For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతులు, పాదాల్లో ఇబ్బందిపెట్టే చెమట నివారించే ఎఫెక్టివ్ రెమెడీస్..!

ఎదుటి వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఇబ్బందిపడుతున్నారా ? ఎవరైనా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు చేయి కలిపి హాయ్ చెప్పాలంటే.. ఆలోచిస్తున్నారా ? మీ అరచేతుల్లో, పాదాల్లో ఎక్కువగా ఉండే చెమటే కారణమా ?

By Swathi
|

ఎదుటి వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఇబ్బందిపడుతున్నారా ? ఎవరైనా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు చేయి కలిపి హాయ్ చెప్పాలంటే.. ఆలోచిస్తున్నారా ? దీనికి కారణం మీ అరచేతుల్లో, పాదాల్లో చాలా అదనంగా వస్తున్న చెమట, దుర్వాసనే కారణమా ?

Home Remedies for Sweaty Palms and Feet

అయితే మీరు ఒక్కరే కాదు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నది. మీ లాగే చాలామంది చెమటతో కూడిన అరచేతులు, పాదాల సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. చాలా అదనపు చెమట మీలో ఏర్పడినప్పుడు ఇలా చేతులు, పాదాల్లో చెమట ఎక్కువగా పడుతుంది. మీ చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతలు, మీ యాక్టివిటీ లెవెల్, ఒత్తిడిని బట్టి కూడా.. చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది.

అధిక చెమటను న్యాచురల్ గా తగ్గించే టాప్ సొల్యూషన్స్అధిక చెమటను న్యాచురల్ గా తగ్గించే టాప్ సొల్యూషన్స్

మెడికల్ పరంగా ఇది చెమట పట్టడాన్ని హైపర్ హిడ్రోసిస్ అని పిలుస్తారు. ఈ కండిషన్ లో ఉన్నవాళ్లకు శరీరంలోని ఏ భాగంలో అయినా చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. అయితే చాలా సాధారణంగా అరచేతులు, పాదాలు, అండర్ ఆర్మ్స్, ముఖంలో పడుతూ ఉంటాయి.

చాలామందిలో జెనెటికల్ రీజన్స్ వల్ల అంటే పేరెంట్స్ లేదా తోబుట్టువులకు ఈ సమస్య ఉండటం వల్ల కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే అన్ హెల్తీ లైఫ్ స్టైల్, అన్ హెల్తీ డైట్, పోషకాహార లోపం వల్ల కూడా.. అదనపు చెమట, దుర్వాసన సమస్యలు ఎదురవుతాయి. మరి అరచేతులు, పాదాల్లో ఎక్కువ చెమటను నివారించడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో చూద్దాం..

వెనిగర్

వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఆస్ట్రిజెంట్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఎక్సెసివ్ స్వెట్టింగ్ ని కంట్రోల్ చేస్తుంది. ముందుగా చేతులు, పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత కాటన్ బాల్ ని యాపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి మీకు ఎక్కువగా చెమట పట్టే భాగాల్లో అప్లై చేయాలి. రాత్రంతా అలాగే వదిలేసి.. ఉదయం స్నానం చేసి.. బేబీ పౌడర్ అప్లై చేయాలి.

వెనిగర్ , రోజ్ వాటర్

వెనిగర్ , రోజ్ వాటర్

ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే.. వెనిగర్ లో నీటిని కలిపి అప్లై చేసుకోవాలి. లేదా రోజ్ వాటర్, వెనిగర్ రెండింటినీ సమానంగా తీసుకుని రోజుకి రెండు మూడు సార్లు అప్లై చేయాలి.

నిమ్మరసం

నిమ్మరసం

చేతులు, పాదాలలో చెమట తగ్గించడంలో నిమ్మరసం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే బ్యాక్టీరియాని తొలగించి.. తాజా సువాసన వచ్చేలా సహాయపడుతుంది. ఒన నిమ్మకాయలో రసం తీసి, 1 టీస్పూన్ బేకింగ్ సోడాలో కలపాలి. మెత్తగా మిక్స్ చేసి.. చెమట ఎక్కువగా పట్టే భాగాల్లో అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చేయాలి.

టమోటా

టమోటా

కూలింగ్, ఆస్ట్రిజెంట్ ప్రాపర్టీస్ ఉన్న టమోటాలు.. అదనపు చెమటను కంట్రోల్ చేయడంలో ఎఫెక్టివ్ గా ఫలితాన్నిస్తాయి. టమోటాను రెండు ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు టమోటా ముక్కతో.. చేతులు, పాదాలపై బాగా రుద్దాలి. కాసేపటి తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. లేదా ప్రతిరోజూ ఒక కప్పు టమోటా జ్యూస్ ని ఒకవారం రోజులు తాగితే తగ్గిపోతుంది.

బ్లాక్ టీ

బ్లాక్ టీ

ప్రతిరోజూ ఉదయాన్నే బ్లాక్ టీ తాగినా.. ఇలా చేతులు, పాదాల్లో చెమట తగ్గుతుంది. లేదా ఒక పెద్ద గిన్నెలో బ్లాక్ టీ తయారు చేసుకోవాలి. చల్లారిన తర్వాత చేతులు లేదా పాదాలను 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే సమస్య తగ్గుతుంది. అలాగే రోజుకి 2 లేదా 3 కప్పుల బ్లాక్ టీ తాగాలి.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

చెమట సమస్య నివారించడంలో టీ ట్రీ ఆయిల్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. 4 నుంచి 5 చుక్కల టీట్రీ ఆయిల్ ని ఒక గిన్నె గోరువెచ్చని నీటిలో కలపాలి. ఇందులో కాటన్ బాల్ ముందు.. రబ్ చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుమూడు సార్లు చేయాలి.

మెగ్నీషియం రిచ్ ఫుడ్స్

మెగ్నీషియం రిచ్ ఫుడ్స్

పాదాలు, చేతులలో ఎక్కువగా చెమట పట్టడానికి శరీరంలో మెగ్నీషియం లోపం కూడా కారణమై ఉండవచ్చు. మెగ్నీషియం చెమటను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మెగ్నీషియం ఎక్కువగా లభించే బాదాం, అవకాడో, అరటిపండ్లు, బీన్స్, గుమ్మడి విత్తనాలు, సోయా మిల్క్, జీడిపప్పు, వాల్ నట్స్, బంగాళాదుంపలను తొక్కతో తినాలి. అలాగే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి.

English summary

Home Remedies for Sweaty Palms and Feet

Home Remedies for Sweaty Palms and Feet. Are you afraid of shaking someone’s hand because your palms are sweaty? Are you embarrassed by your smelly feet due to excess sweat?
Story first published: Thursday, December 15, 2016, 10:29 [IST]
Desktop Bottom Promotion