For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపు ఉబ్బరం నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Super
|

కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కడుపు ఉబ్బుకొని పైకి కనబడుతుంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు మీ కడుపు నిండుగా ఉన్నట్లు మరియు అన్ని సమయాల్లో టైట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం వల్ల ఉదరభాగం బిగదీసుకు పోయి పట్టేసినట్లు ఉండి, అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండిన భావన, ఒళ్లు నొప్పులు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి వివిధ లక్షణాలు అన్నీ కాని, లేదా వీటిలో కొన్ని కాని ఉంటాయి. ఇలా అనిపించడానికి ప్రధానకారణం కడుపు ఉబ్బరం. మరియు మీకు అనిపించవచ్చు ఎందుకు ఇలా కడుపు ఉబ్బరంగా ఉందని? కడుపు ఉబ్బరం అంటే కడుపులో ఎక్సెసీవ్ గ్యాస్, ఉడటం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. మలబద్దకం, ఎక్కువగా తినటం, చెడు ఆహారపు అలవాట్లు, మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు గాలి మింగడం, చీకాకు పెట్టే పేగు వ్యాధి మరియు pms(బహిష్టకు పూర్వ లక్షణంతో)కడుపు ఉబ్బరానికి సాధారణ కారణాలు.

హెత్తీ ఫుడ్సే కానీ, గ్యాస్ట్రిక్ మరియు పొట్టఉబ్బరానికి కారణం అవుతాయి? మరి నివారణ ఎలా?

కాబట్టి మీరు తీసుకొనే డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకు మీరు ఒక కఠినమైన డైట్ ను అనుసరించాల్సిన పనిలేదు కానీ, మీ డైట్ లో కొన్ని మంచి ఆహారాలను, అదీ కడుపు ఉబ్బరంతో పోరాడే లక్షణాలు కలిగిన ఆహారాల తీసుకోవడం వల్ల అవి కడుపులో ఎసిడిటిని నిరోధిస్తాయి మరియు జీర్ణక్రియ క్రమంగా జరిగేలా సహాయపడుతాయి . కొన్ని వెజిటేబుల్స్ లో ఉన్న ఎంజైములు పొట్టలో ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడానికి సహాయపడుతాయి దాంతో తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతాయి . సరైన టైమ్ లో భోజనం తినకపోయినా లేదా స్కిప్ చేసి కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. దాంతో అధిక ఆమ్లత సమస్యలు మరియు ప్రేగులలో గ్యాస్ ఏర్పాటు ఉంటుంది.

ఇబ్బంది కలిగించే గ్యాస్ర్టిక్ ట్రబుల్ తగ్గించే న్యాచురల్ హోం రెమిడీస్

బౌల్ మూమెంట్ లో గ్యాస్ విడుదలవ్వడం వల్ల పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. అయినా కూడా కడుపుబ్బరం తగ్గనట్లైతే కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి అవేంటోతెలుసుకుందాం..

సోంపు:

సోంపు:

కడుపు ఉబ్బరంను నయం చేసే లక్షణాలు సోంపులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే భోజనం చేసిన వెంటనే సోంపు నములుతుంటారు కొందరు. ఇది ప్రేగులో గ్యాస్ ను మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి.

పుదీనా:

పుదీనా:

కొద్దిగా పుదీనా ఆకులను శుభ్రం చేసి, నీటిలో వేసి బాగా మరగ కాచి, ఆ నీటిని గోరువెచ్చగా భోజనం తర్వాత తాగాలి. ఇలా చేస్తుంటే బ్లోటింగ్ మరియు క్రాంప్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. నరాలను బలోపేతం చేసి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

అల్లం:

అల్లం:

యాసిడ్ రిఫ్లెక్షన్ కు అల్లం ఒక ఉత్తమ ఆహారం. అల్లంను యాంటీఇన్లమేటరీ మరియు జీర్ణకోశ వ్యాధులకు కొరకు పురాతన కాలం నుండి చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అల్లంలో ఉండే జింజరాల్ మరియు షోగోల్స్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి . పొట్ట ఉదరభాగంలో గ్యాస్ చేరకుండా నివారిస్తుంది.

చమోమెలీ టీ:

చమోమెలీ టీ:

కడుపుబ్బరాన్ని తగ్గించే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీస్ చమోమెలీ టి. ఈ హేర్బల్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది పొట్టకు ఉపశమనం కలిగిస్తుంది మరియు హార్ట్ బర్న్ తగ్గిస్తుంది.

 కారవే సీడ్స్:

కారవే సీడ్స్:

కొన్ని కారవే సీడ్స్ ను నోట్లో వేసుకొని నమలడం ద్వారా ఉపశమనం కలుగుతుంది . చాలా త్వరగా తిన్న ఆహారం జీర్ణం అవుతుంది . కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ మార్గం.

గుమ్మడి:

గుమ్మడి:

డైలీ డైట్ లో గుమ్మడిని చేర్చుకోవడం వల్ల కడుపుబ్బరం నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు . కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ రిలీవ్ అవుతుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అరటి:

అరటి:

అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంది. అరటిపండ్లు మలబద్దానికి కారణమయ్యే గ్యాస్ మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి . కాబట్టి, అరటిపండ్లలో ఉండే పొటాషియం అనే మినిరల్స్ శరీరంలో ఫ్లూయిడ్ లెవల్స్ రెగ్యులేట్ చేస్తుంది. బ్లోటింగ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

లెమన్ వాటర్ :

లెమన్ వాటర్ :

కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, కొంత మంది ద్రవాలు త్రాగడాన్ని నిరాకరిస్తుంటారు. కాబట్టి, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కొన్ని ద్రావాలను కొద్దిగా కొద్దిగా త్రాగడం చాలా అవసరం. ముఖ్యంగా, గోరువెచ్చని నీటికి నిమ్మరసం మిక్స్ చేసి త్రాగడం వల్ల ఒక అద్భుత మ్యాజిక్ చేస్తుంది. త్రాగిన 30నిముషాల్లోనే మీరు ఫలితాన్ని గమనించవచ్చు. ఈ డ్రింక్ ను మీరు ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం మొదలు పెడితే మరింత ఉత్తమ ఫలితాలను పొందచ్చు.

English summary

How to Get Rid of Bloating

How to Get Rid of Bloating,Abdominal bloating is a condition in which the stomach feels full and tight due to buildup of gas in the small intestine. This can make the stomach area visibly swollen. Many times, bloating is accompanied by other symptoms like cramps, belching, pain, diarrhea, shortness of breath
Story first published: Tuesday, February 23, 2016, 18:04 [IST]
Desktop Bottom Promotion