For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జింజర్ బ్లాక్ టీలోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

వింటర్ సీజన్లో వేడివేడిగా ఒక కప్పు కాఫీ త్రాగడం వల్ల తెలియని అనుభూతి, ఉత్సాహం కనబడుతుంది. అందుకు ముఖ్య కారణం టీ లేదా కాఫీలో ఉండే కెఫిన్ అని చెబుతారు. కెఫిన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

అయితే, మనం రెగ్యులర్ గా తీసుకొనే బ్లా టీ మరియు గ్రీన్ టీలలో కెఫిన్ చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఈ రకమైన టీలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

మరి అలాంటి హెల్తీ బ్లాక్ టీ కి కొద్దిగా అల్లం మిక్స్ చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు డబుల్ అవుతాయి. మన ఆరోగ్యానికి మరింత మెరుగ్గా సహాయపడుతాయి.

అందువల్ల, బ్లాక్ జింజర్ టీలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటి? నిజానికి తక్కువ కెఫిన్ ఉండే బ్లాక్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేసన్ పెరుగుతుంది.

అంతే కాకుండా, వీటిలో ఉండే ఫ్లోరైడ్ దంతాలకు మరియు ఎముకలను బలోపేతం చేస్తాయి . మీరు కనుక ఆపిల్స్ తీసుకుంటే అందులో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇంకా మీరు బ్లాక్ టీ తీసుకోవడం వల్ల కూడా వీటిని పుష్కలంగా పొందవచ్చు.

జింజర్ బ్లాక్ టీ కాంబినేషన్లో బ్లాక్ టీ మరియు అల్లం చేర్చడం వల్ల జింజర్ బ్లాక్ టీ తయారవుతుంది . కాబట్టి, రోజులో పాలు, పంచదార, టీపొడితో తయారుచేసిన టీలను రెండు మూడు కప్పులు టీలు త్రాగడానికంటే , మీకు అవసరం అనిపించినప్పుడు ఒక చిన్న కప్పు జింజర్ బ్లాక్ టీ త్రాగండి.

ఈ జింజర్ బ్లాక్ టీ చర్మ సమస్యలను నివారించడంతో పాటు, హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. జింజర్ బ్లాక్ టీలో మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల, మీలో వ్యాధినిరోధకశక్తి పెంచుకోవడానికి ..మంచి ఆరోగ్యం పొందాలంటే జింజర్ బ్లాక్ టీలోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాల్సిందే...

వికారం తగ్గిస్తుంది:

వికారం తగ్గిస్తుంది:

మార్నింగ్ సిక్ నెస్, మోషన్ సిక్ నెస్ తో బాధపడుతుంటే జింజర్ బ్లాక్ టీ తీసుకోవాలి. కొద్దిగా బ్లాక్ టీ ని ఉదయం తీసుకోవడం వల్ల వామిటింగ్ సెన్షేన్ తగ్గుతుంది . గర్భణీలు కూడా మార్నింగ్ సిక్ నెస్ నివారించుకోవడానికి దీన్ని తీసుకోవచ్చు.

కొలెస్ట్రాల్ లెవల్:

కొలెస్ట్రాల్ లెవల్:

జింజర్ బ్లాక్ టీ తీసుకోవడం వల్ల శరీరంలో LDL కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చని చాలా పరిశోధనలు రుజువు చేశాయి. దీన్ని త్రాగడం వల్ల హార్ట్ డిసీజ్ తగ్గిస్తుంది.

 జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

మోతాదుకు మించి తిన్నప్పుడు ఒక కప్పు అల్లం టీ తీసుకోవడం వల్ల కడుపుబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది . ఇది అజీర్తిని మరియు ఇతర పొట్ట సమస్యలను నివారిస్తుంది.

డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:

డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:

బ్లాక్ టీ త్రాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి . అలాగే రక్తంలో ప్లాస్మా గ్లూకోజ్ పెరుగుతుంది . దాంతో పాటు, బ్లాక్ జింజర్ టీలో అల్లం ఉపయోగించడం వల్ల యాంటీ క్యాన్సేరియస్ లక్షణాలు శరీరంలో క్యాన్సర్ కణతులు ఏర్పడకుండా చేస్తుంది

 ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

బ్లాక్ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు హార్ట్ బర్న్ నివారిస్తుంది, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్, ఇన్ఫ్లమేషన్ మొదలగువాటి నుండి ఉపశమనం కలుగుతుంది. అల్లం లోకూడా ఈ లక్షణాలుండటం వల్ల ఇది ఇన్ఫ్లేమ్డ్ జాయింట్ ఆర్గాన్స్ కు ఇది చాలా బెస్ట్ హోం రెమెడీ.

కిడ్నీ హెల్త్ కోసం:

కిడ్నీ హెల్త్ కోసం:

జింజర్ బ్లాక్ టీని త్రాగే మహిళల్లో కిడ్నీ స్టోన్స్ చాలా తక్కువగా చేరుతాయని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడైనది.

శ్వాససంబంధిత సమస్యలతో పోరాడుతుంది:

శ్వాససంబంధిత సమస్యలతో పోరాడుతుంది:

ప్రతి సంవత్సరం ఏదో ఒక సీజన్ లో ముక్కుదిబ్బడ, దగ్గు, జలుబుతో బాధపడుతుంటారు. వీటిని నివారించుకోవడానికి హాట్ హాట్ గా బ్లాక్ జింజర్ కాఫీ త్రాగడం వల్ల ఎయిర్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది. ఈ టీ అలర్జీలను చికిత్సలా పనిచేస్తుంది.

English summary

Health Benefits Of Ginger Black Tea

Benefits of ginger black tea are the combination of the goodness of black tea and ginger. So, instead of having more and more cups of tea with sugar and milk, you should have black ginger tea whenever you can.
Desktop Bottom Promotion