For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ లో స్లీప్ లెస్ నైట్స్ కు గుడ్ బై చెప్పే డిన్నర్ ఫుడ్స్

|

ప్రస్తుతం వేసవి సీజన్ ఈ సీజన్ లో ఎండలు మండిపోతున్నాయి. వేడి వాతారవణంలో బయట అడుగుపెట్టాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. మండే వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట తీసుకొస్తుంది. వీటివల్ల చిరీకుతో మరింత నీరసం. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయంలో తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవి కూడా చల్లని వేన్నెలా ఆస్వాదించొచ్చు.

ముఖ్యంగా వేసవిలో ఎక్కువ ఆకలిగా ఉంటుంది. కానీ ఏం తిన్నా తినాలనిపించదు. ఎంత తిన్నా మళ్లీ ఆకలిపెడుతూనే ఉంటుంది. అంతే కాదు, వేసవి సీజన్లో నిద్రలేని రాత్రులు కూడా లెక్కపెట్టలేనన్ని ఉంటాయి. వేసవిలో వాతావరణంలో వేడి కారణంగా సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా నిద్ర సరిగా పట్టదు . ముఖ్యంగా రాత్రుల్లో తీసుకొనే ఆహారాలు మరియు డ్రింక్స్ శరీరం యొక్క ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి ముఖ్య పాత్రను వహిస్తాయి.

Foods To Eat For Dinner To Avoid Summer Heat At Night

సమ్మర్లో బాడీ హీట్ తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

కాబట్టి వేసవిలో రాత్రుల్లో బాగా నిద్రపట్టాలంటే మంచి ఆహారం తీసుకోవాలి . ముఖ్యంగా రాత్రుల్లో తీసుకొనే ఆహారం పూర్తిగా న్యూట్రీషియన్స్ తో కూడినదై ఉండాలి . అంతే కాదు వేసవిలో శరీరాన్ని పూర్తి హైడ్రేషన్ తో ఉంచే ఆహారాలను తీసుకోవాలి . మరి వేసవి సీజన్లో శరీరానికి మంచి హైడ్రేషన్ అందివ్వడంతో పాటు, నిద్రపట్టిలే చేసే ఉత్తమ ఆహారాలు...

సొరకాయ:

సొరకాయ:

వేసవి కాలంలో హీట్ ను బీట్ చేసే గ్రీన్ వెజిటేబుల్ ఇది. సొరకాయలో ముఖ్యంగా వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో వాటర్ లెవల్స్ ను పెంచుతుంది. ఈ వెజిటేబుల్ రాత్రి నిద్రించడానికి ముందు తినడం వల్ల నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది . మంచి నిద్రపట్టేలా చేస్తుంది.

 కీరదోసకాయ:

కీరదోసకాయ:

వేసవిలో బాగా నిద్రపట్టడానికి మరో వాటర్ డిన్నర్ ఫుడ్ ఇది. ముఖ్యంగా వేసవిలో ఈ గ్రీన్ వెజ్ వల్ల మన శరీరానికి 96శాతం నీరు అందుతుంది . ఇది శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది రాత్రుల్లో బాగా నిద్రపట్టేలా శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది.

 గుమ్మడి:

గుమ్మడి:

గుమ్మడి కాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. మరియు ఇందులో కూలింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది . ఈ సీజన్ కు ఇది ఒక మంచి ఆహారం.

బీరకాయ:

బీరకాయ:

ఈ వెజిటేబుల్ ను తురై అనికూడా పిలుస్తారు . ఈ గ్రీన్ వెజిటేబుల్ ఈ సమ్మర్ కు చాలా మంచిది. ఇది ఖచ్చితంగా పొట్టకు చాలా మేలు చేస్తుంది . మరియు చాలా సులభంగా జీర్ణం అవుతుంది . వేసవి కాలంలో డిన్నర్ కు ఈ వెజిటేబుల్ తినడం వల్ల జీర్ణ సమస్యలను నివారించుకోవచ్చు . మరియు మంచిగా నిద్రపడుతుంది.

బంగాళదుంప:

బంగాళదుంప:

దీన్ని తయారుచేయడం సులభం మరియు ఫుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నది. శరీరం వేడికి గురికాకుండా సహాయపడుతుంది మరియు నిద్రబాగా పడటానికి సహాయపడుతుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగు ఎక్కువ పోషకాలున్న ఆహారం అంతే కాదు క్యాల్షియం అధికంగా ఉంటుంది. రాత్రుల్లో పెరుగు తినడం వల్ల ఎలాంటి అవాంతరాలుండవు . ఇది ఒక కూలింగ్ ఫుడ్ ఐటమ్ . దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సమ్మర్లో తినడం వల్ల మంచి నిద్రపడుతుంది . వీటితో పాటు రోజంతా సరిపడా నీరు త్రాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.

సాధ్యమైనంత ఎక్కువ నీరు:

సాధ్యమైనంత ఎక్కువ నీరు:

శరీరంలో వేడి తగ్గించడానికి ఎక్కువగా సహాయపడేది నీళ్ళు. వేసవిలో సాధారణంగా తీసుకొనే దానికంటే మరింత ఎక్కువగా తీసుకోవాలి.

English summary

Foods To Eat For Dinner To Avoid Summer Heat At Night in telugu

Most parts of the country, have been reeling under heat waves for the past few weeks. The scorching heat seems hotter than ever! It's become a struggle to get through the days, and the nights are no better!
Desktop Bottom Promotion