For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లవంగాల్లో దాగున్న ఆశ్చర్యకర ఔషధ గుణాలు

By Swathi
|

విరబూసే మొగ్గలా కనిపించే.. లవంగాలు ఘాటైన సువాసనతోపాటు, మసాలాల్లో పసందైన రుచిని అందిస్తాయి. విభిన్న రుచి కలిగిన లవంగాలతో పొందే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఆహారాలకు కమ్మని రుచిని, ఘుమఘుమలు అందించే లవంగాలను వంటకాల రూపంలోనే కాదు.. డైరెక్ట్ తీసుకున్నా మంచి ఫలితాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

cloves

లవంగాల్లో పొటాషియం, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే విటమిన్ సి, కె, బి కాంప్లెక్స్ లవంగాల ద్వారా పొందవచ్చు. వీటన్నింటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా నోటి దుర్వాసనతో బాధపడేవాళ్లు.. నిత్యం ఒక లవంగం నములుతూ ఉంటే.. మంచి ఫలితం పొందవచ్చు.

విటమిన్ ఏ
విటమిన్ ఏ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది క్యారెట్స్. అలాగే ఆకుకూరలు, కూరగాయలతో పొందవచ్చని భావిస్తారు. కానీ.. విటమిన్ ఏ, బీటా కెరోటిన్ లవంగాల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల కంటిచూపు మెరుగ్గా ఉండటంతోపాటు, స్కిన్ ప్రాబ్లమ్స్ దరిచేరవు. అలాగే ప్రాణాంతకమైన క్యాన్సర్లను నివారించడంలోనూ లవంగాలు పవర్ ఫుల్ గా పనిచేస్తాయి.

లవంగాల్లోని అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...

పంటినొప్పి
పంటినొప్పికి లవంగాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చిగుళ్ల వ్యాధిని, ఇన్ఫెక్షన్లను నివారించడంలో లవంగ నూనె చాలా బాగా పనిచేస్తుంది. లవంగ నూనెలో దూదిని ముంచి, పంటినొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకోవడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది.

acidity

పొట్ట ఉబ్బరం
తీసుకున్న ఆహారం జీర్ణం అవకపోవడం వల్ల.. పొట్ట ఉబ్బరం సమస్య వేధిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో.. లవంగాలు చక్కటి పరిష్కారం. కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు.. లవంగాలను నోట్లో వేసుకుని కాసేపు చప్పరిస్తూ ఉండాలి. దీని వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

English summary

Medicinal properties and health benefits of cloves

Medicinal properties and health benefits of cloves. The health benefits of cloves are so great that the spice is harvested profusely in Zanzibar and is used in folk-remedies around the world – including Chinese medicine.
Story first published: Monday, February 1, 2016, 9:58 [IST]
Desktop Bottom Promotion