For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సన్ స్ట్రోక్ ( వడదెబ్బ ) గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన లక్షణాలు, జాగ్రత్తలు

By Swathi
|

సమ్మర్ వచ్చిందంటే.. అందరికీ హడలే. ఎండాకాలం అంటే బయట మాత్రమే కాదు.. ఇంట్లో కూడా చాలా హాట్ గా ఉంటుంది. చెమట, ఉక్కపోత కారణంగా.. ఏమాత్రం అనుకూలంగా ఉండదు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా... ఒంట్లో వేడిగానే ఉంటుంది. ఇంట్లో ఉండలేం. బయటకు వెళ్లలేం. అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా భారీగా పెరిగిపోతుంది. ఇలాంటి హాట్ వెదర్ ని ఫేస్ చేయడం ప్రతి ఒక్కరికీ ఛాలెంజింగ్ గానే ఉంటుంది.

సమ్మర్ వచ్చిందంటే.. సన్ స్ట్రోక్ బెంబేలెత్తిస్తుంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో.. చాలామంది వడదెబ్బ బారిన పడుతుంటారు. ఈ వడదెబ్బనే హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ అని పిలుస్తారు. కొంతమంది వడదెబ్బ ధాటికి ప్రాణాలే కోల్పోతుంటారు. తీవ్రస్థాయిలో ఉండే ఎండలకు వడదెబ్బ లేదా సన్ స్ట్రోక్ తగలకుండా.. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వడదెబ్బ లక్షణాలు తెలుసుకోవడం చాలా అవసరం.

ఎండవేడిమి, వడదెబ్బ తట్టకోవడానికి టాప్ 12 సమ్మర్ డ్రింక్స్

సమ్మర్ సీజన్ లో ముఖ్యంగా.. శరీరంలో ఫ్లూయిడ్ లెవెల్స్ పడిపోకుండా.. జాగ్రత్త తీసుకోవాలి. ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గిపోతే.. శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. అలాగే ఆల్కహాల్, కాఫీ వంటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.

బయట ఎక్కువగా తిరగడం వల్ల సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో కేర్ తీసుకోవడం చాలా అవసరం. ఏప్రిల్ లోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక మే వచ్చిందంటే.. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా అలర్ట్ గా ఉండాలి. వడదెబ్బని చాలా తీవ్రంగా పరిగణించాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37 డిగ్రీలు ఉండాలి.. కానీ.. 40 డిగ్రీలకంటే మించకూడదు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఉందంటే.. శరీరంలో ముఖ్యమైన అవయవాలపై దుష్ర్పభావం పడుతుంది. కాబట్టి ఇప్పుడు వడదెబ్బ లక్షణాలు, వడదెబ్బ నివారించే హోం రెమిడీస్ తెలుసుకుందాం..

తలనొప్పి

తలనొప్పి

శరీరంలో ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గడం లేదా తీవ్రంగా డీహైడ్రేషన్ అయినప్పుడు.. వడదెబ్బ తగులుతుంది. అలాంటప్పుడు ముందుగా కనిపించే లక్షణం తలనొప్పి. తీవ్రమైన తలనొప్పి ఇబ్బంది పెడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు.

బ్రీతింగ్

బ్రీతింగ్

వడదెబ్బ తగిలినప్పుడు శ్వాస వేగంగా ఉంటుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది.

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

ఎండల కారణంగా, వడదెబ్బ తగిలినప్పుడు చర్మ సమస్యలు కనిపిస్తాయి. చర్మంపై దద్దుర్లు రావడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వికారం

వికారం

వడదెబ్బ తగలడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అలాగే.. వికారంగా అనిపించడం, వాంతులు ఎక్కువగా అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చెమట

చెమట

ఎక్కువగా చెమట పట్టడం, అంటే సాధారణంగా కంటే.. తీవ్రంగా చెమట పట్టడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలు.. వడదెబ్బకు సంకేతంగా గుర్తించాలి.

బయటకు వెళ్లేముందు

బయటకు వెళ్లేముందు

ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా.. ఎక్కువ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లే ముందు నిమ్మరసం తాగడం ఉత్తమం. లేదా ఒక టీ స్పూన్ పంచదార, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా 200 ఎమ్ఎల్ నీటిలో కలుపుకుని తాగడం మంచిది.

ఆనియన్ జ్యూస్

ఆనియన్ జ్యూస్

వడదెబ్బ నివారించడానికి ఆనియన్ జ్యూస్ చక్కటి హోం రెమిడీ. అనేక అధ్యయనాలు, నిపుణులు సన్ స్ట్రోక్ కి చక్కటి పరిష్కారంగా దీన్నే సూచిస్తారు. కాబట్టి వడదెబ్బ తగిలినప్పుడు ఆనియన్ జ్యూస్ ని చెవుల వెనక భాగం, చెస్ట్ పైనా రాయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. లేదా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేయించి, జీలకర్ర, తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలాగే సలాడ్స్, చట్నీలలో ఉల్లిపాయలు కలుపుకుని తీసుకోవడం మంచిది.

చింతపండు రసం

చింతపండు రసం

చింతపండులో విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. వేడినీటిలో చింతపండు నానబెట్టాలి. తర్వాత ఆ నీటిలో పంచదార కలిపి తీసుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తుంది.

ఆమ్ పన్నా

ఆమ్ పన్నా

ఆమ్ పన్నా.. అనేది మార్కెట్ లో దొరుకుతుంది. దీన్ని మామిడికాయలతో చేస్తారు. ఇందులో జీరా, మిరియాలు వంటి శరీరాన్ని కూల్ చేసే గుణాలున్న మూలికలు ఉంటాయి. కాబట్టి వడదెబ్బ తగిలిన వాళ్లు ఆమ్ పన్నా తీసుకోవడం వల్ల త్వరిత ఉపశమనం కలుగుతుంది.

మజ్జిగ

మజ్జిగ

మజ్జిగలో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. కాబట్టి వడదెబ్బ తగిలినప్పుడు తరచుగా మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరినీళ్లు

కొబ్బరినీళ్లు

మంచినీళ్లు ఎక్కువగా తాగలేనప్పుడు కొబ్బరినీళ్లు చక్కటి పరిష్కారం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించి.. ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

కొత్తిమీర లేదా పుదినా జ్యూస్

కొత్తిమీర లేదా పుదినా జ్యూస్

కొత్తిమీరతో గానీ, పుదీన ఆకులతో గానీ జ్యూస్ తయారు చేసుకుని కొంచెం చక్కెర కలుపుకుని తాగడం వల్ల సన్ స్ట్రోక్ నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఈ సింపుల్ హోం రెమిడీ బాడీలో హీట్ ని తగ్గిస్తుంది. ఒకవేళ శరీరంపై దురద వస్తుంటే.. కొత్తిమీర జ్యూస్ అప్లై చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

తులసి విత్తనాలు

తులసి విత్తనాలు

తులసి విత్తనాలను రోజ్ వాటర్ లో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

సోపు

సోపు

సోపు గింజలు శరీరంలో టెంపరేచర్ ని వేగంగా తగ్గిస్తాయి. ఇవి శరీరాన్ని కూల్ చేస్తాయి. కాబట్టి గుప్పెడు సోపు గింజలు తీసుకుని రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఫలితం ఉంటుంది.

వెనిగర్

వెనిగర్

ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లేదా, చల్లటి నీటిలో కొన్ని చుక్కల వెనిగర్ మిక్స్ చేసి, తేనె కలుపుకుని తాగడం వల్ల.. శరీరం కోల్పోయిన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ని అందిస్తుంది.

అలోవెరా జ్యూస్

అలోవెరా జ్యూస్

అలోవెరాలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల వడదెబ్బ నివారించడం తేలికవుతుందని నిపుణులు చెబుతున్నారు.

English summary

Home Remedies and Symptoms Treat Heat Stroke/ Sun Stroke

Home Remedies and Symptoms Treat Heat Stroke/ Sun Stroke. The angry summer sun is unforgiving and makes most of us run to the hills. One of the most common problems associated with staying outdoors for too long is catching a heat stroke/sun stroke.
Story first published:Tuesday, April 5, 2016, 15:46 [IST]
Desktop Bottom Promotion