For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ సీజన్ లో ఆరెంజ్ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు...

ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఐరన్, మ్యాంగనీస్, జింక్, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, మొదలగునవి అందుతాయి. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ లో క్యాలరీలు ఉండువు. ఆరోగ్యం మీద ప్రభావం చూపే ఎలాంటి క్యాలరీలు లేకపోవడం

|

ప్రకృతి ప్రసాధించిన పండ్లలో ఒకటి ఆరెంజ్. ఇది సీజనల్ ఫ్రూట్ . చూడటానికి పసుపుపచ్చ రంగులో ఉండే పాపుర్ ఫ్రూట్ . వింటర్ సీజన్లో ఇవి ఎక్కువగా పండుతాయి. పండ్లలో అద్భుతమైన పండు ఆరెంజ్ చూడటానికి కళ్లకు కలర్ ఫుల్ గా ఆకర్షించడం మాతరమే కాదు, టేస్ట్ గా , జ్యూసీగా ఉండే ఈ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి .

ఆరెంజ్ లో ఉండే న్యూట్రీషియన్స్ కార్డియో వ్యాస్కులర్ సమస్యలను మాత్రమే కాకుండా, క్యాన్సర్, గ్యాస్ట్రోఇన్ టెన్షనల్ డిజార్డర్స్ తో పోరాడుతుంది. ఆరెంజ్ ను తొక్క తొలగించి నేచుగా తొలను తినడం కానీ లేదా జ్యూస్ రూపంలో కానీ తీసుకోవచ్చు. లేదా ఫ్రూట్ సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఆరెంజ్ జ్యూస్ రూపంలోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది.

ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్ గా తాగడం వల్ల బాడీ రిఫ్రెష్ అవ్వడం మాత్రమే కాదు, ఇందులో ఉండే మినిరల్స్, ఫ్లెవనాయిడ్స్, విటమిన్స్ మరియు ఫైటో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి మాత్రమే కాకుండా, శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే ఇతర విటమిన్స్ కూడా చాలా ఉన్నాయి . ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఐరన్, మ్యాంగనీస్, జింక్, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, మొదలగునవి అందుతాయి. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ లో క్యాలరీలు ఉండువు. ఆరోగ్యం మీద ప్రభావం చూపే ఎలాంటి క్యాలరీలు లేకపోవడం వల్ల ఇది ఆరోగ్యానికి సూపర్ ఫ్రూట్ అని చెప్పవచ్చు.

మరి ఈ సూపర్ ఫూట్ లో ఉండే గ్రేట్ బెనిఫిట్స్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...

క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడి, క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది:

క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడి, క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది:

ఆరెంజెస్ లో సిట్రస్, లెమనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి స్కిన్, లంగ్స్, బ్రెస్ట్ , స్టొమక్ మరియు కోలన్ క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడి, క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయి.

కిడ్నీ వ్యాధులను నివారిస్తుంది:

కిడ్నీ వ్యాధులను నివారిస్తుంది:

ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులను గ్రేట్ గా నివారిస్తుంది. కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

ఆరెంజ్ లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బాడీలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

హార్ట్ హెల్త్ :

హార్ట్ హెల్త్ :

ఆరెంజ్ జ్యూస్ లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హార్ట్ ఫంక్షన్స్ ను మెరుగుపరుస్తుంది. పొటాషియం లెవల్స్ తగ్గడం వల్ల శరీరంలో హార్ట్ రిథమ్ అబ్ నార్మల్ గా మారుతుంది. దీన్నే అరెత్రిమియా అని పిలుస్తారు.

వ్యాధుల బారీన పడకుండా కాపాడుతుంది:

వ్యాధుల బారీన పడకుండా కాపాడుతుంది:

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఫ్రీరాడికల్స్ సెల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది క్యాన్సర్ మరియు హార్ట్ డిసీజ్ వంటి క్రోనిక్ వ్యాధులను నివారిస్తుంది.

 మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

ఆరెంజ్ జ్యూస్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణరసాలను క్రమబద్దం చేస్తుంది. దాంతో మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

ఆరెంజ్ లో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే హెస్పర్డిన్ బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

చర్మానికి రక్షణ కల్పిస్తుంది:

చర్మానికి రక్షణ కల్పిస్తుంది:

ఆరెంజెస్ లో ఉండే బీటా కెరోటిన్, పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ చర్మ కణాలు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ఆరెంజ్ వల్ల ఇది మరో టాప్ బెనిఫిట్. ఆరెంజ్ లోనే ఈ వాల్యుబుల్ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఈ వింటర్ సీజన్ లో మిస్ కాకండి..

English summary

It's The Season For Oranges & Let's See Its Top Health Benefits!

It's the season for oranges and have you reaped the health benefits of oranges yet? Read this article to find out its top health benefits.
Story first published: Tuesday, December 20, 2016, 8:10 [IST]
Desktop Bottom Promotion