For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కనీసం వారానికి ఒకసారి ఖచ్చితంగా శనగలు తినాలి..!! ఎందుకు ?

By Swathi
|

శనగల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్షకాలికంగా.. ఎంతో ప్రయోజనాలు చేకూరుస్తాయి. వెజిటేరియన్స్.. ప్రొటీన్ పొందడం కాస్త కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు.. ఏడాది మొత్తం అందుబాటులో ఉండే.. శనగలు తీసుకోవడం చాలా మంచిది. శనగల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ ని తేలికగా పొందవచ్చు.

శనగలను.. పేదవాడి బాదాం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. బాదాంలో లభించే ప్రొటీన్ శాతం.. శనగల ద్వారా కూడా పొందవచ్చు. అందుకే.. అత్యంత ఖరీదైన బాదాం కంటే.. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే.. శనగలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

శనగల్లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ బలాన్ని మాత్రమే కాదు.. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తాయి. ఆకలిని కంట్రోల్ లో ఉంచుతాయి. శనగల్లో చాలా రకాలున్నాయి. తెల్ల శనగలు, నల్ల శనగలు, మొలకెత్తినవి ఉంటాయి. మొలకెత్తిన శనగలు తినడం శరీరానికి చాలా ఆరోగ్యకరం.

శనగల్లో ఉండే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుంటే.. వాటిని కనీసం వారానికి ఒకసారైనా తినడానికి ఇష్టపడతారు. ఖచ్చితంగా డైట్ లో చేర్చుకుంటారు. మరీ ఆ బెన్ఫిట్స్ ఏంటో చూద్దామా..

కొలెస్ట్రాల్ కంట్రోల్

కొలెస్ట్రాల్ కంట్రోల్

శనగల్లో సొల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. ఇవి.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి.

నిద్ర మెరుగుపడటానికి

నిద్ర మెరుగుపడటానికి

శనగల్లో ఉండే ఎమినో యాసిడ్స్, ట్రైప్టోఫాన్, సెరోటొనిన్ వంటివి.. మంచి నిద్రను అందిస్తాయి. నిద్రలేమితో బాధపడేవాళ్లకు శనగలు మంచి ఆప్షన్.

అనీమియా నివారించడానికి

అనీమియా నివారించడానికి

శరీరంలో ఐరన్ లోపం వల్ల అనీమియా వస్తుంది. శనగల్లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి.. వీటి ద్వారా తేలికగా అనీమియా నివారించవచ్చు.

హార్ట్ డిసీజ్

హార్ట్ డిసీజ్

శనగల్లో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడం ద్వారా.. గుండె సంబంధిత సమస్యలు దూరంగా ఉంటాయి.

అలసట తగ్గడానికి

అలసట తగ్గడానికి

శనగల్లో ఐరన్, ప్రొటీన్, మినరల్స్ ఉంటాయి. ఇవి మీ శరీరానికి ఎనర్జీని అందిస్తాయి. అలాగే శనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. మిమ్మల్ని స్ట్రాంగ్ గా మార్చి.. ఎల్లప్పుడు ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయపడతాయి.

ఎముకల బలానికి

ఎముకల బలానికి

శనగల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి.. పాలతో సమానం. మీకు తెలుసా ? గుర్రాల ఎముకలు ఎందుకంత స్ట్రాంగ్ గా ఉంటాయో ? గుర్రాల డైట్ లో ఎక్కువ శనగలే ఉంటాయి. కాబట్టి.. తరచుగా డైట్ లో శనగలు చేర్చుకుంటే.. ఎముకలు స్ట్రాంగ్ గా మారతాయి.

కిడ్నీలకు

కిడ్నీలకు

శనగల్లో ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ లెవెల్ ని పెంచుతుంది. అదనపు ఉప్పుడు బయటకు పంపుతుంది. అలాగే కీడ్నీల్లో పేరుకున్న మలినాలను బయటకు పంపడంలో.. శనగలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

టెన్షన్ తగ్గడానికి

టెన్షన్ తగ్గడానికి

శనగల్లో ఎమినో యాసిడ్స్, ట్రిప్టోఫాన్, సెరోటనిన్ ఉంటాయి. ఇవి.. స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.

కామెర్లు నివారించడానికి

కామెర్లు నివారించడానికి

శనగల్లో ఐరన్, మినరల్స్ ఉంటాయి. ఇవి.. కామెర్లు నివారించడానికి పర్ఫెక్ట్ రెమిడీ. శరీరం కోల్పోయిన పోషకాలు అందివ్వడంలో శనగలు.. చాలా వేగంగా సహాయపడతాయి.

చర్మ వ్యాధులు నివారించడానికి

చర్మ వ్యాధులు నివారించడానికి

శనగల్లో మాంగనీస్, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. రింగ్ వార్మ్, దురద వంటి రకరకాల చర్మ సమస్యలను నివారిస్తాయి. ఎలాంటి చర్మ సమస్యలను వేగంగా తగ్గిస్తాయి.

English summary

Know Why Chana Is Better Than Almonds and Health Benefits

Know Why Chana Is Better Than Almonds and Health Benefits. Chickpeas or as we call it ‘Chana’ is a great source of protein and is quite beneficial for long run.
Story first published:Thursday, August 18, 2016, 15:05 [IST]
Desktop Bottom Promotion