For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూర్యరశ్మికి దూరమైతే.. క్యాన్సర్ కి దగ్గరైనట్టే..!!

By Swathi
|

మారుతున్నకాలం అనేక పరిణామాలను తీసుకొస్తోంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎండకు దూరమవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఉదయాన్నే ఆఫీలకు, స్కూళ్లకు పరుగులు పెట్టడం.. చీకటిపడ్డాక ఇంటికి చేరుకోవడమనేది ప్రస్తుతమున్న జీవనశైలి. దీంతో.. సూర్య భగవానుడి దర్శనమే కరువవుతోంది. ఇది కేవలం విటమిన్ డి లోపానికి మాత్రమే కాదు.. ప్రాణాంతకమైన క్యాన్సర్ కి కూడా కారణమవుతోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

READ MORE: సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

సన్ లైట్ ఎక్స్ పోజర్ తగ్గిపోతే.. విటమిన్ డి లోపిస్తుందని సాధారణంగా తెలిసిన విషయమే. కానీ.. దీనికంటే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయని.. అలాగే రక్త క్యాన్సర్ ( లుకేమియా ) వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

cancer

సూర్యరశ్మికి దూరమైతే.. ప్రధానంగా ఎదురయ్యే సమస్య విటమిన్ డి డెఫిసియెన్సీ. దీనికారణంగా ఎముకలు, కండరాలు బలహీనమవుతాయి. అలాగే క్యాల్షియం శరీరానికి గ్రహించడానికి విటమిన్ డి ప్రధాన పాత్ర పోషిస్తుంది. క్యాల్షియం ఎముకల బలానికి సహాయపడుతుంది. శరీరానికి కావాల్సిన క్యాల్షియం ఉపయోగించుకునేలా విటమిన్ డి పనిచేస్తుంది.

READ MORE: ఉచితంగా పొందే ఎండతో ఎన్నో ఉచితమైన ఆరోగ్య ప్రయోజనాలు..! READ MORE: ఉచితంగా పొందే ఎండతో ఎన్నో ఉచితమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

ఎవరైతే సన్ ఎక్స్ పోజర్ కి దూరంగా ఉంటారో వాళ్లలో లుకేమియా రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. లుకేమియా లేదా రక్తక్యాన్సర్ కి విటమిన్ డి లోపమే ప్రధాన కారణంగా ఈ స్టడీస్ గుర్తించాయి. అయితే ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. కాబట్టి ఎవరైతే సూర్యరశ్మికి దూరమవుతున్నారో.. వాళ్లు ఇప్పటికైనా జాగ్రత్త పడటం చాలా అవసరమని సూచిస్తున్నారు.

vitamin d

ఎప్పటికప్పుడు విటమిన్ డి లెవెల్స్ టెస్ట్ లు చేయించుకోవడం చాలా అవసరం. త్వరగా అలసిపోవడం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు మీలో గుర్తిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం అవసరమంటున్నారు. అలాగే రెగ్యులర్ డైట్ లో పాలు, పాల ఉత్పత్తులు చేర్చుకోవాలి. ఒక వేళ విటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి అంటే.. డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. కానీ.. రోజూ కాసేపైనా.. ఎండ తగిలేలా... మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్.

English summary

Less Sun Exposure Linked to Increased Risk of Cancer

Less Sun Exposure Linked to Increased Risk of Cancer. According to the findings of a new study, persons with lower sunlight exposure and greater prevalence of vitamin D deficiency, are at greater risk of developing cancer.
Story first published: Friday, January 8, 2016, 10:06 [IST]
Desktop Bottom Promotion