For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మండుటెండల నుంచి చల్లటి అనుభూతి కలిగించే న్యాచురల్ రెమిడీస్

|

ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో పగటిపూట బయట తిరగాలంటే ప్రజలు జంకుతున్నారు. రోజు, రోజుకు పెరిగిపోతున్న సూర్య తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. పగటిపూట ఇంట్లో ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరిగిపోతుండడంతో ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. రోజంతా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పుడప్పుడూ గాలులు వీస్తున్నా ఉక్కపోత వల్ల వచ్చే చెమటను నియంత్రించలేకపోతున్నారు. వేసవి వేడి తో పాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం.

దానికి తోడు మధ్యాహ్నానం భోజనం చేసిన తర్వాత కొద్దిగా వికారంగా ఉంటుంది? ఈ ఉక్కపోత వల్ల వివిధ రకాల సమస్యలు ఎదురవుతాయి. దీనినే ఎండదెబ్బ అని కూడా అంటారు ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడం చాలా వేడియైన వాతావరణం లేదా చురుకైన పనులవలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది.

Eight Natural Remedies To Treat Heat Exhaustion

అధిక ఉష్ణోగ్రతలు, శరీరం యొక్క ప్రాధమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి. వేడికి సంబంధించిన సమస్యలలో వడదెబ్బ చాలా తీవ్రమైనది. ఇది తరచుగా, వ్యాయామం నుండి లేదా వేడి వాతావరణంలో, సరియైన మోతాదులో ద్రవపదార్థాలని తీసుకోకుండా బరువైన పనిని చేసినప్పుడు కలుగుతుంది.

వేసవి ఆరోగ్యం కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు

వడదెబ్బ లోకనబడే అతి ముఖ్య లక్షణం స్పష్టంగా అధికమయిన శరీర ఉష్ణోగ్రత(104 డిగ్రీల ఫారన్ హీట్ కంటే ఎక్కువ) దీనితో పాటు వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులు కూడా కనబడుతాయి.ఇవి అయోమయం నుంచి అపస్మారక స్థితి వరకూ వుండవచ్చును . ఇతర గుర్తులు మరియు లక్షణాలలో ఈ క్రింది ఇచ్చినవి ఉంటాయి: గుండె/ నాడి కొట్టుకోవడం, వేగంగా/తక్కువగాశ్వాస తీసుకోవడం, ఎక్కువ లేదా తక్కువ రక్తపోటు, చెమట పట్టక పోవడం, చిరాకు, కంగారు లేదా అపస్మారక స్థితి,,తలతిరగడం లేదా తేలిపోవడం, తలపోటు, వికారం (వాంతులు), పెద్దవారిలో స్పృహకోల్పోవడ0 ప్రధాన లక్షణం, మరియు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురౌతాయి. మరి అలా జరకుండా హీట్ ఎక్స్హౌషన్ (వడదెబ్బ)నివారించడానికి తీసుకోవల్సి కొన్ని జాగ్రత్తలు మీకోసం...

 తడి స్పాంజ్:

తడి స్పాంజ్:

ఈ ఉక్కపోత వల్ల చర్మం కమిలిపోతుంది. అందుకు వెట్ స్పాంజ్ గ్రేట్ గా సహాయపడుతుంది. లేదా హ్యాండ్ ఫ్యాన్ ను ఉపయోగించాలి. నీటిలో స్పాంజ్ ను డిప్ చేసి శరీరం మొత్తం రోజులో అప్పుడప్పుడూ చల్లగా తుడుచుకోవడం వల్ల ఈ ఉక్కపోత నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

 ఐస్ ప్యాక్:

ఐస్ ప్యాక్:

సాధారణంగా ఐస్ ప్యాక్ ను కాలిన గాయాలు మరియు వాపులకు ఉపయోగిస్తుంటారు . ఈ స్మూతింగ్ అండ్ కూలింగ్ ఎఫెక్ట్ వల్ల వడదెబ్బ కూడా తగ్గించుకోవచు. శరీరంలో కొన్ని బాగాల్లో ఐస్ ప్యాక్ తో మర్దన చేయడం వల్ల వడదెబ్బ నుండి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా చంకలు, వీపుబాగం, ముఖం మరియు మెడ వంటి బాగాల్లో ఐస్ ప్యాక్ తో కూల్ చేయాలి . కొన్ని సందర్భాల్లో చల్లటి నీటితోస్నానం కూడా సూచిస్తుంటారు.

పెప్పర్ మింట్ ఆయిల్ ఐస్ ప్యాక్:

పెప్పర్ మింట్ ఆయిల్ ఐస్ ప్యాక్:

ఐస్ ప్యాక్ రెమెడీతో వడదెబ్బ తగ్గించుకోవచ్చు . కొన్ని చుక్కల పిప్పర్ మింట్ ఆయిల్ ను ఐస్ ప్యాక్ తో పాటు శరీరానికి మర్ధన చేయడం వల్ల బాడీ మొత్తానికి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగి కలిగిస్తుంది.

పెప్పర్ మింట్ ఆయిల్:

పెప్పర్ మింట్ ఆయిల్:

పెప్పర్ మింట్ ఆయిల్ నేచురల్ గా శరీరాన్ని కూల్ చేస్తుంది . ఇది చాలా ఎఫెక్టివ్ గా శరీరాన్ని చల్లబరిచే గుణాలు కలిగి ఉంటుంది . కొన్ని చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్ ను చంకల్లో , నడుము వద్ద మరియు పాదాలకు అప్లై చేయాలి . ఇలా చేయడం వల్ల వడదెబ్బ నుండి ఉపశమనం పొందవచ్చు . అలాగే కొన్ని చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్ ను నీటిలో వేసి బాడీకి స్ప్రే చేసుకోవచ్చు.

 నీరు సరిపడా త్రాగాలి:

నీరు సరిపడా త్రాగాలి:

వడదెబ్బకు ముఖ్య కారణం డీహైడ్రేషన్ . కాబట్టి, డీహైడ్రేషన్ కు గురికాకుండా రోజంతా సరిపడా నీరు తాగడం వల్ల అలసట, వికారం, మరియు హీట్ ను తగ్గించుకోవచ్చు . ఒకేసారి తాగకుండా అప్పుడప్పుడు కొద్దికొద్దిగా త్రాగాలి.

సాల్ట్ వాటర్:

సాల్ట్ వాటర్:

మన శరీరంలో చెమట పట్టడం మొదలైతే వెంటనే చెమట రూపంలో మన శరీరంలో ముఖ్యమైన మినిరల్స్ సోడియం మరియు పొటాషియం వంటివి కోల్పోతాము. వాటిని తిరిగి పొందాలంటే ఒక కప్పు చల్లటి నీటిలో కొద్దిగా ఉప్పు చిలకరించి త్రాగడం వల్ల వడదెబ్బ నుండి బయటపడవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి .

 కొబ్బరి నీల్ళు:

కొబ్బరి నీల్ళు:

వడదెబ్బ నివారణకు మరో బెస్ట్ హోం రెమెడీ కోకోనట్ వాటర్ . ఇది బ్లడ్ ప్లాస్మా వంటిది . ఇది శరీరానికి తగిన పోషణను అందిస్తుంది మరియు శరీరాన్ని చల్లబరుతుంది . శరీరాినకి అవసరం అయిన పోషకాలను, ఎలక్ట్రోలైట్స్ ను అందిస్తుంది.

రీహైడ్రేషన్ సొల్యూషన్:

రీహైడ్రేషన్ సొల్యూషన్:

కొద్దిగా పంచదార మరియు ఉప్పు నీటిలో మిక్స్ చేసి, రోజులో అప్పుడప్పుడు కొద్దిగా త్రాగుతుండాలి.

English summary

Eight Natural Remedies To Treat Heat Exhaustion in telugu

Does the searing heat often make you feel sapped? Did that last midday lunch leave you feeling a bit nauseous? Heat exhaustion can often cause many complications. And if not taken care of immediately, it can even turn fatal.
Desktop Bottom Promotion