For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోయా ఉత్ప‌త్తుల ద్వారా పొందే అమోఘ‌మైన ప్ర‌యోజ‌నాలు

By Nutheti
|

గింజ ధాన్యాలలో సోయా చాలా ప్రత్యేకమైనది. మిగిలిన ఆహార పదార్థాలతో పోలిస్తే సోయాలో అనేక పోష‌క‌విలువ‌లుంటాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉంచే స‌త్తా సోయాలో ఉంటుంది. అలాగే ఇవి త్వరగా జీర్ణమ‌వుతాయి. కాబ‌ట్టి వీటిని అన్ని వయసుల వాళ్లు తీసుకోవచ్చు.

సోయాలో శరీరానికి అవసరమైన ఎమినో యాసిడ్స్, లైసీన్ ల తోపాటు ఇసోఫ్లేవిన్స్ ఉంటాయి. సోయాలో పాలు, మాంసం, కోడిగుడ్ల ద్వారా పొందే పోష‌కాలు సోయా ద్వారా పొంద‌వ‌చ్చు. సోయా ఉత్ప‌త్తుల్లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి రెగ్యుల‌ర్ డైట్ లో సోయా ఉత్ప‌త్తులు వాడ‌టం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఇంత‌కీ సోయా ఉత్ప‌త్తులు తీసుకోవ‌డం ద్వారా పొందే హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

క్యాన్స‌ర్ నివారిణి

క్యాన్స‌ర్ నివారిణి

సోయా ఉత్ప‌త్తుల్లో ఫైటో ఈస్ర్టోజెన్స్ ఉంటాయి. ఈ హార్మోన్ పురుషుల‌లో టెస్టోస్టెరోన్ హార్మోన్ హార్మోన్ ఉత్ప‌త్తిని నిరోధిస్తోంది. టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్ప‌త్తి త‌గ్గ‌డం వ‌ల్ల పౌరుష గ్రంధి క్యాన్స‌ర్ పెరుగుద‌ల త‌గ్గుతుంది. కాబ‌ట్టి డైట్ లో సోయా ఉత్ప‌త్తుల‌ను చేర్చుకోవ‌డం చాలా ఇంపార్టెంట్.

గుండె వ్యాధులు

గుండె వ్యాధులు

సోయాలో ఉండే ప్రొటీన్స్ త‌క్కువ కొవ్వు ప‌దార్థాలు పొందేలా చేస్తాయి. అలాగే సోయా ఉత్ప‌త్తిలు తీసుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి.

ఎముకల బలానికి

ఎముకల బలానికి

సోయా ఫ్యామిలీకి చెందిన ఉత్ప‌త్తుల్లో ఫైటో ఈస్ర్టోజెన్స్ ఉంటాయి. ఇవి శ‌రీరంలో క్యాల్షియం గ్ర‌హించ‌టాన్ని ఎక్కువ‌ చేసి, ఎముక‌ల బ‌లానికి స‌హాయ‌ప‌డ‌తాయి. విట‌మిన్ డి, క్యాల్షియం ఎక్కువ‌గా ఉండే సోయా ఉత్ప‌త్తులు రోజూ వాడ‌టం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారుతాయి.

మధుమేహానికి

మధుమేహానికి

ఆరోగ్యకరమైన ఫైబర్ ఉన్న సోయా ఆహారాలు తీసుకోవటం వల్ల‌ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. కాబ‌ట్టి మ‌ధుమేహంతో బాధ‌ప‌డేవాళ్లు సోయా ఉత్ప‌త్తులు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం.

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి

సోయాలో సాపోనిన్ లు ఉంటాయి. ఇవి శ‌రీరంలో కొవ్వు ప‌దార్థాలు చేర‌కుండా కాపాడ‌తాయి. అలాగే సూక్ష్మ‌జీవుల‌ను చంపి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

రొమ్ము క్యాన్సర్

రొమ్ము క్యాన్సర్

సోయా ఉత్పత్తులు తీసుకోవ‌డం వ‌ల్ల ఇందులో ఉండే ఐసో ఫ్లావనాయిడ్స్ ఫైటో ఈస్ట్రోజేన్ లా ప‌నిచేస్తాయి. ఈస్ట్రోజేన్ చర్యను తగ్గించి, ట్యూమర్ ల ఏర్పాటును తగ్గిస్తాయి. దీనివ‌ల్ల రొమ్ము క్యాన్స‌ర్ రిస్క్ త‌గ్గుతుంది.

రుతుక్రమం

రుతుక్రమం

రుతుక్రమం సమయంలో, ఈస్ట్రోజేన్ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. దీని వ‌ల్ల‌ వారు డిప్రెషన్, మానసికంగా ప్ర‌శాంత‌త‌, నిద్రలేమి వంటి ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డానికి ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి.

English summary

Know The Nutritional Benefits Of Soy products

Soybean is a legume that is considered as a very rich nutritional food. Mostly preferred by vegans, this legume is high in protein. The presence of phytochemicals such as polyphenol, phytates, isoflavones and saponins in soybeans increases its health benefits.
Story first published: Sunday, January 3, 2016, 11:59 [IST]
Desktop Bottom Promotion