివారిస్తుంది:

సొరకాయ జ్యూస్ లో కొద్దిగా ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలో ఎక్సెస్ సోడియం కోల్పోకుండా నివారిస్తుంది.

English summary

Eat Bottle Gourd To Stay Healthy: Here Are 12 Benefits Of Bottle Gourd

Eat Bottle Gourd To Stay Healthy: Here Are 12 Benefits Of Bottle Gourd , Bottle gourd, or lauki, is a humble yet one of the most popular vegetables that we eat. The longish green vegetable, which has a high water content, though is not tasty as such, has a lot of health benefits.
Desktop Bottom Promotion