For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనుమాసనంతో సజావుగా అబ్డామినల్ ఫంక్షన్.. !

By Super Admin
|

హనుమానాసనం అనే పదం హిందూ దేవుడైన భగవాన్ హనుమంతుడి పేరు నుంచి ఉద్భవించింది. వానర ప్రభువుగా కూడా హనుమంతుడు ప్రసిద్ది. భారత దేశంలోని దక్షిణాది నుంచి శ్రీలంక ద్వీపానికి అనగా రామసేతుని చేరడానికి హనుమంతుడు లంఘించాడు.

ఈ ఆసనాన్ని మీరు సాధన చేయడం ప్రారంభించిన మొదటిసారే విజయవంతంగా సాధన చేయలేరు. మీ శరీరానికి కాస్త అభ్యాసంతో సౌలభ్యత లభించడంతో ఈ ఆసనాన్ని మీరు విజయవంతంగా సాధన చేయగలుగుతారు. ఈ ఆసన సాధన ప్రారంభించడానికి ముందు కొన్ని హిప్-ఓపెనింగ్ వ్యాయామాలతో మీ శరీరానికి తగిన సౌలభ్యతను పెంపొందించండి. అబ్డామినల్ పనితీరును మెరుగుపరిచేందుకై ఈ ఆసనం అమితంగా ఉపయోగపడుతుంది.

మన పొత్తికడుపులోమూత్రపిండాలు, కాలేయం, పిత్తాశయం, ప్రేగులు, కడుపు, లివర్, క్లోమము వంటి జీర్ణక్రియకు సంబంధించిన అవయవాలుంటాయి. ఏ ఒక్క అవయవం సరిగ్గా పనిచేయకపోయినా ఆ ప్రభావం ఇతర అవయవాలపై కచ్చితంగా పడుతుంది. అందువల్ల, అవయవాల మధ్య సంయమనాన్ని పెంపొందించడం ముఖ్యమైన విషయం. వెన్నెముకతో అలాగే వెనుక కండరాలతో కూడా పొత్తికడుపు అనుసంధానమై ఉంటుంది. ఈ ఆసనం ద్వారా ఆరోగ్యకరంగా పొత్తికడుపు పనితీరును మెరుగుపరచవచ్చు.

Hanumanasana

ఈ ఆసనాన్ని సాధన చేసే విధాలు

• మోకాళ్లని ఎడంగా పెట్టే విధంగా నేలపై కూర్చోవాలి. కుడి పాదం ముందువైపు ఉండాలి, బాహ్య మడమ నేలను తాకే విధంగా చూసుకోవాలి. అరికాళ్లను పైకి తీసుకువస్తున్నట్టుగా కూర్చోవాలి.

• ఇప్పుడు శ్వాసను బయటకు వదలండి. మీ నడుమును ముందుకు వంచుతూ చేతివేళ్లతో నేలను తాకండి.

Hanumanasana

• ఇప్పుడు, మెల్లగా మీ ఎడమ మోకాలును వెనుకవైపుకు తీసుకువెళ్లండి. కాళ్లు తిన్నగా ఉండేలా చూసుకుంటూ మోకాలు అలాగే పాదాలు నేలను తాకేలా చూడండి. మరోవైపు, కుడి కాలు నేలకు తాకే వరకు తిన్నగా వచ్చేలా ప్రయత్నించండి.

• ఇప్పుడు, మీ కుడి పాదం ముందువైపుకి అలాగే ఎడమ పాదం వెనుకవైపుకి ఉండడాన్ని మీరు గమనించవచ్చు. దీనినే స్ప్లిట్ పోసిజన్ అని అనవచ్చు.

• మీ కుడి బొటన వేలు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. మరోవైపు, ఎడమ బొటన వేలు నేలను త్రాకుతున్నట్టుగా ఉండాలి.

• మీ చేతులను పైకి ఎత్తుతూ మీ రెండు అరచేతులను కలపండి. ఇలా చేస్తున్నప్పుడు మీ చేతులను ఎంతవరకు సాగదీయగలుగుతారో అంతవరకు సాగదీసి మీ నడుమును కొంచెం విల్లులా వంచండి.

• ప్రారంభంలో, ఈ స్థానంలో ఎన్ని క్షణాల వరకు మీరు సౌకర్యంగా ఉండగలరో అంతవరకూ ఉండటానికి ప్రయత్నించండి. క్రమంగా, సమయాన్ని పెంచండి.

• ఇప్పుడు, మీ చేతులను నేలపై తాకిస్తూ వాటి సహాయంతో మీ వెనుక పదాన్ని ముందుకు కుడిపాదం పక్కగా తీసుకురండి. ఇదే ఆసనాన్ని ఇప్పుడు ఎడమ కాలుని ముందుకు ఉంచి కుడి పాదాన్ని వెనుక ఉంచి సాధన చేయండి.

• మొదటి రోజే ఈ ఆసనాన్ని పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నించకండి. నిరంతర సాధన ద్వారా పరిపూర్ణత చేకూరుతుంది. క్రమంగా, మీరు ఈ ఆసనాన్ని చక్కగా సాధన చేయగలుగుతారు.

Hanumanasana

ఈ ఆసనం వలన కలిగే ప్రయోజనాలు

శరీరానని స్ట్రెచ్ చేసే సౌలభ్యతను పెంపొందిస్తూ మోకాలి కండరాలను పటిష్టపరచడంతో పాటు తొడలను కూడా పటిష్టపరిచేందుకు హనుమానాసనం ఉపయోగపడుతుంది. పొత్తికడుపులోని అవయవాల పనితీరును మెరుగుపరచడంతో పాటు వాటి పనితీరు సజావుగా జరిగేలా ఈ ఆసనం ప్రేరేపిస్తుంది. ఈ ఆసనాన్ని సాధన చేయడం ప్రారంభించిన కొంత కాలం తరువాత ఈ ఆసనం మీ శరీరానికి అవసరమైన అనుగుణ్యతను ప్రసాదిస్తుంది.

Hanumanasana

హెచ్చరిక

పొత్తికడుపులోని ఏదైనా సమస్యగాని గాయంగాని ఉన్నప్పుడు మీరు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు. మీరు సౌకర్యవంతంగా ఉండే విధంగానే ఈ ఆసనాన్ని సాధన చేయండి. పరిపూర్ణతగా ఈ ఆసనాన్ని మొదట్లోనే సాధన చేయడానికి ప్రయత్నించకండి. ప్రారంభంలో, మీరు ఈ ఆసనాన్ని సాధన చేస్తున్నప్పుడు మీకు కొంత కష్టంగా ఉండవచ్చు. మీ శరీరాన్ని సౌకర్యంగా ఉంచే విధంగా సాధన కొనసాగించండి. ఈ ఆసన సాధన చేస్తున్నప్పుడు మీ మోకాళ్ళ కింద అలాగే చీలమండల కింద దుప్పటిని పెట్టుకుంటే ఆసనం వల్ల కలిగే నొప్పిని మీరు కొంతమేరకు అరికట్టవచ్చు. ఒకవేళ మీరు ఈ ఆసనాన్ని సాధన చెస్తున్నప్పుడు ఏదైనా సమస్యకు అంటే కాలి నొప్పి బారిన పడితే ఈ ఆసన సాధనను కొన్ని రోజుల వరకు విరమించండి. ఆ తరువాత శరీర అనుగుణ్యతను పెంపొందించుకునే మరికొన్ని వ్యాయామాలను చేసి ఆ తరువాత ఈ ఆసన సాధనను ప్రారంభించండి.

English summary

Hanumanasana Or Monkey Pose To Improve Abdominal Functioning

Hanumanasana Or Monkey Pose To Improve Abdominal Functioning. This term has been originated from the Hindu God, wherein “Hanuman” denotes “Lord Hanuman” and “asana” denotes “pose”.
Story first published: Monday, June 20, 2016, 17:45 [IST]
Desktop Bottom Promotion