For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చెమట మరియు దుర్వాసన నివారించే సమ్మర్ టిప్స్

|

వేసవి కాలం వచ్చిందంటే చాలు...చాలా మంది ఇంటి నుంచి బయటకు రావడమే మానేస్తారు. వేసవిలో భూమి, సూర్యునికి కొద్ది దగ్గరగా వెళతాడు. దాంతో సూర్యుని ప్రతాపం భూమి ఎక్కువ అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా మానవుని మీద పడటం వల్ల శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది. ఫలితంగా శరీరంలో వున్న కొవ్వు పదార్థాలు చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా కొవ్వు చెమట రూపంలో బయటకు రావడం వల్ల శరీరం మొత్తం దుర్వాసన వస్తుంటుంది. అంతే కాకుండా మన చుట్టూపక్కల ఉన్న వాతావరణ కలుషిత పదార్థాలు, దుమ్ము, ధూళి మొత్తం మన శరీరం నుండి వెలువడి చెమటలో కలిసిపోయిన, మరింత దుర్వాసన వస్తుంటుంది.

అధిక చెమటను న్యాచురల్ గా తగ్గించే టాప్ సొల్యూషన్స్

ఈ సమస్య నుండి బయటపడాలంటే కేవలం డియోడరెంట్స్ కానీ, ఇతర క్రీములు కానీ వాడటం వల్ల ఉపయోగడం ఉండదు. ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తాయి. కాబట్టి చెమట దుర్వాసనను శాశ్వతంగా తొలగించుకోవడానికి వైద్యనిపుణులు మనకు కొన్ని హోమ్ రెమెడీస్ ను పరిచయం చేస్తున్నారు. వీటినిక కనుక క్రమం తప్పకుండా పాటిస్తే..వేసవిలో చెమట నుండి మరియు చెమట వాసన నుండి విముక్తి పొంది తాజాగా ఉండవచ్చు..

వేసవిలో చెమట వాసన నుండి బయట పడే మార్గాలు...

వ్యక్తిగత పరిశుభ్రత:

వ్యక్తిగత పరిశుభ్రత:

వేసవిలో శరీరం నుండి చెమట విడుదల సాధారణ విషయమే..అయితే మన శరీరం మొత్తం చుట్టూ స్వేదగ్రంథులు వుండటం వల్ల చెమట నుంచి దుర్వాసన ఏర్పడుతుంది. సాధారణ కాలంలో ఇవి శరీరాన్ని చల్లగా ఉంచేందుకు సహాయపడుతాయి. కానీ వేసవిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల, మాయిశ్చరైజర్ వల్ల బ్యాక్టీరియాలు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఫలితంగా శరీరం దుర్వాసనగా మారుతుంది. అటువంటి సమయాల్లో ప్రతి రోజూ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చొప్పున రోజుకు రెండు సార్లు స్నానం చేస్తే...మన శరీరం చుట్టూ ఉన్న స్వేదగ్రంథులు కూడా శుభ్రం అవుతాయి. దాంతో శరీర దుర్వాసన కూడా పూర్తిగా నివారించబడుతుంది.

సరైన దుస్తులు ధరించండం:

సరైన దుస్తులు ధరించండం:

నేచురల్ ఫైబర్ తో తయారుచేసిన దుస్తులను గానీ, కాటన్ దుస్తులను గానీ, వేసవికాలంలో ధరించుకుంటే..శరీరం నుండి వెలువడే చెమట దుర్వాసనను సాధ్యమైనంతవరకూ అరికట్టవచ్చు. ఎందుకంటే ఇవి శరీరం నుండి వెలువడిన చెమటను ఎప్పటికప్పుడు పీల్చేసి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఈ రకమైన దుస్తుల్లో గాలి చొరబడడానికి వీలుగా ఫ్రీగా ఉంటాయి. దీంతో శరీరం ఎంతో శుభ్రంగా డ్రైగా ఉంటుంది. ఎండాకాలంలో సింథటిక్‌ వస్త్రాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. కాటన్‌ దుస్తులను ధరించడం వల్ల కొంతవరకు చెమటను అరికట్టవచ్చు.

ఆహార పదార్థాలలో జాగ్రత్తలు:

ఆహార పదార్థాలలో జాగ్రత్తలు:

సాధారణంగా మానవుని ఆరోగ్య పరిస్థితులు అతను తీసుకునే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటాయి. అలాగే వేసవిలో కూడా వాతావరణానికి తగ్గట్టు కొన్ని ఆహారాలను తిరస్కరించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా స్పైసీ ఫుడ్ ను తగ్గించుకోవాలి. ఎందుకంటే..స్పైసీ ఫుడ్ శరీర ఉష్ణోగ్రతను పెంచి, చెమటను బయటకు రప్పించడానికి కారణం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ వీటిని తీసుకోకూడదు.

నేచురల్ స్టెరిలైజర్:

నేచురల్ స్టెరిలైజర్:

శరీరంలోని కొన్ని చిన్న చిన్న ప్రదేశాల్లో నిత్యం చెమట వెలువడుతూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా అండర్ ఆర్మ్ వంటి ప్రదేశంలో చెమట ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రదేశంలో టీట్రీ ఆయిల్, విట్చ్ హాజెల్ వంటి స్టెరిలైజర్స్ తో శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే నేచురల్ యాంటీ సెప్టిక్స్ లను ఉపయోగించడం వల్ల అవి శరీరంలో ఉన్న బ్యాక్టీరియాలను తొలగించి, దుర్వాసనను నివారిస్తాయి.

 స్మోక్ చేయకూడదు:

స్మోక్ చేయకూడదు:

సహజంగానే స్మోకింగ్ చేయడం ఒక చెడు అలవాటు. ఎందుకంటే ..స్మోకింగ్ చేస్తున్న సమయంలో శ్వాస లోపలికి పీల్చే సమయంలో చెడు పదార్థాలు అన్ని లోపలికి చేరి, శ్వాసక్రియకు హాని కలిగిస్తాయి. ఊపిరితిత్తులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరంలో వేడిని పెంచడానికి ఇది దోహదపడుతుంది. టొబాకోలో ఉండే కెమికల్స్ చర్మంలోకి చాలా సున్నితంగా చొచ్చుకుని పోతాయి. ఫలితంగా బయటకు వచ్చిన చెమట దుర్వాసన రావడం మొదలవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ స్మోకింగ్ ను మానేయడానికి ప్రయత్నించాలి.

సాధారణ సబ్బులను ఉపయోగించాలి.

సాధారణ సబ్బులను ఉపయోగించాలి.

స్నానం చేసేటప్పుడు తేమ కలిగిన సబ్బులకు బదులుగా సాధారణ సబ్బులను ఉపయోగించాలి. వేప ఔషధాలు కలిగిన సబ్బులను ఉపయోగిస్తే చెమట దుర్వాసనను మాయం చేయవచ్చు.

 కాఫీ, కోలా డ్రింక్స్‌,

కాఫీ, కోలా డ్రింక్స్‌,

కాఫీ, కోలా డ్రింక్స్‌, బ్లాక్‌ టీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎక్కువగా ఉప్పు, కారం ఉన్న కూరలు అధిక చెమటకు కారకాలు. కాబట్టి వీటికి దూరంగా ఉండడం వల్ల చెమట బారి నుంచి బయటపడొచ్చు.

యాంటీ సెప్టిక్ డియోడరెంట్ ను ఎంపిక చేసుకోవాలి:

యాంటీ సెప్టిక్ డియోడరెంట్ ను ఎంపిక చేసుకోవాలి:

ఇది మీ శరీరం నుండి చెమట వాసను దూరం చేయడం మాత్రమే కాదు, మీశరీరం నుండి తాజా వాసన వచ్చేలా చేస్తుంది. అంతే కాదు, చెమటను పట్టడం నివారిస్తుంది.

టాల్కం పౌడర్ ను ఉపయోగించాలి:

టాల్కం పౌడర్ ను ఉపయోగించాలి:

దీన్ని మనం చాలా తక్కువగా అంచనా వేస్తాం కానీ, దీన్ని ఉపయోగించడం వల్ల చాలా వ్యత్యాసం కనబడుతుంది. టాల్కం పౌడర్ ఉపయోగించడం వల్ల మిమ్మల్ని ఫ్రెష్ మార్చడం మాత్రమే కాదు, ఇది చెమట దుర్వాసను నిర్మూలిస్తుంది, ముఖ్యంగా వేసవికాలంలో దీనివల్ల ఎక్కువ ప్రయోజనం.

నిమ్మరసం:

నిమ్మరసం:

చెమటను, చెమట వాసనను నివారించడంలో నిమ్మరసం ఒక ఉత్తమ హోం రెమెడీ. నిమ్మతొక్కతో చంకల్లో రుద్ది, స్నానం చేయడం వల్ల చెమటను నివారించడంతో పాటు, చంకల్లో నలుపును నివారిస్తుంది.

English summary

How to Control Sweat and Body Odor During Summer

Summer is the cruellest season of all. Most of us feel uneasy after 3-4 hours of work, even if while sitting in an air conditioned room. Sweating causes this uneasiness. Keeping our body fresh and odor free all day long is really a challenging issue in a tropical country like India, as the humidity level reaches to the extreme.
Story first published: Monday, April 18, 2016, 12:35 [IST]
Desktop Bottom Promotion