For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తరచూ మూడ్ స్వింగ్స్ కు బ్రేక్ వేసే లవబుల్ ఫుడ్స్ ..

|

సాధారణంగా కొంత మందిని గమనించినట్లైతే ఒకసారి ఉన్నట్లు మరో సారి ఉండరు. కొంతసేపున్నట్లు మరింకొంత సేపు ఉండరు. సంతోషంగా ఉన్నట్లే ఉంటారు. కానీ అంతలోనే మూడీగా మారిపోతుంటారు. మాట్లాడుతుంటారు, కానీ కొద్దిసేపటికంత బుంగమూతి పెట్టి కూర్చుంటారు. ఎంత మంది మాట్లాడిన ప్రయోజనం ఉండదు, వారు అలా ఉండటానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించినా ఫలితం ఉండదు.

ఇలాంటి స్వభావం ఉన్న వారు మన చుట్టూ ఉన్నవారిలో చాలా మందే ఉంటారు. ఇలా తరచూ వారి మూడ్ మారిపోవడానికి మూడ్ స్వింగ్స్ అంటారు. ఏకారణం లేకుండానే ఎప్పటికప్పుడు వారి మూడ్ మారిపోతుంటుంది, అయితే అటువంటి వారి రోజూ తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పుల చేసుకుంటే వారి పరిస్థిలో తప్పకుండా మార్పు వస్తుందంటున్నారు నిపుణులు .

మరి ఆ మార్పులేంటి? ఏ మూడ్ లో ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో మనం కూడా తెలుసుకుందా...

Mood Swings and Ways to Handle

1. కెఫిన్ కు దూరంగా ఉండాలి:
కొంత మంది రాత్రుల్లో ఎక్కువ సేపు మేల్కొని ఉండటానికి కాఫీని ఎక్కువగా తీసుకుంటుంటారు . అప్పటికీ అది పనిచేసినా మరుసటి రోజు మాత్రం మూడ్ లో ఖచ్చితంగా మార్పులు ఉండటం మనం గమనించవ్చు. అందుకే ఇలా మూడ్ లో మార్పులు రాకుండా ఉండాలంటే కెఫిన్ కు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

Mood Swings and Ways to Handle

2. వ్యాయామం చేస్తే:
క్రమం తప్పకుండా రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫిట్ నెస్ ని సొంతం చేసుకోవడమే కాదు, మూడ్ ని కూడా నియంత్రించుకోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే బరువు కూడా వయస్సు, ఎత్తుకు తగినట్లుగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా శరీరంలోని హార్మోన్లు స్థాయిల క్రమబద్దీకరణ జరిగి మెదడు ఉత్తేజితమవుతుంది.

Mood Swings and Ways to Handle

3. సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు:
డిప్రెషన్ తో బాధపడే వారు రోజూ ఆహారంలో రెగ్యులర్ గా రోజూ తీసుకొనే ఆహారంలో 200గ్రామలు సెలీనియం ఉండేట్లు డైట్ ను ప్లాన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ ఉన్నవారిలో 7వారాల్లోపు చక్కటి మార్పు వస్తుందని అధ్యయనాల ద్వారా వెల్లడి చేశారు . ఉదాహరణకు చేపలు, పీతలు, నట్స్, త్రుణధాన్యాలు, బీన్స్ మొదలగునవి ఎక్కువగా తీసుకోవాలి.

Mood Swings and Ways to Handle

4. క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి:
ఏదో ఒక కారణంతో చాలా మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తుంటారు. కానీ దీని ప్రభావం ఆరోగ్యం మీద ఉంటుందంటున్నారు నిపుణులు . అంతే కాదు, పొద్దున్నే క్రమం తప్పకుండా తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ద్వారా అందే పోషకాలతో మూడ్ ను నియంత్రించుకోవచ్చట..!

Mood Swings and Ways to Handle

5. మూడ్ బట్టి ఆహారం :
ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి మూడ్ మారిపోకుండా నియంత్రించుకోవడం కుదరకపోవచ్చు. అటువంటిప్పుడు ఈ ఆహారపదార్థాలను ప్రయత్నించి చూడండి..
విఛారంగా ఉన్నప్పుడు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే చేపలు తినాలి.
కోపంగా ఉన్నప్పుడు వాల్ నట్స్ , అవిసెగింజలు తినాలి.
బాధగా అనిపించినప్పుడు డార్క్ చాక్లెట్ తినాలి.
ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నప్పుడు బ్లూబెర్రీస్ తినాలి.
ఆందోళనగా ఉన్నప్పడు చమొలైల్ టీ తాగాలి.

ఇలా మూడ్ ను బట్టి ఆయా పదార్థాలు ఆహారంగా తీసుకోవడం వల్ల తప్పకుండా పరిస్థితిలో మార్పు గమనించవచ్చు అంటున్నారు నిపుణులు .

English summary

Mood Swings and Ways to Handle..

Mood swings are a common problem of teenagers. Handling teenagers can be a little problematic for parents. Parents need to understand there kids issues and need to counsel them accordingly.
Story first published:Monday, May 30, 2016, 16:31 [IST]
Desktop Bottom Promotion