For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెదాలు ఎక్కువగా పగిలిపోయి, డ్రైగా మారడానికి అసలు కారణాలు..!!

By Swathi
|

పగిలిన పెదాలు.. మీ శరీరానికి కావాల్సిన నీటిని పొందలేదని తెలుపుతాయి. డీహైడ్రేషన్ ని తగ్గించుకుంటే.. మీ పగిలిన పెదాలను.. నయం చేసుకోవచ్చు. ఎక్కువ నీళ్లు తాగడం, హైడ్రేటింగ్ ఫుడ్స్ అయిన పుచ్చకాయ, స్ట్రాబెర్రీస్ తీసుకోవడం వల్ల.. మిమ్మల్ని హైడ్రేట్ గా మార్చుకుని.. పగిలిన పెదాలను దూరం చేసుకోవచ్చు.

అయితే చాలా తరచుగా.. మీ పెదాలు పగులుతున్నాయి అంటే.. మీ శరీరం పెదాలకు సరైన మాయిశ్చరైజర్ అందివ్వలేకపోతోందని అర్థం. పెదాలు ఆరిపోయినప్పుడు.. అవి పగిలి, రక్తస్రావానికి కారణమవుతాయి. కాబట్టి.. మీ పెదాలను హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం.

అయితే.. ఇలా పెదాలు పగలడానికి కేవలం నీళ్లు తాగకపోవడమే కాదు.. మరికొన్ని అనారోగ్య సంకేతాలు కూడా కారణమవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

జ్వరం

జ్వరం

తరచుగా జ్వరం, దప్పక వంటి సమస్యలతో బాధపడుతున్నారంటే.. పెదాలు పగలడానికి డీహైడ్రేషన్ కారణమై ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు మీ శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. కాబట్టి.. అలాంటప్పుడు ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల.. పెదాలు హైడ్రేట్ అవుతాయి.

తరచుగా యూరినేషన్

తరచుగా యూరినేషన్

మీరు చాలా తరచుగా.. యూరిన్ కి వెళ్తున్నారంటే.. అది కూడా పగిలిన పెదాలకు కారణమై ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వంటివి కూడా.. తరచుగా యూరినేషన్ కి కారణమవుతుంది.

డయేరియా

డయేరియా

ఇటీవల మీరు డయేరియాతో బాధపడి ఉంటే.. పగిలిన పెదాలకు అది కారణం అవుతుంది. ఎందుకంటే.. డయేరియా సమయంలో శరీరంలో డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి.. పెదాలు పగులుతాయి.

వాంతులు

వాంతులు

వాంతులు వల్ల శరీరం ఫ్లూయిడ్స్ ని కోల్పోతుంది. వాంతులు అవడం వల్ల.. చర్మం డీహైడ్రేట్ అవుతుంది. ఇది.. పగిలిన పెదాలకు కారణం అవుతుంది.

మెడికల్ కండిషన్స్

మెడికల్ కండిషన్స్

డయాబెటిస్, వంటి అనారోగ్య సమస్యలు కూడా.. డీహైడ్రేషన్ కి కారణమవుతాయి. ఇవి పరోక్షంగా.. పెదాలు పగలడానికి కారణమవుతాయి.

పెదాలను పదే పదే నాలుకతో తాకడం వల్ల

పెదాలను పదే పదే నాలుకతో తాకడం వల్ల

కొంతమందికి.. పెదాలు ఆరిపోయినప్పుడు.. పెదాలను నాలుకతో తాకే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల.. మాయిశ్చరైజర్ అందుతుంది. కానీ.. ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటే.. పెదాలు ఎక్కువగా పగులుతాయి. కాబట్టి.. లిప్ బామ్ ఉపయోగించడం మంచిది.

వాతావరణం

వాతావరణం

వాతావరణ పరిస్థితులు కూడా.. పెదాలపై ప్రభావం చూపుతాయి. అత్యంత ఎక్కువ వేడి, చలి, గాలి కూడా.. పెదాలు డ్రైగా మారడానికి, పగలడానికి కారణమవుతాయి. మీ శరీరం వాతావరణానికి అలవాటవ్వాలి. అప్పుడే.. పెదాలు డీహైడ్రేట్ అవకుండా.. ఉంటాయి.

English summary

Health Reasons Behind Chapped Lips

Health Reasons Behind Chapped Lips. Chapped lips indicate that your body lacks enough of water. In fact, if you can tackle dehydration, you can cure chapped lips.
Story first published:Thursday, August 11, 2016, 14:34 [IST]
Desktop Bottom Promotion