For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొంతులో అడ్డుపడిన ఆహారాన్ని తొలగించడానికి సింపుల్ టిప్స్

By Super Admin
|

కొన్నిరకాల ఆహారపదార్ధాలు తినేటపుడు, మీరు నమలడం పూర్తైన తరువాత కొన్ని ఆహార పదార్ధాల ముక్కలు గొంతులో ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్పీ గా, క్యాండీ ముక్కలు వంటివి చాలా గట్టిగా లేదా కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటి వల్ల అలా జరుగుతుంది. గొంతులో అడ్డం పడిన పదార్ధాల వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా వాటిని తొలగించడానికి అనేక తేలిక మార్గాలు ఉన్నాయి.

ఈ రకంగా మీ గొంతు మూసుకుపోతే, అది శ్వాసపై ప్రభావం చూపుతుంది, అపుడు మీరు వెంటనే తెలివిగా దానిని బైటికి తీయడానికి ప్రయత్నించండి లేదా అత్యవసర సేవకు వెళ్ళండి. కింద ఇచ్చిన చిట్కాలు మీ గొంతులో అడ్డంపడిన ఆహారాన్ని తొలగించడానికి ప్రాధమికంగా, స్వల్ప అడ్డంకులకు, మీరు దానివల్ల అసౌకర్యంగా బాధపడుతున్నారంటే మాత్రమే ఉపయోగపడతాయి.

1. కొద్దిగా నీరు త్రాగడానికి ప్రయత్నించండి.

1. కొద్దిగా నీరు త్రాగడానికి ప్రయత్నించండి.

మీరు ఆహరం తీసుకునేటపుడు గొంతులో ఎందుకు అడ్డం పడుతుంది అనేదానికి అనేక కారణాలు ఉన్నాయి, చాలా ఆహారాలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుందని మీకు తెలుసు, అందువల్ల మీకు ఆ ముక్క వల్ల ఎక్కువ ఇబ్బంది లేదు అనుకుంటే, ఇది గొంతులో లాలాజలంతో సహజంగా కరిగిపోతుంది. అలా జరగకపోతే, కొద్దిగా నీరు త్రాగడానికి ప్రయత్నించండి. ఈ పద్ధతికి నీరు ఉపయోగపడుతుంది. గొంతులో అడ్డం పడిన ఆహారపు ముక్కను తొలగించడానికి మీరు ఒక కప్పు వేడి నీటిని లేదా వేడి టీ కూడా తాగొచ్చు. నీరు గోరువెచ్చగా ఉండాలి, కానీ ఎక్కువ వేడిగా ఉంటే గొంతు మంట పుడుతుంది.

నిల్చుని నీరు తాగినపుడు ఆహరం లోపలికి వెళ్ళనపుడు నేలమీద వెల్లకిలా పడుకుని, రెండు లేదా మూడుసార్లు నీటిని తాగండి.

2. గోరువెచ్చటి ఉప్పు నీటితో పుక్కిలించండి.

2. గోరువెచ్చటి ఉప్పు నీటితో పుక్కిలించండి.

ఆహరం అడ్డంపడినపుడు, మీరు కొద్దిగా గోరువెచ్చటి ఉప్పు నీటితో పుక్కిలించండి. కడుపు నిండినపుడు జాగ్రత్తగా ఉండండి, పుక్కిలించేటపుడు వాంతి అయ్యే ప్రమాదం ఉంది. గొంతు దగ్గర నీటితో వత్తిడి కలిగించినపుడు వాంతి అయ్యే ప్రమాదం ఉంది.

3. తేలికపాటి ఆహరం తినడానికి ప్రయత్నం చేయడం.

3. తేలికపాటి ఆహరం తినడానికి ప్రయత్నం చేయడం.

గొంతులో అడ్డంపడిన ఆహారాన్ని తొలగించడానికి మరో మార్గం, ఏదైనా తేలికపాటి ఆహరం తినడానికి ప్రయత్నం చేయడం. ఇలాంటి సందర్భాలలో ఎక్కువగా బ్రెడ్ ముక్కలు తినడం సహజం. ఈ బ్రెడ్ ముక్క త్వరగా ఉమ్మిలో కలిసిపోయి త్వరగా అరుగుతుంది. అన్ని సందర్భాలలో, ఇది గొంతులో ఉన్న ముక్కను కిందకు తోస్తుంది. ఒకవేళ ముక్క గొంతుకు గట్టిగా అడ్డంపడితే, మీరు తిన్నది బైటికి ఉమ్మేయవచ్చు.

గొంతులో అడ్డం పడిన ఆహరం ముక్క చిన్నదిగా ఉంటే, ఒక చెంచా తేనె తీసుకున్నా కూడా సహాయపడుతుంది. ఆ పదార్ధం నిర్మాణం దాన్ని కిందకు నెట్టడానికి సహాయపడుతుంది.

4. గొంతుతో చిన్నగా దగ్గడం.

4. గొంతుతో చిన్నగా దగ్గడం.

మీరు మరో చిట్కాను కూడా ప్రయత్నించవచ్చు అదేంటి అంటే, మీరు గొంతుతో చిన్నగా దగ్గడం. ఇది గొంతును బిగుతుగా చేసి, గొంతులో ఇరుక్కున్న కణాలు తొలగించడానికి సహాయపడుతుంది. అయితే, దగ్గిన తరువాత శ్వాస తీసుకునేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఆహరం ముక్కను పీల్చినపుడు, బైటికి రావడం కష్టమౌతుంది.

5. కేవలం అపోహపడుతుంటే

5. కేవలం అపోహపడుతుంటే

ఈ చిట్కాలు పనిచేయట్లేదా? అయితే మీ గొంతులో ఏమీ అడ్డం పడి ఉండదు కానీ మీరు అలా అయి౦దేమోనని అనుకోని ఉండొచ్చు. మీ గొంతులో ఆహరం అడ్డం పడినట్టు మీరు ఎందుకు అనుకుంటున్నారో మా ఆర్టికిల్ పై దృష్టి పెట్టండి, వాటికి అనువైన కారణాల గురించి నేర్చుకోండి.

6. డాక్టర్ ను కలవాలి:

6. డాక్టర్ ను కలవాలి:

ఈ వ్యాసం కేవలం సమాచారం కోసమే, వైద్య చికిత్సలు సూచించడానికి, రోగనిర్ధారణ సృష్టించడానికి ఎవరికీ అధికారం లేదు. మీకు ఏరకమైన పరిస్థితి కానీ, నొప్పి కానీ ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది

English summary

How to Remove Food Stuck in the Throat

If your throat is blocked in a way that is affecting your breathing, you should try the Heimlich manoeuvre or go to the emergency immediately. The tips given below to remove food stuck in the throat are basic and for minor obstructions, and are only useful if the blockage is only causing you discomfort.
Story first published:Wednesday, September 21, 2016, 16:30 [IST]
Desktop Bottom Promotion