For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందరికి దొరికే కొత్తిమీరతో కోరినన్ని లాభాలు

By Swathi
|

ఏ వంట చేసినా.. నేనున్నానంటూ ఘుమఘుమల సువానస తీసుకొస్తుంది కొత్తిమీర. కూరలైనా.. చారులైనా.. సాంబారైనా.. పులావు అయినా.. చికెన్.. మటన్ ఏ మాంసాహారానికైనా.. చక్కటి సువాసన.. కమ్మని రుచిని అందిస్తుంది కొత్తిమీర. ఏ వంటకం వండినా.. కాస్తనైనా కొత్తిమీర ఘాటు తగలాల్సిందే అంటారు. వంటకాల్లో అంతటి గొప్ప స్థానం సంపాదించుకుంది కొత్తిమీర.

READ MORE: రెగ్యులర్ డైట్ లో ధనియాల అవసరమేంటి ?READ MORE: రెగ్యులర్ డైట్ లో ధనియాల అవసరమేంటి ?

కొత్తిమీర సువాసనను మాత్రమే కాదు.. దీన్ని తరచూ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కొత్తిమీరలో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ ఎలు కూడా కొత్తిమీర ద్వారా పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడతాయి. అంతేకాదు.. బరువు తగ్గడానికి కూడా కొత్తిమీర సహాయపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే.. కొత్తిమీరతో పొందే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం...

Health benefits of Coriander Leaves

జీర్ణవ్యవస్థ:
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి కొత్తిమీర సహకరిస్తుంది. అలాగే మధుమేహంతో బాధపడేవాళ్లకు కొత్తిమీర మంచి ఔషధం. రక్తంలోని చక్కెర నిల్వల్ని తగ్గిస్తుంది. కొత్తిమీరను ఇష్టపడేవాళ్లు దాని రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Health benefits of Coriander Leaves

కొలెస్ర్టాల్:
కొత్తిమీరలో పీచు ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సితోపాటు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో హానికారక కొవ్వు కరుగుతుంది.

READ MORE: సహజ వైద్యాన్ని అందించే ఏడు మూలికలు

అల్జీమర్స్:
కొత్తిమీరలో విటమిన్ కె ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది అల్జీమర్స్ వ్యాధి నుంచి కాపాడుతుంది. వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు వ్యాధిని నియంత్రించడంలో కొత్తిమీర కీలకపాత్రపోషిస్తుంది.

Health benefits of Coriander Leaves

కీళ్ల నొప్పులు:
కొత్తిమీరలో కొవ్వుని కరిగించే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఇన్ఫెక్షన్స్:
కొత్తిమీరలో రుచి మాత్రమే కాదు గాయాలను తగ్గించే రెమిడీ కూడా ఉంది. కొత్తిమీరలో యాంటీ సెప్టిక్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి నోటి పూత, నెలసరి ఇబ్బందులు, గాయాలు త్వరగా మానేలా చేస్తాయి.

English summary

Health benefits of Coriander Leaves: Coriander Leaves to reduce fat

The health benefits of coriander include its use in the treatment of skin inflammation, high cholesterol levels, diarrhea, mouth ulcers, anemia, indigestion, menstrual disorders, smallpox, conjunctivitis, skin disorders, and blood sugar disorders, while also benefiting eye care.
Desktop Bottom Promotion