For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేంజరస్ టి.బి వ్యాధిని వారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..

|

క్షయ రోగాన్ని ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణించేవారు . కానీ క్రమేపీ దాన్ని నిరోధించటం, నివారించటం మొదలైంది . అసలు టి.బి అంటే ఏమిటి? అదెలా సోకుతుంది?ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగచేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి. శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావచ్చు. అనగా శ్వాసకోశేతర భాగాలు ఎముకలు, కీళ్ళు, లింపు గ్రంధులు, మెదడు పొరలు, మూత్ర పిండాలు, గర్భ సంచి మొదలైనవి.

వ్యాధి లక్షణాలు : మూడు వారాలకి పైగా దగ్గు, కఫం, సాయంత్రం, రాత్రి సమయాలలో జ్వరం, బరువు తగ్గుట, ఆకలి తగ్గుట, దగ్గు కఫంతోపాటు రక్తంపడుతుంది.

వ్యాపించే విదానం:
క్షయ వ్యాధి ఉన్న రోగి దగ్గినప్పుడు క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపించుతాయి. క్షయ వ్యాధి గ్రస్తుడు దగ్గినపుడు, అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి జబ్బుకి పునాది వేస్తుంది.

నివారణ: వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతతోపాటు ఇళ్లలో గాలి, వెలుతురు మొదలైనవి బాగా ఉండేలా చూసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మిన ప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ కళ్లె ఉమ్మేయకూడదు.ఉమ్మి వేయడానికి మూత ఉన్న కప్పు ఉప యోగించాలి. మంచి పోషకాహారం తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప జేసుకోవాలి.

వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి . డాక్టర్లు సూచించే మందులతో పాటు ఈ హోం రెమెడీస్ ను ఉపయోగించినట్లైతే టిబి వ్యాధిని నేచురల్ గా తగ్గించుకోవడంతో పాటు ఇన్ఫెక్షన్స్ సోకకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు ఈ వ్యాధి విస్తరించకుండా నివారించుకోవచ్చు . ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన కొన్ని హోం రెమెడీస్ టిబి లక్షణాలను నివారించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. మరి క్షయ(టిబి) నివారించే ఆ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం...

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు అనాల్జిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి . టిబి నివారలో మరియు రికరెన్స్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . పాలు మరియు గార్లిక్ డికాషన్ తాగడం వల్ల ట్యుబర్ క్యులోసిస్ ను గ్రేట్ గా నివారించుకోవచ్చు . 4 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి, వాటిని మేకపాల్లో వేసి బాగా మరిగించాలి . అందులోనే కొబ్బరి పాలను కూడా వేసి పాలు సగం అయ్యే వరకూ మరిగించాలి . దీనికి కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపు తీసుకోవాలి. 6 వారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మునగాకు లేదా మునగకాడలు:

మునగాకు లేదా మునగకాడలు:

మునగాకులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ట్యుబర్ కులోసిస్ లక్షణాలు నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . లంగ్స్ లోని బ్యాక్టీరియాను బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గిస్తుంది. మునగాకును ఒక గ్లాసు నీటిలో మరిగించి అందులో కొద్దిగా బ్లాక్ పెప్పర్, నిమ్మరసం మిక్స్ చేసి రోజూ కొద్దిగా తాగాలి. లేదా వారంలో మూడు సార్లు తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది.

 బ్లాక్ పెప్పర్ :

బ్లాక్ పెప్పర్ :

ట్యుబర్ కులోసిస్ చెస్ట్ కంజెషన్, ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పి కలిగి ఉంటుంది .ఈ సమస్యలను నివారించుకోవడానికి బ్లాక్ పెప్పర్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . బ్లాక్ పెప్పర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ట్యూబర్ క్యులోసిస్ కు ఇది ఒక వండర్ ఫుల్ రెమెడీ . పాన్ లో బట్టర్ వేసి అందులో కొన్ని మిరియాలు వేసి, ఇంగువ వేసి వేగించుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి , దీన్ని ప్రతి రోజూ మూడు డోసులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

బరువు తగ్గించుకోవడానికి ఎక్సలెంట్ హోం రెమెడీస్ గ్రీన్ టీ అని మనందరికీ తెలుసు. కానీ, మీకు తెలుసా...ప్రాణాంతక వ్యాధి అయిన టిబిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, ఇది ఇమ్యూనిటి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే ఫాలీఫినాల్స్ అనే కాంపౌండ్స్ ఉండటం వల్ల టిబి బ్యాక్టీరియాను ఫ్లష్ అవుట్ చేస్తుంది. రోజుకు రెండు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల టిబి వ్యాధిని నివారించుకోవచ్చు.

పుదీనా:

పుదీనా:

పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ అనాలంజిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ట్యుబర్ క్యులోసిస్ కు గ్రేట్ హోం రెమెడీ . ఇది ఎయిర్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది . టిబితో బాధపడే వారిలో వాపులు మరియు నొప్పులను నివారిస్తుంది. . బాడీ రెసిస్టెంట్ పవర్ ను పెంచుతుంది. . ఇది టిబితో పోరాడే గుణాలు అధికంగా ఉండటం వల్ల స్ట్రాంగ్ గా పోరాడుతుంది. పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. క్యారెట్ మరియు పుదీనా రసం లంగ్ టానిక్.

ఉసిరికాయ:

ఉసిరికాయ:

ఈ గ్రీన్ స్కిన్ బిట్టర్ ఫ్రూట్ టిబి నుండి ఉపశమనం కలిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది. ఉసిరికాయలో ఉండే విటమిన్ సి, వ్యాధినిరోధక శక్తి పెంచడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. లంగ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాను బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఆమ్లాను మెత్తగా పేస్ట్ చేసి, జ్యూస్ తీసి, అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపు తీసుకోవాలి.

English summary

Home Remedies For Tuberculosis Which Actually Work

According to an estimate by the World Health Organization, 2.5 million people in India in the year 2015 were reportedly suffering from TB. Out of the global 9.6 million cases reported across the globe, 2.5 million were alone from India. Now, that's a shocking number!
Story first published: Friday, September 9, 2016, 17:00 [IST]