For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే.. ఎదురయ్యే డేంజరస్ హెల్త్ ప్రాబ్లమ్స్..!

రక్త ప్రసరణలో లోపం వచ్చిందంటే ఊపిరితిత్తులు, గుండె, మెదడు, పాదాలు, చేతులు అనేక ఇతర భాగాల్లో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

By Swathi
|

రక్తప్రసరణ శరీరంలోని అన్ని భాగాలకు సజావుగా జరగాల్సిన ముఖ్యమైన ప్రక్రియ. ఎప్పుడైతే.. రక్తప్రసరణ కొన్ని భాగాలకు సరిగా జరకపోతే.. ఆ భాగాల పనితీరుకి ఆటంకం ఏర్పడుతుంది. రక్త ప్రసరణలో లోపం వచ్చిందంటే ఊపిరితిత్తులు, గుండె, మెదడు, పాదాలు, చేతులు అనేక ఇతర భాగాల్లో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Effects Of Poor Blood Circulation

బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా జరకపోతే.. స్ట్రోక్, హైపర్ టెన్షన్, క్లాట్స్, గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి రక్త ప్రసరణ సజావుగా లేకపోతే.,. చాలా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఆందోళన, స్మోకింగ్ అలవాటు, హైబీపీ, ఒబేసిటీ, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు కూడా రక్తప్రసరణ సజావుగా జరగకపోవడానికి కారణంగా చెప్పవచ్చు.

వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్లతో.. రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు. అసలు రక్త ప్రసరణ సరిగా జరకపోతే.. ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండె

గుండె

రోజూ చేసే చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారంటే ఉదాహరణకు మెట్లు ఎక్కడం వంటి యాక్టివిటీస్ లో చురుగ్గా లేకపోతే.. రక్త ప్రసరణ సరిగా లేక.. కార్డియోవాస్క్యులర్ బలంగా లేదని సంకేతం. దీనికి రక్త ప్రసరణ లోపం కారణం. కొలెస్ట్రాల్ సమస్యలు, హైబీపీ, స్ట్రోక్ వంటివి కారరణాలు.

మెదడు

మెదడు

మెదడుకి సజావుగా రక్త ప్రసరణ అందకపోతే.. మెమరీ కోల్పోతారు, తలనొప్పి, అలసట, మైకం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

కాళ్లు

కాళ్లు

కాళ్లలో స్పర్శ కోల్పోవడం, నొప్పులు, నరాలు పట్టేసినట్టు అనిపించడం వంటి లక్షణాలన్నీ.. కాళ్లకు సరిగా రక్త ప్రసరణ అందడంలేదని సూచిస్తాయి.

కిడ్నీలు

కిడ్నీలు

పాదాల్లో వాపు, చేతులలో వాపు, అలసట వంటి లక్షణాలన్నీ.. కిడ్నీలకు రక్త ప్రసరణ జరగడంలేదని హెచ్చరిస్తాయి. కొన్నిసార్లు రక్తప్రసరణ సజావుగా లేకపోతే.. కిడ్నీలు చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

కాలేయం

కాలేయం

కాలేయానికి రక్త ప్రసరణ సజావుగా అందకపోతే.. ఆకలి తగ్గిపోతుంది. స్కిన్ టోన్ లో చాలా మార్పు కనిపిస్తుంది. హఠాత్తుగా బరువు తగ్గిపోతారు. ఈ లక్షణాలు.. కాలేయానికి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉందని సూచిస్తాయి.

ఇతర లక్షణాలు

ఇతర లక్షణాలు

చల్లటి చేతులు, పాదాలు, జుట్టు రాలడం, అలసట, మైకం, ఏడిమా, డ్రై స్కిన్, కండరాల నొప్పులు, మెమరీ తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా.. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగడంలేదని సూచిస్తాయి. కాబట్టి డాక్టర్ ని సంప్రదించి.. లైఫ్ స్టైల్ లో మార్పులు తీసుకువచ్చినప్పుడే.. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది.

English summary

Effects Of Poor Blood Circulation

Effects Of Poor Blood Circulation. Blood circulation plays a key role in your overall health. Read on to know about the effects of poor circulation....
Desktop Bottom Promotion