For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : 30 ఏళ్ళు తర్వాత వచ్చే మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్-వీటిని ఓ కంట కనిపెట్టండి.!!

|

చాలా మంది 30ఏళ్ళు వచ్చాయంటే చాలు, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యిందని భావిస్తారు. ఈ వయస్సులో ఎంజాయ్ చేయడానికి కాస్త ఎక్కువగా ఎఫొర్ట్ పెట్టాల్సి వస్తుంది.

స్త్రీలైనా, పురుషులైనా 30ఏళ్ళు దాటగానే ఆరోగ్య సమస్యలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ వయస్సులో వచ్చే ఆరోగ్య సమస్యల నుండి ఏమాత్రం తప్పించుకోలేము. ఈవయస్సులో తీసుకునే జాగ్రత్తల వల్లే ఫ్యూచర్ లో ఆరోగ్యంగా..సంతోషంగా జీవించగలుగుతారు. ఉదాహరణకు ఈ వయస్సులో మీరు తీసుకునే ఆహారాల మీద ప్రతేక శ్రద్ద లేకపోతే కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా పెరగడం, హైబ్లడ్ ప్రెజర్ , కార్డియో వాస్కులర్ డిసీజెస్ వంటి సమస్యలును ఫేస్ చేయాల్సివస్తుంది.

30ఏళ్ళలో పడిన తర్వాత వచ్చే మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ఏంటి? ఇది వయస్సుకు సంబంధించినది, ముఖ్యంగా మహిళలు వయస్సుతో పాటు, ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. బరువు పెరగడం, ఊబకాయం, స్కిన్ వదులవ్వడం, చర్మంలో ముడుతలు, చారలు ఏర్పడటం సహజంగా జరిగే మార్పులు. పురుషుల కంటే మహిళల శరీరంలో ఇటువంటి మార్పులు త్వరగా చోటు చేసుకోవడం వల్ల మరిన్ని ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

అటువంటప్పుడు కొన్నిముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, పాజిటివ్ గా మార్పులు చేసుకోవడం వల్ల ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల, ఎక్కువ పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల 30 ఏళ్ళ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. అలాగే సరైన విశ్రాంతి తీసుకోవడం మర్చిపోకూడదు. వ్యాయామం కూడా ముఖ్యమే..

30 దాటిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందో ఒక సారి తెలుసుకుందాం...

బ్రెస్ట్ క్యాన్సర్ :

బ్రెస్ట్ క్యాన్సర్ :

మహిళలు 30 ఏళ్ళు దాటిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ చెకప్ చేయించుకోవడం మంది. హార్మోనుల ప్రభావం వల్ల బ్రెస్ట్ లోపల కణుతలు ఏర్పడటం, శరీరంలో మార్పలు జరగడం జరుగుతుంది. ఇటువంటి కణుతులు అంత హానికరం కాకపోయినా, అవి క్యాన్సర్ కణాలుగా మారితే ప్రాణానికే ప్రమాదం. కాబట్టి రెగ్యులర్ గా మెడికల్ చెకప్స్ చేయించుకోవడం మంచిది. అలాగే సెల్ఫ్ ఎక్జామినేషన్ చేసుకోవడం మంచిది.

 సర్వికల్ క్యాన్సర్:

సర్వికల్ క్యాన్సర్:

30ఏళ్ళలో వచ్చే మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ లో సర్వికల్ క్యాన్సర్ ఒకటి. మహిళలు 30 నుండి 40ఏళ్ళ మద్య ఉన్నవారు ఈ సమస్యకు ఎక్కువ గురౌతుంటారు. అందువల్ల 30 నుండి 40ఏళ్ళ లోపు ఉన్న వారు పాప్ టెస్ట్ లేదా పెల్విక్ ఎక్సామినేషన్ చేయించుకోవడం మంచిది . ప్రతి సంవత్సరం మెడికల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతున్నది తెలుసుకోవచ్చు.

 ఓస్టిరియోఫోసిస్:

ఓస్టిరియోఫోసిస్:

ఈ రోజు దాదాపు ప్రతి 10 మంది మహిళల్లో 5గురు ఓస్టిరియోఫోసిస్ తో బాధపడుతున్నారు. మహిళల వయస్సు పెరిగే కొద్దిగా ఎముకలు వీక్ గా మారుతాయి. కొత్తగా బోన్ టిష్యులు ఏర్పడటానికి బదులుగా పాత బోన్ టిష్యులు గ్రహించడం వల్ల ఓస్టిరయోఫోసిస్ కు గురికావల్సి ఉంటుంది. రెగ్యులర్ గా వ్యాయమం, ప్రొపర్ ఫుడ్స్ తీసుకోవడం, సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హెల్తీగా జీవించవచ్చు.

టైప్ 2 డయాబెటిస్ :

టైప్ 2 డయాబెటిస్ :

ఇది మరో టాప్ హెల్త్ ప్రాబ్లమ్. గణాంకాల ప్రకారం 30 ఏళ్ళ తర్వాత 20శాతం మంది పురుషులు మరియు మహిళలు టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ వల్ల ఇతర సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్స్ కు గురికావల్సి వస్తుంది. కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం మంచిది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ :

రుమటాయిడ్ ఆర్థరైటిస్ :

30ఏళ్ళలో తర్వాత ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల 60ఏళ్ళవరకూ ఆరోగ్యంగా ఉండగలరు. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ . కాబట్టి ఇది జాయింట్ పెయిన్, ఇన్ఫ్లమేషన్, వాపు, మొదలగునవి తగ్గిస్తుంది. అందుకు మంచి ఆహారం తీసుకోవడం, డైట్ చార్ట్ ఫాలో అవ్వాలి, మెడికేషన్ మరియు వ్యాయామాలు చేయడం చాలా అవసరం.

టెస్టిక్యులర్ క్యాన్సర్:

టెస్టిక్యులర్ క్యాన్సర్:

చాలా మంది 40 నుండి 50ఏళ్ళ మద్యవయస్క్యులు ఈ సమస్యను ఎదుర్కొంటారని భావిస్తారు. కానీ, పురుషుల్లో వచ్చే మేజర్ హెల్త్ ప్రొబ్లమ్స్ లో ఇది ఒకటి. కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చాలా అవసరం. సంవత్సరంలో ఒక్కసారైనా మెడికల్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

హైబిపి:

హైబిపి:

మరో మేజర్ హెల్త్ ప్రొబ్లెమ్ హైబిపి. 30 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ లో ఇది ఒకటి. సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామలోపం, ఊబకాయం, స్ట్రెస్, ఆందోళన వంటివి ముఖ్య కారణాలు . అందుకు సరైన మెడికేషన్ తీసుకుని, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. హెల్త్ సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు.

English summary

Major Health Problems In The Thirties

Though many people think that at 30 you begin the second innings of your life, you need to put some effort to enjoy this phase.
Story first published: Thursday, August 18, 2016, 17:58 [IST]
Desktop Bottom Promotion