For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై కఫ్ కు ఇన్ స్టాంట్ రిలీఫ్ కలిగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

సాధారణంగా సీజన్(ఋతువులు) మారుతున్నప్పుడు అంటే ఒక సీజన్‌ నుండి మరో సీజన్‌లోకి అడుగు పెడుతున్నప్పుడు, శరీరంలోని రక్షణ వ్యవస్థ త్వరగా వాతావరణ మార్పులకు అనుగుణంగా సర్దుబాటుకాక, తేలికగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడే అవకాశముంటుంది. ఇలా సీజన్‌ మారుతున్న సందర్భంలో జలుబు, జ్వరం వంటి సమస్యలతో పాటు చాలా మంది పొడి దగ్గుతో వేధించబడుతుంటారు.

వెైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌, పరాన్న జీవుల వలన కలిగిన ఇన్‌ఫెక్షన్‌ మొదట పొడి దగ్గుతోనే ఆరంభమై బాధిస్తుంటుంది. గొంతు, ముక్కులో ప్రారంభమైన ఇన్‌ఫెక్షన్‌, ఊపిరితిత్తుల వరకూ ప్రయాణించి, శ్వాస మార్గాల లోపల ఉండే 'మ్యూకోసా'పొరను దెబ్బ తిస్తాయి. ఫలితంగా పొడిదగ్గు మొదలెై సతాయిస్తుంది. సాధారణంగా ఏ దగ్గు అయినా, వారం రోజులలో తగ్గాలి. వారం దాటినా పొడి దగ్గు వేధిస్తుంటే మాత్రం ప్రమాదకరమైన సమస్య ఉన్నదని భావించి జాగ్రత్తపడాలి, దగ్గుతోపాటు జ్వరం, తలనొప్పి, ఆయాసం ఉంటే రక్తపరీక్ష, ఊపిరితిత్తుల ఎక్స్‌రే, శ్వాసకోశాల పరీక్ష చేయించుకోవాలి.

Incredible Remedies For An Instant Relief From Dry Cough

వైద్య పరంగా కాకుండా సహజ పద్ధతుల ద్వారా మీ పొడిదగ్గును తగ్గించుకోవాలంటే ఈ హోం రెమడీస్ ను అనుసరించాల్సిందే. ఈక్రింది లిస్ట్ తయారుచేయబడినా ఈ హోం రెమడీస్ మన వంటగదిలో అతి సులభంగా లభించే వస్తువులే. హోం రెమడీస్ ను ఉపయోగించడం సురక్షితం మరియు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పొడి దగ్గు నివారించుకొనేందుకు మీరు ఉపయోగించే ఈ హోం రెమడీస్ మీకు అలెర్జీని కలిగించవచ్చు. అందుకనీ మీరు వీటిని ఉపయోగించేటప్పుడు ప్రత్యేక శ్రద్ద వహించడం చాలా అవసరం.

పొడిదగ్గు తగ్గించే ఆ హోం రెమడీ ఏంటో చూద్దాం..

Incredible Remedies For An Instant Relief From Dry Cough

గార్గిలింగ్: దగ్గను నివారించుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి కదా. అలాంటి వాటిలో గార్గిలింగ్ కూడా ఒకటి . గోరెవచ్చని సాలినే వాటర్ తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది .

Incredible Remedies For An Instant Relief From Dry Cough

తేనె మరియు హాట్ మిల్క్: గొంతు ఇన్ఫెక్షన్ ను నివారించడంలో తేనె అద్భుతంగా సహాయపడుతుందాని చాలా పరిశోధనలు నిరూపించాయి. దగ్గు నుండి చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.దగ్గను కంట్రోల్ చేయడంలో తేనె గొప్పగా సహాయపడుతుంది. ఎందుకంటే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పెంచుతుంది. దాంతో బ్రాంకైటిస్ ను నివారించుకోవచ్చు. పాలు లేదా టీలో తేనె మిక్స్ చేసి త్రాగండి చాలు. చాలా ఎఫెక్టివ్ ఫలితాలను అందిస్తుంది. ఇన్ఫ్లమేషన్ మరియు అసౌకర్యం తగ్గిస్తుంది.

Incredible Remedies For An Instant Relief From Dry Cough

పసుపు: పొడిదగ్గు నివారణకు పసుపు కూడా ఒక మంచి నేచురల్ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్. మొదట ఇది దగ్గును తగ్గిస్తుంది. తర్వాత శ్వాసనాళం వాపు, మరియు మ్యూకస్ ను నివారిస్తుంది. పసుపును తేనెతో మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఒక చెంచా పసుపును పాలలో వేసి బాగా మరిగించి తర్వాత కాలీ కడుపుతో ఈ పాలను తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు . అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కామెర్లు మరియు ఎసిడి ఉన్నవారు, ఈ చిట్కాను ఉపయోగించకూడదు.

Incredible Remedies For An Instant Relief From Dry Cough

దగ్గు నివారణకు ఇది ఒక ఇన్ స్టాంట్ హోం రెమెడీ. స్టీమ్ షవర్ వల్ల స్రావాలు విడుదల చేస్తుంది మరియు దాంతో జలుబు మాత్రమే తగ్గించడం కాదు, అలర్జీ లేదా ఆస్తమా వల్ల వచ్చే దగ్గును కూడా ఇది తగ్గిస్తుంది. స్టీమింగ్ వల్ల ప్లేతోర రెస్పరేటరీ సమస్యలు తగ్గించుకోవడం చాలా సులభం, డ్రై కఫ్ తగ్గించుకోవడంతో పాటు, ఇతర శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయి.

English summary

Incredible Remedies For An Instant Relief From Dry Cough

Dry cough is often deemed as non-productive cough, as it produces no phlegm or mucus. It is often a result of viral infection or a build-up of dirt or bacteria in the breathing airway passage. Experts believe that the root cause for this respiratory problem could be atmospheric pollutants, allergies or infection-causing viruses.
Story first published: Saturday, June 25, 2016, 7:36 [IST]
Desktop Bottom Promotion