For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ తో పాటు, రకరకాల వ్యాధులు నయం చేసే సత్తా మామిడాకులదే..!!

By Swathi
|

పండ్లలోనే రారాజు మామిడిపండు. తియ్యగా, పుల్లగా, జ్యూసీగా ఉండే మామిపండ్లు అంటే.. అందరికీ మజానే. సమ్మర్ లో విరివిగా లభించే వీటిని ప్రతి ఒక్కరూ టేస్ట్ చేస్తారు. కాస్ట్ ఎలా ఉన్నా.. ఏడాదికి ఒకసారి అందుబాటులో ఉండే.. మామిడిపండ్లను ప్రతి ఒక్కరూ తింటారు. ఈ మామిడిపండ్లలో అనేక హెల్త్ బెన్ఫిట్స్ ఉంటాయని అందరికీ తెలుసు.

డయాబెటిక్ పేషంట్స్ కి తీపి వార్త... మీరు తీసుకోగలిగే లో షుగర్ ఫుడ్స్..

అయితే మామిడి ఆకులలోని ఆరోగ్య రహస్యాలు చాలా మందికి తెలియదు. వీటిని సాధారణంగా పండుగలు, ఫంక్షన్స్ సమయంలో వాకిళ్లకు తోరణాలుగా అలంకరిస్తారు. దీనివెనక సైంటిఫిక్ రీజన్స్ ఉండటం వల్ల మామిడాలకును తప్పనిసరిగా.. గుమ్మాలకు కడతారు. అయితే.. ఈ మామిడాకులకు డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను నయం చేసే సత్తా కూడా ఉంది. మరి మామిడాకులను డయాబెటిస్ నివారించడానికి ఎలా ఉపయోగించాలి, వీటిలో దాగున్న హెల్త్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందామా..

డయాబెటిస్

డయాబెటిస్

మామిడి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. కాబట్టి వీటిని డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగించవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండటానికి మామిడాకులు ఉపయోగపడతాయి.

ఆస్తమా

ఆస్తమా

ఆస్తమా నుంచి ఉపశమనం కలగడానికి మామిడి ఆకులు సహాయపడతాయి. అలాగే శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తాయి. మామిడాకులను చైనీస్ మెడిసిన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఇన్ఫెక్షన్స్

ఇన్ఫెక్షన్స్

రకరకాల మెడిసినల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. మామిడాకులు రకరకాల వ్యాధులను నివారిస్తాయి. జీర్ణసంబంధ సమస్యలు, ట్యూమర్స్ తో పోరాడే శక్తి మామిడాకుల్లో దాగుంది.

వైరల్ ఇన్ఫెక్షన్స్

వైరల్ ఇన్ఫెక్షన్స్

మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సింట్స్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మామిడి ఆకుల పేస్ట్ అప్లై చేయడం వల్ల.. చాలా త్వరగా ఉపశమనం పొందవచ్చు.

గొంతు నొప్పి

గొంతు నొప్పి

ఎక్కిళ్లు, గొంతు ఇన్ఫెక్షన్స్ నివారించడంలో మామిడాకులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మామిడాకులను కాల్చి ఆ పొగ ద్వారా గొంతు ఇన్ఫెక్షన్స్, నొప్పి, ఎక్కిళ్లు నివారించడానికి సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి ?

ఎలా ఉపయోగించాలి ?

లేత మామిడి ఆకులు తీసుకుని.. ఒక గిన్నె నీటిలో ఉడికించాలి. వడకట్టి ఆ నీటిని తాగాలి. దీని వల్ల గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి.

డయాబెటిస్ కి

డయాబెటిస్ కి

లేత మామిడి ఆకులను ఎండబెట్టి పౌడర్ చేసి.. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పౌడర్ కలిపి.. తాగాలి. ఇలా తాగుతూ ఉండటం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. లేదా పచ్చి మామిడాకులనే నీటితో శుభ్రం చేసి నమిలి తిన్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఈ మూడింటిలో ఏ పద్ధతిలో మామిడాకులను తీసుకున్నా.. రకరకాల వ్యాధులు నివారించుకోవచ్చు.

English summary

Health benefits of mango leaves for diabetes and other diseases

Health benefits of mango leaves for diabetes and other diseases. The fruit definitely has many health benefits apart from having an amazing sweet-tangy taste. But its leaf seldom gets any importance, though it is also rich with therapeutic and medicinal properties.
Story first published:Monday, May 9, 2016, 14:10 [IST]
Desktop Bottom Promotion