For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణహాని కలిగించే అపెండిక్స్ కు ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

చిన్న ప్రేవు, పెద్ద ప్రేవు కలిసే చోట పొత్తి కడుపులో కుడివైపు బొటనవేలి ఆకారంలో సంచిలాంటి అవయవం వుంటుంది. దీనిని 'అపెండిక్స్‌' (ఉండుకము) అంటారు. అపెండిక్స్, ఒక పురుగు ఆకారంలో ఉండే సంచీ,పెద్దప్రేగుతో జతపడి, ఎర్రబడిన వెంటనే అపెండిసైటిస్ ఏర్పడుతుంది. ఈ అపెండిసైటిస్ చాలా బాధాకరంగా ఉంటుంది మరియు దీని నివారణకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

సాధారణంగా పెద్ద ప్రేగులో ఏదైనా పదార్ధం అడ్డుపడ్డా లేదా మరే ఇతర కారణాలవల్లనైనా ఇది వాపుకు లోనవుతుంది. దాంతో రోగి విపరీతమైన నొప్పితో బాధపడతాడు. ఇది సోకిన 24 గంటల్లోగా ఆపరేషన్ ద్వారా దీన్ని తొలగించకపోతే తప్పని సరిగా రోగి ప్రాణానికి ప్రమాదం వాటిల్లడం ఖాయమని ఇప్పటి వరకూ జరిపిన పరిశోధనల్లో నిర్ధారించారు.

అసలు నిజానికి అపెండిక్స్ వల్ల ప్రస్తుతం మన శరీరానికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే పురాతన కాలంలో మానవుడి ఆహారంలో సెల్యులోజ్ అధికంగా తీసుకొనే వాడు. అప్పట్లో దాని అరుగుదలకు ఈ ఉండూకం ఉపయోగపడేది. కాలం మారుతున్న కొద్దీ మానవుల ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉడకబెట్టిన ఆహారంలో సెల్యులోజ్ లేకపోవడం వల్ల ఉండూకానికి పనిలేకుండా పోయింది. ఫలితంగా ప్రస్తుతం అది మన శరీరంలో ఒక అవశేషావయవంగా కొనసాగుతోంది. ఇదీ దీని చరిత్ర!

అపెండిసైటిస్‌ సమస్య... ప్రధానంగా కడుపు నొప్పితో ఆరంభమవుతుంది. తర్వాత జ్వరం, వికారం, వాంతులు, డయోరియా, మలమద్దకం, గ్యాస్ బయటకు రాకపోవడం, పొట్ట ఉదరం వాపు, ఆకలి లేకపోవటం.. ఈ నాలుగూ ప్రధాన లక్షణాలు. అపెండిసైటిస్‌ను నిర్ధారించటంలో ఈ లక్షణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

అపెండిసైటిస్ ప్రారంభ లక్షణాలు : నొప్పి నివారణలు

అపెండిక్స్ కు వెంటనే చికిత్స తీసుకోకపోతే అది పగిలి , ప్రాణాంతకంగా మరుతుంది . కాబట్టి వెంటన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. స్ట్రాండర్ట్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ తో అపెండిక్స్ ను తొలిగిస్తారు. అపెండిక్స్ కు చికిత్సతో పాటు కొన్ని హోం రెమెడీస్ తో నివారించుకోవచ్చు. అయితే అపెండిక్స్ లక్షణాలు ప్రారంభంలో గుర్తించినప్పుడు ఈ హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి అవేంటో చూద్దాం...

ఆముదం నూనె:

ఆముదం నూనె:

అపెండెక్స్ కు ఎఫెక్టివ్ హోం రెమెడీ ఆముదం. ఆముదం నూనె ప్యాక్ తో బ్లాక్ లను మరియు ఇన్ఫ్లమేసన్ ను తగ్గించుకోవచ్చు. ఆముదం నూనెను తాగడం వల్ల బౌల్ మూమెంట్ మెరుగుపడుతుంది. ఆముదం నూనె ప్యాక్ పెద్ద క్లాత్ తీసుకిని దాన్ని లేయర్స్ గా ఫోల్డ్ చేసి రెండు చెంచాలా ఆముదం నూనెను దాని మీద వేయాలి. తర్వాత పాత వస్త్రం మీద పడుకొని పొట్ట ఉదరం మీద ఈ నూనె క్లాత్ ను కప్పుకొని పడుకోవాలి, ఈ రెమెడీని వారంలో 3సార్లు, రెండు మూడు నెలలు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, థెరఫిటిక్ లక్షణాలున్నాయి . ఇవి అపెండిక్స్ కు గ్రేట్ గా ట్రీట్ చేస్తుంది . ఇది ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని నివారిస్తుంది. అందుకు మీరు చేయాల్సింది, ప్రతి రోజూ 2, 3వెల్లల్లి రెబ్బలను పరగడపున తినాలి .రెగ్యులర్ వంటల్లో వెల్లుల్లి వాడకాన్ని పెంచాలి

అల్లం:

అల్లం:

మరో యాంటీ ఇన్ఫ్లమేటరీ రెమెడీ అల్లం, అల్లం కూడా అపెండిక్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది నొప్పిని నివారిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది . మరియు వాంతులు మరియు వికారం వంటి సాధారణ లక్షణాలను కూడా నివారిస్తుంది.

జింజర్ తో తయారుచేసిన టీని రోజుకు రెండు మూడు సార్లు తాగాలి . అలాగే జింజర్ ఆయిల్ తో పొట్ట ఉదరం మసాజ్ చేయడం వల్ల పొట్ట ఉదరం నొప్పి తగ్గుతంది .

మెంతులు:

మెంతులు:

అపెండిక్స్ ను నివారించడంలో మెంతులు ఎఫెక్టివ్ గా పనిచేసత్ాయి . ఈ మెంతుల ప్రేగుల్లో చేరిన వ్యర్థాలను మరియు ఎక్ససివ్ మ్యూకస్ ను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . దాంతో అపెండిక్స్ వచ్చే అవకాశం ఉండదు మరియు నొప్పి కూడా నివారించబడుతుంది.

ఒక కప్పు నీటిలో 2 చెంచాలా మెంతులను వేయాలి. ఈ నీటిని 15నిముషాలు బాగా బాయిల్ చేయాలి. తర్వాత వడగట్టి గోరువెచ్చగా తాగాలి . అలాగే వంటల్లో చేర్చడం వల్ల కూడా నొప్పి మరియు ఇన్ఫ్లమేసన్ తగ్గించుకోవచ్చు.

నిమ్మరసం:

నిమ్మరసం:

అపెండిక్స్ నివారణకు అత్యంత ప్రయోజనకారి. ఈ నేచురల్ సిట్రస్ జ్యూస్ నిప్పి మరియు వాపును నివారిస్తుంది . అజీర్ణం మరియు మలబద్దకం నివారిస్తుంది. అదనంగా ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది .

ఒక నిమ్మపండు పూర్తిగా రసం పిండి, అందులో తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజులో అప్పుడప్పుడు కొద్దిగా తీసుకుంటుండాలి. కొన్ని వారాలు క్రమంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తులసి:

తులసి:

అపెండిక్స్ ఉన్న వారిలో లోగ్రేడ్ ఫీవర్ ఉంటుంది. అందుకు తులసి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, జ్వరం తగ్గిస్తుంది . ముఖ్యంగా తులసి అజీర్తి మరియు గ్యాస్ నివారణకు గ్రేట్ రెమెడీ.

గుప్పెడు ఆకులను గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి . నీరు సగం అయ్యే వరకూ మరిగించి వడగట్టి, అందులో తేనె మిక్స్ చేయాలి. ఈ టీని రోజూ రెండు సార్లు , కొన్ని వారాల పాటు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

 పుదీనా:

పుదీనా:

అపెండిక్స్ కు మరో ఎఫెక్టివ్ హోం రెమెడీస మింట్ . ఇది పేగులోని గ్యాస్ నివారిస్తుంది. అలాగే వాంతులు మరియు వికారం కూడా తగ్గిస్తుంది . అపెండిక్స్ వల్ల వచ్చే నొప్పి కూడా తగ్గిస్తుంది.

ఒక కప్పు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి 10నిముషాలు బాగా మరిగించాలి . తర్వాత వడగట్టి అందులో కొన్ని చుక్కల తేనెను మిక్స్ చేయాలి . ఈటీని రోజుకు రెండు మూడు సార్లు కొన్ని వారాల పాటు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది .

జెన్సింగ్ :

జెన్సింగ్ :

ఇందులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఎఫెక్టివ్ హోం రెమెడీస్.

6నుండి 8 వరకూ జెన్సింగ్ వేర్లను మూడు కప్పుల నీటిలో వేసి బాయిల్ చేయాలి. 15 నిముషాలు బాగా మరిగించి తర్వాత వడగట్టాలి. తర్వాత దీనికి కొద్దిగా తేనె మిక్స్ చేసి గోరువెచ్చగా తాగాలి.

Story first published: Saturday, May 14, 2016, 16:35 [IST]
Desktop Bottom Promotion